Naga Panchami: జ్వాలా వాళ్ళ ఇంట్లోకి చేరుకున్న గరుడ రాజు నిద్రిస్తున్న జ్వాలా గర్భంలోకి సూక్ష్మ రూపంగా మారి ప్రవేశిస్తాడు.తెల్లవారింది అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు జ్వాలా చిత్రాలు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటారు.మోక్ష పంచమి కూడా టిఫిన్ చేయడానికి కిందికి వస్తారు. వైదేహి జ్వాలా చిత్ర వాళ్లకు కూడా వడ్డించండి అని అంటుంది. జ్వాల అదేంటది వాళ్ళకి ఎవరి సహాయం అవసరం లేదు కదా మరి మేము ఎలా వడ్డించము అని అంటుంది.మోక్ష మాకు ఎవరి సహాయం అవసరం లేదు అంటూ పంచమికి టిