NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

Varsham: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ హిట్ మూవీ వర్షం. వీరూ పోట్ల అందించిన క‌థ‌తో తెర‌కెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ చిత్రానికి శోభన్‌ దర్శకత్వం వహించారు. సుమంత్ ఆర్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్మెస్ రాజు వర్షం సినిమాను నిర్మించగా.. ప్రభాస్, చెన్నై సోయ‌గం త్రిష జంటగా నటించారు. టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్ విలన్ గా చేశాడు. అలాగే ప్రకాశ్ రాజ్, పరుచూరి వెంకటేశ్వర రావు, పావలా శ్యామల, చంద్రమోహన్, అజయ్, షఫీ, సత్యం రాజేష్, సుమ తదితరులు కీలక పాత్రలను పోషించారు. రాక్ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన వర్షం సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అప్ప‌ట్లోనే రూ. 18.5 కోట్ల రేంజ్ లో షేర్ వ‌సూళ్ల‌ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

వ‌ర్షం చిత్రాన్ని ఒడియాలో బర్సా మై డార్లింగ్, తమిళంలో మజై మరియు హిందీలో బాఘీ పేర్ల‌తో రీమేక్ చేశారు. అలాగే వ‌ర్షం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో టాలీవుడ్ లో ప్రభాస్ ను హీరోగా నిల‌దొక్కుకున్నాడు. కెరీర్ ను ప‌రుగులు పెట్టించాడు. ఇక‌ హీరోయిన్ త్రిష విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం. అయినప్పటికీ త్రిష అద్భుతంగా నటించింది. తన అంతం అభినయంతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. వర్షంలో ప్రభాస్, త్రిష కెమిస్ట్రీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

వర్షం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో త్రిషకు టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ తోనే బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ల చెంత చేరింది. ఇప్పటికీ తన ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. వర్షం మూవీలో అసలు హీరోయిన్ త్రిష కాదు. ప్రభాస్ కు జోడిగా త్రిష ఫస్ట్ ఛాయిస్ కాదు. మొదట ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని డైరెక్టర్ శోభన్ భావించారు.

అప్పటికే అతిథి అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి గంగోత్రి మూవీ ద్వారా అడుగు పెట్టింది. తన అందంతో కుర్ర కారు గుండెల్లో గుబులు రేపింది. ఈ నేపథ్యంలోనే అతిథి అగర్వాల్ ను వర్షంలో హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావించారు. కానీ అనుకోని కారణాల వల్ల అతిథి అగర్వాల్ ను పక్కన పెట్టి చివ‌ర‌కు త్రిషను హీరోయిన్ గా ఫైన‌ల్ చేశారు. త్రిష కెరీర్ కు వర్షం మూవీ ఎంతో హెల్ప్ అయ్యింది. టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సంపాదించి పెట్టింది. ఒకవేళ వ‌ర్షం సినిమాను అతిథి అగర్వాల్ చేసుంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది అనడంలో సందేహం లేదు.

Related posts

Priyanka Chopra: ప్రియాంక చోప్రా ధ‌రించిన ఆ డైమండ్ నెక్లెస్ ధ‌ర ఎన్ని వంద‌ల కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

TDP: టీడీపీ నేతల గృహ నిర్బంధం

sharma somaraju

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు బోల్తా .. ముగ్గురు మృతి .. పలువురికి గాయాలు

sharma somaraju

Brahmamudi May 23 Episode 417: రుద్రణి ప్లాన్ తెలుసుకున్న కావ్య.. దుగ్గిరాల ఇంట్లో కోడలు స్థానం కోసం మాయ ప్లాన్.. చీకొట్టిన రాజ్..

bharani jella

Karthika Deepam 2 May 23th 2024 Episode: దీపకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 23 Episode 631: బిడ్డకు జన్మనిచ్చిన అరవింద.. బిడ్డను చంపడానికి కృష్ణ ప్లాన్.. బిడ్డతో పారిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 23 Episode 477: నీకు గర్భం లేకుండా చేసిన ముకుందని నేనే అని నిజం చెప్పిన మీరా..బిడ్డ కోసం మురారి ని వదిలి పుట్టింటికి కృష్ణ..

bharani jella

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

sharma somaraju

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

sharma somaraju

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

sharma somaraju

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?