NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights

Malli Nindu Jabili: మాలిని అక్కడికి ఎందుకు తీసుకువెళుతుంది అని ఆలోచిస్తాడు గౌతమ్. అక్క ఆయనని మా అత్తయ్యని ఇంటికి ఎందుకు రమ్మంటున్నావ్? కారు ఆపు నేను ఇక్కడే దిగి ఇంటికి వెళ్తాను అని మల్లి అంటుంది. మల్లి నువ్వు సైలెంట్ గా కూర్చో తర్వాత చెప్తాను అని మాలిని మల్లిని వాళ్ళ ఇంటికి తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, అమ్మ తొందరగా రా మల్లి కళ్ళు తిరిగి గుళ్లో పడిపోతే మాలిని హాస్పటల్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకు వెళుతుంది అంట వెళ్దాం అని గౌతమ్ అంటాడు. మల్లి కళ్ళు తిరిగి పడిపోవడమేంటి మాలిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడమేంట్రా అని కౌసల్య అంటుంది. తెలియదమ్మా మనం తొందరగా వెళ్ళాలి రా అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights
Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights

మల్లి కళ్ళు తిరిగి పడిపోయింది అంటే ఏదో విశేషమై ఉంటుంది రా నువ్వు వెళ్ళు నేను రాను అని కౌసల్య అంటుంది. నువ్వు రా మా అక్కడికి వెళ్లాలి ముందు అని గౌతమ్ వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్తాడు. కట్ చేస్తే, మాలిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రమ్మని పిలుస్తుంది. శంకరమ్మ కి ఒక ప్లేట్లో గంధం పసుపు కుంకుమ పళ్ళు పూలు పెట్టి తీసుకురమ్మని చెబుతుంది. ఎందుకక్కా అవన్నీ అని మల్లి అంటుంది. నువ్వు సైలెంట్ గా కూర్చో అందరికీ ఒకేసారి చెప్తాను గౌతమ్ వాళ్లు కూడా రాని అని మాలిని అంటుంది. నువ్వేదో పూజ చేసుకుని తాంబూలం ఇస్తున్నట్టు ఉంది మాలిని అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights
Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights

ఏం చేస్తున్నావ్ మాలిని అని శరత్ అంటాడు. ఇంతలో గౌతమ్ వాళ్లు కూడా అక్కడికి వస్తారు. మల్లి ఇది తాంబూలం అనుకుంటావో ఇంకేం అనుకుంటావో నీ ఇష్టం నీ అక్కగా నీకు ఇస్తున్నాను తీసుకో అని మాలిని తన ఒడిలో తాంబూలాన్ని పెడుతుంది. ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా మాలిని అని వసుంధర అంటుంది. నా చెల్లి తల్లి కాబోతుంది మమ్మీ అని మాలిని అంటుంది. డాక్టర్ గారు నిన్ను చూసి నువ్వు తల్లి కాబోతున్నావని చెప్పింది మల్లి అని మాలిని అంటుంది. ఈ చెత్త విషయం చెప్పడానికి మల్లి నీ ఇక్కడిదాకా తీసుకువచ్చావా అని వసుంధర అంటుంది. అమ్మగారు మల్లి విషయంలో మీరు ఎన్నోసార్లు ఎన్నో అన్నారు కానీ ఇప్పుడు మాత్రం మల్లిని ఏమి అనకండి మా అని మీరా అంటుంది. మల్లి మాత్రం ఆ విషయం విని షాక్ లోనే ఉంటుంది. ఈ విషయం కొందరికి కడుపు మంట గానే ఉండొచ్చు కానీ మా కుటుంబానికి ఇది మంచి శుభవార్త మల్లి మాకు వారసున్ని ఇస్తున్నావు అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights
Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights

