NewsOrbit
Cinema న్యూస్ సినిమా

Surya Kiran: సూర్య కిర‌ణ్ మ‌ర‌ణం వెన‌క బ‌య‌ట‌ప‌డ్డ సంచ‌ల‌న నిజాలు.. భార్య వ‌ల్లే చ‌నిపోయాడా..?

Surya Kiran: ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూసిన సంగతి తెలిసింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సూర్య కిరణ్ మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించడంతో.. సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. అయితే తాజాగా సూర్య కిర‌ణ్ మ‌ర‌ణం వెన‌క ఉన్న కొన్ని సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చింది. 1977 సెప్టెంబర్ 6న చెన్నైలో టీ.ఎస్. మణి, రాధా దంపతులకు జన్మించిన సూర్యకిరణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించాడు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా చిత్రాల్లో బాల నటుడిగా చేశాడు. ఎన్నో అవార్డులను అందుకున్నాడు.

అలాగే పాలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసిన సూర్యకిరణ్.. 2003లో సత్యం మూవీ ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రం సూర్య కిరణ్ కు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ ఆ త‌ర్వాత తీసిన‌ ధన 51, బ్రహ్మోత్సవం, రాజు భాయ్, చాప్టర్ 6 వంటి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. సూర్య‌కిర‌ణ్ కెరీర్ ను తీవ్రంగా దెబ్బ తీశాయి. అదే స‌మ‌యంలో ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోనూ అత‌ను ఫెయిల్ అయ్యాడు. ప్రముఖ హీరోయిన్ కల్యాణిని సూర్య కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వీరి బంధం కొన్నాళ్లు సాఫీగానే సాగిన.. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి.

2016లో సూర్యకిరణ్ కళ్యాణి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ వెళ్లిపోవడానికి ఆర్థిక సమస్యలే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని గతంలో సూర్య కిరణ్‌ సోదరి, ప్రముఖ నటి సుజాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విడాకుల తర్వాత సూర్యకిర‌ణ్ ఇండ‌స్ట్రీలో క‌నిపించ‌లేదు. దాదాపు ఏడేళ్లు గ్యాప్ త‌ర్వాత 2020లో బిగ్ బాస్ సీజ‌న్ 4లో సంద‌డి చేశాడు. కానీ తొలి వార‌మే ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆ స‌మ‌యంలో సూర్య కిర‌ణ్‌ ఓ ఇంటర్వ్యూలో క‌ళ్యాణి గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

విడాకులు మా ఇద్దర్నీ వేరుచేసినా మా మనసులు మాత్రం క‌లిసే ఉంటాయి. ఈ జన్మకే కాదు.. ఇంకెన్ని జన్మలెత్తినా కూడా.. నా భార్య స్థానం కళ్యాణిదే అంటూ భార్య‌పై త‌న ప్రేమను బ‌య‌ట‌పెట్టారు. ఇక ఇప్పుడు ఆ ప్రేమ‌నే ఆయ‌న్ను మ‌ర‌ణానికి చేరవ చేసింద‌ని తాజాగా కరాటే కళ్యాణి బయటపెట్టింది. సూర్య కిర‌ణ్ తో మంచి అనుబంధం ఉన్న క‌రాటే క‌ళ్యాణి తాజాగా ఆయ‌న మ‌ర‌ణంపై విచారం వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే కొన్ని విష‌యాలు పేర్కొంది. భార్య వ‌ల్లే సూర్య కిరణ్ మ‌ర‌ణించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న క‌ళ్యాణి విడాకులు తీసుకుని దూరం కావ‌డం ఆయ‌న జీర్ణ‌యించుకోలేక‌పోయాడు. మాన‌సిక వేదనకు గురయ్యాడు. మందు, సిగరెట్స్ కు బానిస‌య్యాడు. ఆ దురలవాట్లతో సూర్య కిరణ్ ఆరోగ్యం దెబ్బతింది. తాగుడు వల్ల‌ సూర్య కిరణ్ జాండిస్ గుర‌య్యాడు. అందుకే మ‌ర‌ణించాడంటూ క‌రాటే క‌ళ్యాణి పేర్కొంది.

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N