కోలీవుడ్ లో స్టార్ వార్ మొదలైంది… పొంగల్ సీసన్ కి సూపర్ స్టార్ రజినీకాంత్, తలా అజిత్ పోటీ పడుతున్నారు… గత ఐదారు ఏళ్లలో కోలీవుడ్ లో ఇదే అతిపెద్ద క్లాష్… వరస ఫ్లాప్స్ తో ఉన్న రజినీకాంత్… విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి పెట్టా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు, పెట్టా సినిమాతో రజనీ కమర్షియల్ సక్సస్ తప్పకుండా అందుకుంటాడని తలైవా అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వింటేజ్ రజినీని గుర్తు చేస్తూ రాబోతున్న ఈ సినిమా పక్కా హిట్ అవుతుందనే అందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారు కానీ మరో స్టార్ హీరో అజిత్ నుంచి రజినీకి పెద్ద సవాల్ ఎదురయ్యింది.
మాములుగా రజినీకాంత్ సినిమాకి పోటీగా తమ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఎవరూ డేర్ చేయరు, అయితే ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రజినీకి అజిత్ రూపంలో పెద్ద కష్టమే వచ్చింది, దానికి కారణం విశ్వాసం సినిమా. ఇప్పటికే మూడు హిట్స్ ఇచ్చిన శివతో మరోసారి విశ్వాసం సినిమా చేసి ఆడియన్స్ ని పలకరించడానికి పొంగల్ పండక్కి రాబోతున్న అజిత్, వరస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన వచ్చిన విశ్వాసం ట్రైలర్ కూడా మాస్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది.
ఈ జనరేషన్ హీరోల్లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ సినిమా కోసం అతని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అజిత్ చరిష్మాకి, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా తోడవడంతో విశ్వాసం రేంజ్ పెరిగిపోయింది. పేట సినిమాకన్నా విశ్వాసం చిత్రమే ఎక్కువ థియేటర్స్ లో విడుదల అవుతుందంటే.. అజిత్ సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ దెబ్బతిన్న రజినీకి పేట కూడా పోతే చాలా డామేజ్ జరుగుతుంది కాబట్టి రజినీ తన రేంజ్ హిట్ కొట్టి, ఆయన బాక్సాఫీస్ స్టామినాని ప్రూవ్ చేసుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అది జరిగేలా కనిపించట్లేదు. మరి అజిత్ రూపంలో వచ్చిన ఈ విశ్వాస పరీక్షని సూపర్ స్టార్ ఎలా పాస్ అవుతాడో చూడాలి