Kumkuma Puvvu november 07 episode 2020: అప్పుడు కావేరి ఇంకా చేసేది ఏముంది తప్పదు కదా, వెళ్లి అంజలి రూపంలో ఉన్న లక్ష్మీని తీసుకురండి అని అమృత అరుణ్ కుమార్ గారికి చెప్తుంది కావేరి. అప్పుడు అమృత అరుణ్ కుమార్ గారు సాగర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇక సాగర్ వాళ్ళ ఇంట్లో పద్మావతి కొండమ్మ సాగర్ హాల్లో కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కొండమ్మ పద్మావతి తో అమ్మ పైన ఉన్న గదిలో నుంచి ఎలాంటి చప్పుడు వినపడడం లేదు. ఆయమ్మ ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్లి చూద్దాం అమ్మ అని అంటుంది పద్మావతి తో కొండమ్మ. అప్పుడు పద్మావతి సాగరతో ఒరేయ్ సాగర్ ఒకసారి వెళ్లి చూద్దాం రా ఏమి చప్పుడు వినపడడం లేదు అని అంటుంది పద్మావతి. అప్పుడు సాగర్ ఏం భయపడే అవసరమే లేదు అమ్మ నీ కోడలు లక్ష్మి అంతా బలహీనురాలు ఏమీ కాదు, నీరసం వచ్చి పడిపోవడానికి అని అంటాడు సాగర్.

అంతలోనే అరుణ్ కుమార్ అమృత సాగర్ వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్లను చూసినా సాగర్, పద్మావతి, కొండమ్మ వీళ్లేంటి మళ్ళీ వచ్చారు అని మనసులో అనుకుంటూ అలాగే వాళ్లని చూస్తూ ఉంటారు. అప్పుడు అరుణ్ కుమార్ సాగర్ హాస్పిటల్ లో బంటి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడుఅంజలి ని కలవరిస్తూ, ఉన్నాడు ఒక్కసారి లక్ష్మీని పంపిస్తే మళ్లీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర దింపేస్తాము అని అంటాడు అరుణ్ కుమార్. అప్పుడు అమృత కూడా అవును సాగర్ ప్లీజ్ ఎలాగైనా ఒక్కసారి లక్ష్మీని పంపించండి అని అడుగుతుంది అమృత.అప్పుడు పద్మావతి ఏంటండీ మీరు కన్న తల్లి దండ్రులు పక్కన ఉన్నారు కట్టుకోబోయేది పక్కన ఉంది అలాగే మేనత్త మైన మామ మీరు పక్కనే ఉన్నారు మీరందరినీ కాదని మా కోడలిని లక్ష్మీ ని కలవరిస్తున్నాడ అని అంటుంది పద్మావతి. అప్పుడు సాగర్ నా పెళ్ళాం వాడి పెళ్ళాం గా వాడి పక్కనుండి వాడికి సేవలు చేయమని వచ్చి అడుగుతున్నారా అని అంటాడు సాగర్. అందుకు అరుణ్ కుమార్ ఏమి సమాధానం ఇవ్వడు.

ప్లీజ్ సాగర్ ఎలాగైనా ఒక్కసారి లక్ష్మిని పంపించండి అని అడుగుతాడు.అప్పుడు పద్మావతి ఏంటండీ మీరు పదే పదే మా ఇంటికి వచ్చి మా కుటుంబాన్ని ఇలా, ఇబ్బందులపాలు చేయడం తప్ప మరేమీ లేదు అని అంటుంది పద్మావతి .అప్పుడు పద్మావతి నేను లక్ష్మీ అత్తగారిగా నేను చెబుతున్నాను లక్ష్మీ ఎక్కడికి రాదు, మీరు అడిగిన మేము పంపించాం అని అంటుంది పద్మావతి.అప్పుడు సాగర్ విన్నారు కదా ఇక బయలుదేరండి అని అంటాడు. అప్పుడు అంజలి తలుపులు కొడుతూ తలుపులు తీయండి తలుపులు తీయండి అని అంజలి అరుస్తూ ఉంటుంది. గదిలో నుంచి. అరుస్తున్న చప్పుడు విని అప్పుడు అరుణ్ కుమార్ అమృతలు లక్ష్మీని గదిలో బంధిస్తారా, ఇది ఎక్కడి న్యాయం ఒక ఆడపిల్లని గదిలో వేసి తాళం వేస్తారా మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు అరుణ్ కుమార్. అప్పుడు అమృత అవును గృహహింస చట్టం కింద కేసు పెడతాము అని అంటుంది అమృత. అప్పుడు సాగర్ పెట్టుకోండి కేసు ఏంటి ఇంకా ఏమైనా, పెట్టుకోండి నేను పెడతాను కేసు బంటి కి నా భార్య లక్ష్మి కి అక్రమ సంబంధం ఉందని అంటాడు సాగర్. అప్పుడు అమృత చి నీవు మనిషివా నీవు ఒక మనిషి వని అనుకుంటున్నావా అని అంటుంది అమృత.అప్పుడు సాగర్ అవును నేను మనిషిని కాదు నేను ఒక మృగాన్ని అని అంటాడు సాగర్.