మల్లి ఎన్నో రోజులుగా పిల్లలు కావాలి అంటున్నాను నన్ను తండ్రిని చేసినందుకు చాలా థాంక్స్ అని గౌతమ్ మల్లి తీసుకువెళ్లబోతు ఉంటాడు. ఒక్క నిమిషం గౌతమ్ నేను మల్లి తో మాట్లాడిన తర్వాత తీసుకువెళ్ళు అని మాలిని అంటుంది. మల్లి అరవింద్ చనిపోయి నేను బాధపడుతూ ఉండగా ఒక రోజు నా దగ్గరికి వచ్చావు గుర్తుందా ఆరోజు నువ్వేమన్నావు నీకు బిడ్డలు పుట్టే అవకాశం పోయింది కాబట్టి నేను కూడా పిల్లలు కనకుండా ఉంటాను అక్క నీకు లేని సంతోషం నాకు అక్కర్లేదు అని అన్నావు కానీ నేను నా భర్త ఫోటో ముందుకు కూర్చుని ఏడుస్తూ ఉంటే నీ భర్తతో ఆనందంగా పిల్లల్ని కనడానికి ప్రయత్నిస్తావా నేను నా అరవింద్ చనిపోయాడు అని గుండెలు పగిలేలా ఏడుస్తుంటే నీ భర్తతో కాపురం చేస్తూ ఆనంద  అనుభవిస్తావా ఇదేనా రక్తసంబంధం లో ఉండే స్వార్థం మా మమ్మీ ఎన్ని సార్లు చెప్పినా నేను వినలేదు ఇప్పుడు అర్థమైంది నువ్వెంత స్వార్ధపరురాలివో నేను బాధలో ఉంటే నువ్వు ఇలా ఎలా చేస్తావు మల్లి అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights
Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights

నేను అసలు తల్లిని కావాలని అనుకోలేదు ఎలా అయ్యాను అని మల్లి ఆలోచిస్తుంది. ఆ టాబ్లెట్లు మార్చి తను తల్లి అయ్యేలా చేశాను అని గౌతమ్ అనుకుంటాడు.ఇప్పటికైనా దీని గురించి అర్థమైంది కదా దూరంగా ఉండడం మంచిది అని వసుంధర అంటుంది. మన పరిస్థితి బాగోలేదని ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండకూడదని కోరుకోవడం తప్పు మాలిని అని శరత్ అంటాడు. నీ కూతురు తల్లి కాబోతుందని మీకు సంతోషంగా ఉందేమో నాకు కడుపు మంటగా ఉంది అని వసుంధర అంటుంది. జరిగిన దాంట్లో మల్లి తప్పేమీ లేదు ఇకమీదటైనా నువ్వు మారితే మంచిది వసుంధర అని శరత్ అంటాడు. దేవుడు వ్రాసిన తలరాతలకి నా కూతుర్ని నిందిస్తున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా అని మీరా అంటుంది. నీ కొంపలో ఉండడానికి ఏమి రాలేదు అని కౌసల్ అంటుంది. ఇంకెప్పుడూ ఇది నా ఇంట్లో కనపడకూడదు తీసుకొని వెళ్ళిపో అని వసుంధర అంటుంది.మల్లి ఇక్కడ ఇంతసేపు ఉండడం అంత మంచిది కాదు మన ఇంటికి వెళ్దాం పద అని కౌసల్య అంటుంది.గౌతమ్ మల్లి ని తీసుకుని వెళ్తాడు.

Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights
Malli Nindu Jabili Today Episode  April 29 2024 Episode 635 highlights

మల్లి నువ్వు తల్లివి కాబోతున్నావా అన్న విషయం ఒక కన్నతల్లిగా నాకెంత సంతోషాన్ని ఇచ్చిందో తన కూతురు తల్లి కాదన్న విషయం తనకి అంతే బాధ కలిగిస్తుంది,బాబు గారు మీరు తండ్రి కావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారు మీ కోరిక నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కౌసల్యమ్మ గారు మల్లి ని ఇప్పుడైనా సాధించకుండా కూతుర్ల ప్రేమగా చూసుకోండి అని మీరా అంటుంది.మల్లి ని తీసుకొని వెళ్ళిపోతారు గౌతమ్ కౌసల్య. మాలిని మాత్రం గుండె నిండా బాధతో గదిలోకి వెళ్ళిపోతుంది. మల్లి ఆలోచనలో పడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri

This Week OTT Movies: ఈవారం ఓటీటీలోకీ వచ్చేస్తున్న 21 సినిమాలు ఇవే.. కానీ ప్రతి ఒక్కరి ధ్యాస ఆ రెండిటి పైనే..!

Saranya Koduri

Jabardasth Faima: ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్నాం.. లవర్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఫైమా..!

Saranya Koduri

NTR: అల్లూరి సీతారామరాజు మూవీ చేయొద్దు అంటూ కృష్ణను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్.. కారణమేంటి..?

Saranya Koduri

Shobha Shetty: గృహప్రవేశం రోజు తీవ్ర నీరసానికి గురైన శోభా శెట్టి.. పూజలకు దూరం.. ఎమోషనల్ అయిన యశ్వంత్..!

Saranya Koduri

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella