NewsOrbit
Entertainment News ట్రెండింగ్ న్యూస్

Barbie: ప్రపంచమంతా బార్బీ మయం…అసలు ఇంత ప్రాముఖ్యత పొందిన ఈ బార్బీ బొమ్మ చరిత్ర మీకు తెలుసా? బార్బీ డాల్, Barbie 2023, Barbie Movie !

Barbie The history and cultural significance of barbie doll

Barbie: ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న సినిమా బార్బీ(Barbie Movie 2023)… చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతోమంది మనసులు గెలుచుకుని ఆధునిక మానవ నాగరికత లో తనకంటూ ఒక పుటాన్ని సంపాదించుకున్న బార్బీ చరిత్ర(Barbie History) గురించి ఇప్పుడు మనం చూద్దాం…ఎంతో మంది చిన్న పిల్లకు ఆటబొమ్మలంటే ఎంత ఇష్టమో మనకందరికీ తెలుసు. వారికి ఏ బొమ్మైనా నచ్చితే ఇక వదలకుండా ఆడుకుంటారు. పిల్లలకు బొమ్మ బాగా నచ్చాలంటే చూడగానే ఆకట్టుకునే రూపం ఉండాలి. అది న్యూయార్క్ నగరం మార్చ్ తొమ్మిదవ తేదీ 1959 వ సంవత్సరం లో ఒక చోట బొమ్మల ప్రదర్శన జరుగుతోంది. అందులో ఒక బొమ్మ మాత్రం అందరి దృష్టినీ తనవైపు లాగే పడేసింది.

Barbie The history and cultural significance of barbie doll explained
Barbie The history and cultural significance of barbie doll explained

చిన్న వాళ్ళే కాదు పెద్దవారు సహితం కన్ను ఆర్పకుండా చూసే లావణ్యం ఈ బొమ్మ సొంతం. అదే బార్బీ బొమ్మ. ఆరోజు బొమ్మల ప్రపంచంలో ఈ బొమ్మ ఒక విప్లవం అన్నమాట. అప్పటివరకు చిన్న పిల్లల బొమ్మలన్నీ చిన్న పిల్లల పాత్రల్లోనే ఉండేవి. తెల్లని జుట్టు, నీలి కళ్లు, చక్కగా డ్రెస్‌ వేసి ఉన్న బార్బీ బొమ్మ పిల్లలకు, అమ్మాయిలకు బాగా నచ్చేసింది. దాంతో మొదటి ఏడాదే మూడు లక్షలకు పైగా బార్బీ బొమ్మలు అమ్ముడయ్యాయి. ఈ బార్బీ (Barbie) బొమ్మ ప్రపంచానికి పరిచయమై ఆరవై నాలుగు ఏళ్ళు అయిందంటే ఆశ్చర్యం గా లేదూ. ఇన్ని సంవత్సరాలు ఒకే బొమ్మ అందరినీ ఆకర్షించడం గొప్ప విషయం.

అందుకని మనం కూడా ఈ బొమ్మ తాలూకు విషయాలు, విశేషాలు తెలుసు కుందాము.
మ్యాటల్ అనే అమెరికాకు చెందిన బొమ్మల తయారీ కంపెనీ యజమానురాలు రుత్‌ హ్యాండ్లర్‌ బార్బీని తయారుచేశారు. ఒకరోజు రుత్‌ కూతురు బార్బరా పేపర్‌తో చేసిన బొమ్మలతో ఆడుకుంటే చూసి, కూతురు కోసం చక్కని బొమ్మ చేసి యిచ్చారు రుత్‌ హ్యాండ్లర్‌. ఈ బొమ్మకు బిల్డ్ లిల్లీ అనే జర్మన్ బొమ్మకు చాలా పోలికలు ఉన్నాయి. బొమ్మ ఎంతో బాగుండటం తో తరువాతి కాలంలో అదే బొమ్మ ఆధారంగా ఎన్నో రకాల రూపాలతో బొమ్మలను తయారు చేశారామె. మొదటగా బార్బీ బొమ్మను మూడు డాలర్లకు అమ్మారు. ఇప్పటికీ ప్రతి మూడు సెకన్లకు ఒక బార్బీ బొమ్మ అమ్ముడవుతుంది. బార్బీ బొమ్మ(Barbie) 11.5 ఇంచుల పొడవుంటుంది.
బొమ్మ పూర్తి పేరు ‘బార్బరా మిల్లి సెంట్‌ రాబర్ట్స్‌’.

Barbie: The history and cultural significance of barbie doll explained
Barbie: The history and cultural significance of barbie doll explained

తన కూతురు పేరు మీదుగానే బార్బీకి బార్బరా మిల్లిసెంట్ రాబర్ట్ అని పేరు పెట్టింది. దాన్ని మనం ముద్దుగా బార్బీ అని పిలుస్తున్నాం. తొలి చూపులోనే అందరినీ ఆకర్షించింది. తక్కువ సమయంలోనే దేశదేశాల్లోకి పాకిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎందరో అభిమానుల్ని సంపాదించుకుంది. మొట్టమొదటి బార్బీ నలుపు తెలుపు స్విమ్‌సూట్‌లో ఉంటుంది.

