Mamagaru: ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరుగుతుంది కాదమ్మా అని సిరి దేవమ్మ అంటుంది. ఈ పెళ్లి వల్ల నువ్వు అత్తగారింటికి వెళ్తావు అనుకుంటున్నావు కానీ గంగాధర్ గంగ అందరూ ఇంటికి వస్తారు ఒక్కొక్కరు విడిపోతుంటే బాధపడేదాన్ని దేవుడా అందరు ఎప్పుడు కలిసి ఉంటారని మొక్కుకునేదాన్ని ఈ పెళ్లి ద్వారానైనా అందరూ కలిసి ఉంటారు ఆలోచించమా అని దేవమ్మ అంటుంది.
సిరి వాళ్ళది ఉమ్మడి కుటుంబం కాబట్టి మనది కూడా ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలని చెప్పారు కదా అందుకని మన కుటుంబాలు మళ్లీ కలుస్తాయి అని వసంత అంటుంది. సిరి ఆలోచనలో పడుతుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావ్ అని దేవమ్మ అడుగుతుంది. ఈ కుటుంబం విడిపోవడానికి మనకి పరిస్థితి రావడానికి కారణం నేనేనమ్మా నేను కోచింగ్ కి వెళ్లకపోయి ఉంటే పవన్ కంట పడి ఉండేదాన్ని కాదు అన్నయ్య అతన్ని కొట్టేవాడే కాదు జైలుకు వెళ్లేవాడు కాదు ఇదంతా నా వల్లే జరిగింది కాబట్టి నావల్ల అందరూ కలుస్తారంటే ఈ పెళ్లి తప్పకుండా చేసుకుంటాను అమ్మ అని సిరి అంటుంది. కట్ చేస్తే,
గంగ గంగాధర్ కి ఫోన్ చేద్దాము అనుకుంటుంది. గ్యాస్ బుక్ చేసి డబ్బులు ఇంట్లో పెట్టకుండా గంగ వెళ్ళిపోయింది అసలు ఎందుకు ఇన్ని సార్లు ఫోన్ చేశాడని తెలుసుకోవాలి కదా అందరూ పని పాట లేని వాడని అనుకుంటున్నారు ఇప్పుడు గంగ కూడా నన్ను అలాగే చూస్తుంది అని గంగాధర్ అనుకుంటాడు. గంగ గంగాధర్ కి ఫోన్ చేస్తూ ఉండగా ఫోన్ ఎత్తకపోయేసరికి ఇంతలో ఆఫీస్ బాయ్ వచ్చి సార్ పిలుస్తున్నాడని గంగతో చెప్పగానే గంగ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
శ్రీలక్ష్మి స్కూల్ కి వెళ్తూ ఉండగా దారిలో వసంత కనిపించి ఏంటక్కా ఇలా ఉన్నావ్ అని అడుగుతుంది. అక్క కొత్త బంగారులోకం కొత్త ప్రపంచం కొత్తగా రెక్కలు వచ్చాయి నేను జాబ్ చేస్తున్నాను అక్క అని శ్రీలక్ష్మి చెబుతుంది. వసంత కంగ్రాట్స్ చెబుతుంది. పిల్లలందరూ బాగున్నారా అని వసంత అడుగుతుంది. పిల్లలు నేను చాలా బాగున్నాం అక్క చాలా హ్యాపీ అని శ్రీలక్ష్మి అంటుంది. అక్క నాకు స్కూల్ టైం అవుతుంది వెళ్ళొస్తాను అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే,
గంగ వాళ్ళ సార్ కి ప్రాజెక్టు గురించి చెబుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గంగ అని వాళ్ళ సార్ అంటాడు. గంగ లాప్టాప్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఖాళీగా కనిపిస్తుంది గారు పడిపోయి గంగ అంతా చూస్తుంది. తను లేనప్పుడు ఆ ప్రోగ్రాం ని నేను కనెక్ట్ చేశాను అని పక్కన ఉన్న వాళ్ళు సంబరపడుతూ ఉంటారు. సార్ నాకు ఒక పది నిమిషాలు ఇస్తే ఎక్కడ మిస్టేక్ జరిగిందో చూస్తాను అని గంగ అంటుంది.ఇంట్లోని గొడవలు అన్నీ ఆఫీసులోకివస్తాయి ఇంట్లో మంచి కోడలు కా లేనప్పుడు మంచి ఉద్యోగి ఎలా అవుతుంది సార్ వాళ్ళ మామగారే చెప్పారు కదా మాకు అవకాశం ఇస్తే ప్రాజెక్టు గురించి నేను చెప్తాను అని ఆ అమ్మాయిలు ఇద్దరు అనడంతో సార్ ఓకే అంటాడు. వాళ్లు ప్రోగ్రాం చెప్పగానే సారు బాగా చెప్పారు వెరీ గుడ్ అని మెచ్చుకుంటాడు. గంగ నువ్వు నిజంగానే ఉద్యోగనికి పనికిరావు అని వాళ్ళ సార్ అంటాడు. అమ్మాయిలకి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. గంగ బాధతో బయటికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే.
చంగయ్య కళ్ళు మూసుకొని గంగాధర్ బట్టలు పిండుతున్న సంఘటనని గుర్తుకు తెచ్చుకుంటాడు. దేవమ్మ మజ్జిగ తెచ్చి చంగయ్య కి ఇస్తుంది. ఏం ఆలోచిస్తున్నారండి పెళ్లి గురించేనా అని దేవమ్మ అడుగుతుంది. నేనేం ఆలోచించట్లేదు దేవమ్మ ఈ పెళ్లి వ్యవహారం అంతా పెద్దోడికి అప్పగించాను వాడిని అడిగితే బాగుంటుంది అని చంగయ్య అంటాడు. మజ్జిగ తాగడం అయిపోయింది గ్లాస్ తీసుకొని వెళ్ళు అని చంగయ్య ఆడడంతో దేవమ్మ మౌనంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
గంగాధర్ చంగయ్య అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు…