Iswarya Menon: అందం, అంతకుమించిన నటన ప్రతిభ ఉన్నా కూడా సినిమా పరిశ్రమలో సరైన అవకాశాలు లేక అల్లాడిపోతున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఐశ్వర్య మీనన్ కూడా ఆ కోవకే చెందుతుంది. 1995 మే 8న తమిళనాడులో ఐశ్వర్య మీనన్ జన్మించింది. తండ్రి పేరు వరదరాజన్ మరియు తల్లి పేరు జయ మీనన్. తండ్రి వ్యాపారవేత్త కాగా.. తల్లి ఒక మేకప్ ఆర్టిస్ట్. ఐశ్వర్య మీనన్ కు ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అలాగే ఆమె నటి కావాలని, ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు కోరుకోలేదు.
చిన్నతనం నుంచి చదువుల్లో ఐశ్వర్య ముందుండేది. ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి జాబ్ లో సెటిల్ కావాలని ఆమె కోరుకుంది. అయితే ఇంజనీరింగ్ చదువుతుండగా అనుకోకుండా మోడలింగ్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆమెకు కొన్ని యాడ్స్ లో అవకాశం వచ్చింది. యాడ్స్ లో నటిస్తున్న క్రమంలోనే ఐశ్వర్య మీనన్ కు నటనపై ఆసక్తి కలిగింది. అలా అని చదువు వదిలిపెట్టలేదు. ఓవైపు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించ సాగింది. అప్పుడే ఐశ్వర్యకు కాదలిల్ సోదప్పువదు యెప్పడి అనే తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. ఇందులో సిద్ధార్థ్, అమలాపాల్ హీరో హీరోయిన్లుగా నటించారు.
2012లో ఈ సినిమా విడుదలైంది. కానీ ఐశ్వర్యకు ఎలాంటి గుర్తింపు రాలేదు. 2013లో ఆపిల్ పెన్నే అనే తమిళ మూవీ తో ఆమె హీరోయిన్ గా మారింది. ఆపై తీయ వేళై సెయ్యనుం కుమారు, దసవల, నమో భూతాత్మ, మాన్ సూన్ మామిడి, వీర.. ఇలా తమిళ్, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించింది. 2023లో స్పై మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా కోసం ఐశ్వర్య మీనన్ ఎంతగానో కష్టపడింది. కానీ ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కలేదు.
ఇక అందం అంతకుమించిన అభినయం ఉన్నా కూడా ఐశ్వర్య మీనన్‌కు అవకాశాలైతే పెద్దగా రావడం లేదు. దీంతో ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా ఆఫర్ల కోసం తన అందాలను ఎరగా వేస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి మూడు మిలియన్ల ఫాలోవర్స్ వచ్చి చేరారు. అయినప్పటికీ సినిమా ఛాన్సులు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య మలయాళం లో బజూకా అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో మమ్ముట్టి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతోంది.