Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రస్తుతం సాగుతోంది. ఆట మొదలయ్యి ఎనిమిది వారాలు కావస్తోంది. హౌస్ నుండి ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఏడుగురు కూడా లేడీ కంటెస్టెంట్ లే. ఇదిలా ఉంటే ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో నామినేషన్ విషయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏడు వారాలపాటు అస్సలు నామినేషన్ లోకి ఆట సందీప్ రాలేదు. తాజాగా ఎనిమిదో వారంలో మొదటిసారి నామినేషన్ లో ఉండటంతో ఇప్పుడు సందీప్ డేంజర్ జోన్ లో పడ్డాడు. ఈ రకంగా ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ లో ఎన్నడు చోటు చేసుకోలేదు. ఓ కంటెస్టెంట్ ఏకంగా ఏడు వారాలపాటు నామినేషన్ లోకి రాకుండా గేమ్ ఆడుతూ రాణించడం ఇదే తొలిసారి.
దీంతో ఆట సందీప్ చాలా లక్కీ అని మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఫస్ట్ టైం ఎనిమిదో వారంలో నామినేషన్ లోకి రావడంతో ఓట్లు మనోడికి పడటం లేదు. ఇప్పటికే కొంత మంది కంటెస్టెంట్లకు ఓటింగ్ ఓ రేంజ్ లో ఉండటంతో.. వాళ్లందరికీ భారీ ఎత్తున ఓట్లు పడుతున్నాయి. ఎనిమిదో వారంలో మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. ఈ ఎనిమిది మంది కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. శివాజీ, అమర్ దీప్, భోలే, అశ్విని, గౌతమ్, ప్రియాంక, శోభ, సందీప్. వీళ్ళందరిలో అందరికంటే తక్కువ ఓటింగ్ తో చివరి స్థానంలో సందీప్ ఉన్నాడు. దీంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ నుండి సందీప్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట ప్రచారం జరుగుతుంది.
ఇదే జరిగితే సీజన్ సెవెన్ లో మొట్టమొదటిసారి ఎలిమినేట్ అయిన మగ కంటెస్టెంట్ సందీప్ అవుతాడు. ఇటీవల మనవడు చాలా సేఫ్ గేమ్ ఆడటం తో పాటు కొన్ని అనవసరమైన విషయాలలో నోరు జారటంతో చాలా నెగిటివ్ అవుతూ వచ్చాడు. ప్రారంభంలో సీరియల్ బ్యాచ్ లో కూడా కీలక పాత్ర పోషించడంతో.. మొదటి నుండి సందీప్ పై బాగా నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. ఇటువంటి క్రమంలో నామినేషన్ లో ఫస్ట్ టైం రావడంతో మిగతా వారితో పోలిస్తే సందీప్ కి ఓట్లు చాలా తక్కువగా పడుతున్నాయి.