అప్పుడు అరుణ్ కుమార్ ప్లీజ్ సాగర్ ఇప్పుడు ఇది తగు పెట్టుకునే సమయం కాదు, ఒక్కసారి లక్ష్మిని పంపించండి అని అంటాడు. అప్పుడు అమృత నిన్నేంటి మేము బ్రతిమాలాడేది లక్ష్మిని నేను తీసుకొస్తాను అంటూ అమృత వెళుతుండగా,అమృత చేయి పట్టు కొని విసిరేస్తాడు సాగర్. అప్పుడు అది చూసి అరుణ్ కుమార్ సాగర్ అసలు నువ్వు నిజంగా మనిషివేనా అని అంటూ,అమృత పద ఇక మనం అంజలిని తీసుకు వెళ్లలేము కానీ అక్కడ బంటి బ్రతుకుతాడో లేదో ఇక వెళ్దాం పద ఆ దేవుడు చూసుకుంటాడు. అని సాగర్ అమృత వాళ్లు వెళుతుండగా ఆ మాటలు విన్న అంజలి తలుపులు తెరవండి అంటూ పువ్వుల కుండీని తీసుకుని డోరును కొడుతూ ఉంటుంది అంజలి. అది విన్న సాగర్, పద్మావతి, కొండమ్మ, గబగబా పైకి వచ్చి తలుపు తీయగానే అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది.గదిలో బంధిస్తే పిల్లి కూడా పులి అవుతుంది అది మర్చిపోవద్దు అని అంటుంది అంజలి.

అప్పుడు సాగర్ నీకు ఆ బంటి గాడికి ఏంటే సంబంధం అని అంటాడు. అప్పుడు లక్ష్మీ తన మొహం మీద ఉమ్మి వేసి తనను పక్కకు నెట్టేసి అలాగే, కొండమ్మ ను పద్మావతి ని కూడా పక్కకు నెట్టివేసి పరిగెడుతూ ఉంటుంది అంజలి. అప్పుడు సాగర్ లక్ష్మి గడప దాటితే ఊరుకునేది లేదు అని అంటాడు సాగర్. కానీ అంజలి సాగర్ మాట వినకుండా అమ్మ అని అమృతను పిలుస్తూ ఉంటుంది.అప్పుడు కారులో ఉన్న అరుణ్ కుమార్ అమృత ఆ మాట విని కారు నుంచి బయటికి దిగివచ్చి. అమ్మ లక్ష్మి బంటి హాస్పటల్లో కూడా నిన్నే కలవరిస్తూ ఉన్నాడు అని చెబుతారు. అప్పుడ పద్మావతి కొండమ్మ సాగర్ ఇంటి బయటకి వచ్చి లక్ష్మీ నువ్వు వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది పద్మావతి. అప్పుడు కొండమ్మ కూడా అవునమ్మా ఇలా తెగించడం మంచిది కాదు అని అంటుంది కొండమ్మ. అప్పుడు అంజలి నన్ను ఆపడానికి మీరెవరు అని అంటుంది. అప్పుడు వాళ్లు షాక్ అవుతారు.అప్పుడు అంజలి ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అని అడిగితే పోతే పోనీ చస్తే చావని అని అంటారా అని అంటుంది అంజలి. అప్పుడు సాగర్ అంటే మాత్రం నీవు నా మొహం మీద ఊస్తావా అని అంటాడు సాగర్.అప్పుడు సాగర్ వద్దు గడప దాటవద్దు అని నేను చెబుతున్న నా మాటనే ధిక్కరిస్తావా అని అంటాడు సాగర్.

అప్పుడు అంజలి ఇప్పుడు నీ కన్నా నాకన్నా మీ అందరికన్నా బంటి బ్రతకడమే నాకు ముఖ్యం అని అంటుంది అంజలి. అప్పుడు సాగర్ ఓహో బంటి గారు బంటి అయిపోయాడు ఇప్పుడు నాకు మ్యాటర్ క్లియర్గా అర్థం అవుతుంది. నీకు ఆ బంటి గాడికి ఏదో అక్రమ సంబంధం ఉంది అని అంటాడు సాగర్.అప్పుడు అంజలి కళ్ళు ఎర్ర చేసుకుని చూస్తుంది.ఇక్కడ లక్ష్మ గా నాతో ఉంటూ అక్కడ బంటి గాడి దగ్గర పెళ్లి కానీ అమ్మాయిగా రొమాన్స్ చేస్తూ ఉంటున్నావు.అందుకే వాడి ప్రాణం మీదికి వచ్చింది అంటే నీ ప్రాణం కొట్టుకుపోతుంది అని అంటాడు సాగర్.ఇన్నాళ్లు ఇటు లక్ష్మి గా అటు అంజలిగా నువ్వు చేసింది డబల్ ఆక్షన్ కాదు పచ్చిగా చెప్పాలంటే వ్యభిచారం అని అంటాడు సాగర్.సాగర్ అన్న మాటలకి అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు అప్పుడు అంజలి సాగర్ ని ఆపరా పశువా అని అంటుంది అప్పుడు కొండమ్మ ఏంటి లక్ష్మమ్మ కట్టుకున్న భర్తని అంత మాట అంటావా అని అంటుంది. అప్పుడు లక్ష్మి అవును అంటాను అని అంటుంది. అప్పుడు సాగర్ నీకు ఎంత ధైర్యమే అని లక్ష్మిని అంటాడు. అప్పుడు లక్ష్మి నేను నీ భార్య లక్ష్మీ నీ కాదు అంజలిని అని అంటుంది.ఆ మాటకి సాగర్ పద్మావతి కొండమ్మ షాక్ అవుతారు.అప్పుడు పద్మావతి వీడు గెలికి మరి నిజాన్ని బయట పెట్టించుకున్నాడు కదా అని మనసులో అనుకుంటుంది పద్మావతి.అప్పుడు కొండమ్మ కూడా అయ్యో ఇన్నాళ్లు దాచిపెట్టిన నిజం ఇప్పుడు బట్టబయలైందే ఇన్నాళ్ళ కష్టం అంతా వృధా అయిపోయింది కదా అని అనుకుంటుంది కొండమ్మ.

