NewsOrbit
రాజ‌కీయాలు

గెలుపు తథ్యం అనుకున్న పాయింట్ – చంద్రబాబుకి రివర్స్ షాక్ కొట్టింది..!

రాజకీయ నాయకులకైనా, వ్యాపారులకైనా, పారిశ్రామిక వేత్తలకైనా సమయం కలిసి వచ్చినప్పుడే వారి శ్రమకు గుర్తింపు, గౌరవం లభిస్తుంటాయి. ఎంత శ్రమ పడినా వారికి ఫలితం కనబడక పొతే టైం బ్యాడ్ నడుస్తుంది అంటుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ టైం నడుస్తోందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రాజకీయంగా చంద్రబాబుకు ప్లస్ అవుతుందనీ, పార్టీ శ్రేణులకు ఉత్సాహం వస్తున్నాడనీ కొందరు తెలుగు తమ్ముళ్లు ఆశ పడ్డారట. కానీ ఈ పరిస్థితులు చంద్రబాబుకు ఆశాజనకంగా కనిపించడం లేవని అనుకుంటున్నారు. అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విషయంలో విజయం సాధిస్తారు అనుకుంటే చంద్రబాబుకు రివర్స్ షాక్ కొట్టింది అంటున్నారు.

రాజకీయ పార్టీ నేతలపై కేసులు నమోదు అయినా, అరెస్ట్ అయి జైలుకు వెళ్లినా కొంత మేర సానుభూతి పవనాలు విస్తుంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ హయాంలో తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాయించారన్న అభియోగంపై సీబీఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుండి విపరీతమైన సానుభూతి వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వరుసగా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేస్తూ, జైలుకు పంపుతున్నా టీడీపీకి సానుభూతి రావడం లేదని అంటున్నారు. ఈఎస్ఐ అవినీతి కేసులో టీడీపీ మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సమయంలో.. చంద్రబాబు బీసీ కార్డు ఉపయోగించినా టీడీపీకి సానుభూతి పవనాలు ఏమి కనబడలేదట.

అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతరం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం.టీడీపీ మాజీ మంత్రులు నిమ్మకాయల చిన రాజప్ప, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడులపై కేసులు నమోదు చేయడం తెలిసిందే.

టీడీపీ నేతల అరెస్ట్ లు, కేసుల నమోదు రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని టీడీపీ ఆరోపించగా, తప్పులు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షలు అనుభవించాలసిందేనని అధికార పక్షం కౌంటర్ ఇచ్చింది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న నేతలపై కేసులు నమోదు కావడం, అరెస్ట్ లు చేస్తుంటే అధికార పార్టీపై విమర్శలు రావడం, ప్రతిపక్షంకు సానుభూతి రావడం సహజం. ఈ సంఘటనలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనబడటం లేదంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు.టైం బ్యాడ్ అంటే ఇదేనేమో.

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?