Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎక్కువ నెగిటివిటీ ఎదుర్కొన్న కంటెస్టెంట్ రతిక. మొదటివారం అద్భుతమైన గేమ్ ఆడిందని నాగార్జున పొగడటం జరిగింది. కానీ నాలుగో వారానికి వచ్చేసరికి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. కావాలని కొంతమందిని టార్గెట్ చేసి గొడవలు పెట్టుకోవడంతో పాటు వాళ్ళ ఫీలింగ్స్ రెచ్చగొట్టే విధంగా గేమ్ ఆడింది. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లలో పలుమార్లు గేమ్ ఆడు మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకోవద్దు అంటూ నాగార్జున.. రతికాకి వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. అయినా గాని ఆమె అలాగే ఆడటంతో నాలుగో వారం భారీ నెగెటివిటీతో హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది.
కానీ అనూహ్యంగా ఏడో వారం మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్..తో.. రతిక ప్రేమ యవ్వారం.. ఫోటోలు బయటపడటం సోషల్ మీడియాలో కలకలం సృష్టించడం జరిగింది. ఎప్పుడైతే మాజీ ప్రియుడు రాహుల్ తో రతిక లవ్ ట్రాక్ బయటపడటం జరిగిందో ఈమె పేరు సోషల్ మీడియాలో మారు మరుగుతూ ఉంది. అయితే ఆ ఫోటోలు కావాలని షేర్ చేశారంటూ రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క రతిక సోదరి ఈ విషయంపై స్పందించి కావాలని రాహుల్.. తన అక్క ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించింది.
ఇదిలా ఉంటే తాజాగా రాహుల్ రతికల ప్రేమ వ్యవహారం పై రతిక తల్లిదండ్రులు.. రాములు, అనిత స్పందించారు. ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తమ కూతురు రతిక కచ్చితంగా టాప్ పైలో ఉంటుందని.. తెలిపారు. మా బిడ్డ ఎంతో కష్టపడి పైకి వచ్చింది.. కుటుంబాన్ని ఆదుకుంది. అప్పట్లో కొన్ని సినిమాల అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత యూట్యూబ్ లో రాహుల్ సిప్లిగంజ్ తో కలసి మా బిడ్డ కొన్ని పాటలు పాడింది. ఆ సమయంలో వారిద్దరి గురించి చాలామంది తప్పుగా మాట్లాడుతుంటే బాధ అనిపించింది. రాహుల్ మా రెండో బిడ్డ పెళ్లికి రావడం జరిగింది. రతికాను పెళ్లి చేసుకుంటానంటే మాట్లాడాలని ఇంటికి కూడా పిలిచాం. కానీ ఆ తర్వాత అతను కనిపించలేదు అని రతిక తల్లిదండ్రులు ఇంటర్వ్యూలో తెలియజేశారు.