అప్పుడు సాగర్ ఏంటి నువ్వు చెప్పేది నీవు అంజలివి అయితే మరి నా లక్ష్మి ఏది? నీవు అబద్ధం చెబుతున్నావు కదా అని అంటాడు సాగర్.అప్పుడు అంజలి లేదు నేను చెప్పేది అంతా నిజం నీ లక్ష్మి ఎప్పుడో చనిపోయింది నా రూపంలో ఉన్న పాపానికి తను ఎప్పుడో బలైపోయింది అని అంటుంది అంజలి.నీ భార్య లక్ష్మికి ఇచ్చిన మాట ప్రకారం నీ కుటుంబాన్ని చక్కదిద్దడానికి నేను అంజలిగా చనిపోయి లక్ష్మిగా నీ ఇంట్లో అడుగు పెట్టాను అని చెబుతుంది అంజలి. అప్పుడు సాగర్ షాక్ అవుతాడు.కానీ ఇప్పుడు నా భర్త బంటి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నేను వెళ్లకపోతే ఇక ఎందుకు చెప్పండి. అందుకనే నా అజ్ఞాత వాసానికి ముగించడం తప్పదు అనుకున్నాను అందుకే మీకు ఇప్పుడు నిజం చెబుతున్నాను అని అంటుంది అంజలి. నాకు నేనుగా వేసుకున్న ఈ సంకెళ్ళని ఇప్పుడు తెంచుకోక తప్పదు అనిపించింది అందుకే చెబుతున్నాను అని అంటుంది అంజలి. అప్పుడు అరుణ్ కుమార్ గారు అంజలి నేను ఇన్నాళ్ళ ఈ క్షణం కోసమే ఎదురు చూశాను ఇప్పుడు నీకు నీవుగా, ఈ సంకెళ్ళని తెంచేసావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అరుణ్ కుమార్ గారు ఏడుస్తూ అంజలితో మాట్లాడుతాడు. అప్పుడు అమృత అంజలి ఈ రోజు తో నీ అజ్ఞాతవాసం ముగిసింది ఇక పదమ్మ నీ బంటిని నీవే కాపాడుకోవాలి అని అంటుంది అమృత.
అప్పుడు అంజలి నాది అనుకుంటే బాధ్యత అవుతుందినాది కాదు అనుకుంటే బరువవుతుంది. ఇన్నాళ్లుగా నా గుండెల మీద ఉన్న ఈ బరువును దింపుకోకపోతే ఇక నా మెడలో ఉన్న ఈ మాంగల్యానికి అర్థమే లేదు అని అంటుంది అంజలి. అప్పుడు అంజలి పదమ్మ యమధర్మ రాజుతో పోరాడి అయిన నా, మాంగల్యాన్ని నేను నిలబెట్టుకుంటాను అని అంటూ కారు ఎక్కి అంజలి వాళ్ళు వెళ్ళిపోతుండగా సాగర్ షాక్ అయ్యి అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక హాస్పిటల్ కి చేరుకున్న అంజలి బంటి నా బంటి నేను వచ్చేసాను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను అని వస్తుండగా, అంజలిని చూసిన ఆశ వచ్చేసావా రావే నిన్ను ఎలా ఆడుకోవాలో నేను ఆడుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అంజలి వచ్చేసాను ఆశ ఇక నన్ను నా బంటిని విడదీయడం నీ వల్ల కాదు కదా నీ బాబు వల్ల కూడా కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది అంజలి. ఇక అప్పుడు అరుణ్ కుమార్ గారు పద బంటిని చూద్దాం అని అంజలిని తీసుకు వెళుతుండగా అప్పుడు ఆశ కూడా నేను వస్తాను అంటూ, వెళుతుండగా అమృత నీవెందుకు అయినా ఐసీయూ లో ఉన్న పేషెంట్ దగ్గరికి అందర్నీ రానివ్వరు నీవు ఇక్కడే ఉండు అంజలి అని మేము తీసుకెళ్తాము అని అంటుంది అమృత