తొలి రోజుల్లో ఈ బొమ్మలు జపాన్‌లో తయారయ్యేవి. వీటి అదిరేటి డ్రస్సుల్ని జపనీయులు చేతితో కుట్టేవారు. ఈ బొమ్మ 11.5 అంగుళాల ఎత్తు ఉంటుంది. దీని మొదటి పెంపుడు జీవి గుర్రం. దాని పేరు డ్యాన్సర్‌. ఎత్తు మడమల చెప్పులతో ఉండే బార్బీలు 2015లో ఫ్లాట్స్‌ వేసుకుని మెరిశాయి. బార్బీ బొమ్మ.. ఆహార పదార్థాలు, దుస్తులు, రకరకాల వస్తువుల్లోకీ దూరిపోయింది.

మన దేశ సంప్రదాయ అలంకరణలతోనూ మెరిశాయివి. చీరకట్టుతో ఆకట్టుకున్నాయి. పెళ్లికూతురుగా మురిపించాయి. అలా దాదాపు 40 దేశాల సంప్రదాయాల్లో కనిపించాయి. బార్బీ బర్త్‌డే సందర్భంగా దీని అభిమానులు కేకులు కట్‌ చేస్తూ సంబరాలు చేసుకుంటారు.
బార్బీ వివరాలతో ఓ పుస్తకం ఉంది. దాని పేరు ‘ద వరల్డ్‌ ఆఫ్‌ బార్బీ’. ప్రపంచవ్యాప్తంగా బార్బీ బొమ్మలు సేకరించేవారి సంఖ్య లక్షలలో ఉంటుంది. అయితే వాళ్లందరిలో జర్మనీకి చెందిన ‘బెట్టినా డార్ఫ్‌మన్‌’కు ఎక్కువ బొమ్మలున్న వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డు దక్కింది. ఈమె 15 వేల బొమ్మలను సేకరించింది.

Barbie The history and cultural significance of barbie doll
Barbie The history and cultural significance of barbie doll

విద్యార్థి, వైద్యురాలు, మోడల్‌, డ్యాన్సర్‌, వ్యోమగామి, రోబోటిక్‌ ఇంజినీర్‌, జర్నలిస్ట్‌ ఇలా ఒక్కటేంటీ టీచర్‌ నుంచి పారిశ్రామికవేత్త వరకూ దాదాపు 200 రకాలుగా అవతారాలెత్తిందిది. అన్ని వృత్తుల్లోనూ దర్శనమిచ్చింది. తైవాన్‌లోని తైపీ నగరంలో ‘బార్బీ కేఫ్‌’ ఉంది. లోపాలకి వెళితే ఎక్కడ చూసినా ఈ బొమ్మలే. హోటల్‌ గోడలు, తలుపులు, కిటికీలు అంతా గులాబీ రంగులోనే ఉంటాయి. ఇక్కడ కావాల్సినవి అందించే వాళ్లు కూడా బార్బీ దుస్తులు వేసుకుని అచ్చం బార్బీ బొమ్మల్లానే తయారవుతారు. కేక్‌లు, ఆహార పదార్థాలూ బార్బీ బొమ్మల్లా ఉంటాయి.

అమెరికా లాస్ ఏంజిల్స్ లోని సీగండో డిజైన్ స్టూడియోలో వంద మందికి పైగా డిజైనర్లు కొత్త డిజైన్ల కోసం కష్టపడుతూనే ఉంటారు. బార్బీ ముఖానికి సొగసైన రూపాన్ని ఇవ్వడానికి త్రీడీ ప్రింటింగ్ సాఫ్ట్‌ వేర్ ను వాడుతారు. ఇవన్నీ రెడీ ఐన తర్వాత డిజైనింగ్ నిపుణుల బృందం దానికి అందమైన రూపాన్ని ఇస్తారు.

సిద్ధమైన బొమ్మ రూపాన్ని కావలసిన సైజుల్లో తయారుచేసేందుకు ఫ్యాక్టరీకి పంపిస్తారు. ఫ్యాక్టరీలో బొమ్మ తయారుకాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డీలర్లకు పంపిస్తారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకొని, కొత్త కొత్త డిజైన్లతో తక్కువ సమయంలోనే మార్కెట్లలో విడుదలవుతుందీ బార్బీ డాల్. గ్రైనేర్ మరియు హాసిర్ అనే కంపెనీ లిల్లీ బొమ్మ ను చేసింది. వాళ్ళు బార్బీ బొమ్మను చూసి చాలా కోపం తెచ్చుకున్నారు. మా బొమ్మను కాపీ కొట్టారని ఆరోపించారు. వారు కోర్ట్ కి వెళ్ళాక ఒక ఒప్పందానికి వచ్చారు. తర్వాత మ్యాటల్ కంపనీ లిల్లీ హక్కులు కొన్నారు. 1971 వ సంవత్సరంలో మాలిబు బార్బీ అనే బొమ్మ ప్రవేశ పెట్టారు. ఇది కాస్త నవ్వుతూ ఉన్న బార్బిఈ బొమ్మ. బార్బీ బొమ్మను(Barbie Doll) యువతుల ఫాషన్ మోడల్ గ ప్రచారం చేశారు.
బార్బి బొమ్మ వెనక ఇంట కథ ఉంది మరి.

 

Related posts

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri