NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

Shruti Haasan: లవ్ లో పడడం, డేటింగ్ చేయడం, ఆ తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం, సెట్ అవ్వకపోతే విడిపోవడం ఇవన్నీ సినీ తారలకు కొత్తేమి కాదు. సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చూసుకుంటే పెళ్లి తర్వాత కొన్నాళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. అలాగే పెళ్ళి వరకు వెళ్లకుండా డేటింగ్ తోనే బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతిహాసన్ కూడా చేరింది.

గత కొన్నేళ్ల నుంచి శృతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతను హజారికాతో ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో ఒకే ఫ్లాట్ లో ఉంటూ స‌హ‌జీవ‌నం కూడా స్టార్ట్ చేశారు. శాంత‌ను తో ఉన్న ప్రతి హ్యాపీ మూమెంట్ ని శృతి హాస‌న్ సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. ప‌బ్లిక్ గా రొమాన్స్ చేసుకుంటూ ఈ జంట ఎన్నో సార్లు రెచ్చిపోయారు. శృతి హాస‌న్ ఎక్క‌డికి వెళ్లినా ఆమె వెంటే శాంత‌ను కూడా ఉండేవారు. వీరి రిలేష‌న్ చూసి రేపో మాపో పెళ్లి కూడా చేసుకుంటార‌ని అభిమానులు భావించారు.

కానీ శృతి హాస‌న్ మ‌ళ్లీ ల‌వ్ లో ఫెయిలైంది. దాదాపు మూడేళ్ల నుంచి రిలేష‌న్‌లో ఉన్న‌ శాంతను హజారికా, శృతి హాస‌న్ బ్రేక‌ప్ చెప్పుకున్నారంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో ఇటువంటి ప్ర‌చార‌మే జ‌రిగినా.. శృతి హాస‌న్ వాటిని ఖండించింది. అయితే ఈసారి మాత్రం బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ ను శృతి హాస‌న్ ప‌రోక్షంగా క‌న్ఫార్మ్ చేసింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో శాంతను హజారికాను శృతి హాస‌న్ అన్ ఫాలో చేసింది. అలాగే శాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోలను శృతి హాస‌న్ డిలీట్ చేసి ప‌డేసింది. అలాగే శాంత‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ లో శృతి హాస‌న్ లో అన్ ఫాలో అయ్యాడు.

పైగా గ‌త కొద్ది రోజుల నుంచి శృతి హాస‌న్‌, శాంత‌ను జంట‌గా క‌నిపించిన సంద‌ర్భాలు కూడా లేవు. ఇటీవ‌ల హీరామండీ ప్రీమియర్ షోకి కూడా ఆమె ఒంటరిగా వెళ్లింది. దీంతో శృతి హాసన్, శాంత‌ను విడిపోయారంటూ బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, శృతి హాస‌న్ కు ఇదేమి ఫ‌స్ట్ బ్రేక‌ప్ కాదు. గ‌తంలో లండన్ కుర్రాడు మైఖేల్ కర్సెల్‌తో శృతి హాస‌న్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. మైఖేల్ కోసం శృతి త‌న కెరీర్ నే వ‌దిలేసింది. సినిమాలు చేయ‌డం మానేసి లండ‌న్ లో మైఖేల్ తో క‌లిసి మ‌కాం వేసింది. ఇద్ద‌రూ చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మైఖేల్ ను శృతి హాస‌న్ త‌ల్లిదండ్రులు కూడా అంగీకరించారు. దాంతో మైఖేల్, శృతి పెళ్లి ఫిక్స్ అని అంద‌రూ భావించారు. కానీ ఏమైందో ఏమో గానీ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే మైఖేల్ తో శృతి హాస‌న్ విడిపోయింది. ఆ స‌మ‌యంలో ఆమె ఫుల్ డిప్రెష‌న్ లోకి వెళ్లింది. బ్రేక‌ప్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాక ఇండియా వ‌చ్చిన శృతి హాస‌న్‌.. కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. వ‌రుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చింది.

Related posts

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

sharma somaraju

Actress Hema: బెంగళూరు పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా .. హజరుకాలేనంటూ లేఖ

sharma somaraju

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి

sharma somaraju

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

sharma somaraju

ఏపీ ఎన్నిక‌లు: ప్ర‌మాదంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు… ?

Swati Maliwal: కోర్టులోనే కన్నీళ్లపర్యంతమైన రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ .. బిభవ్ కుమార్ బెయిల్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N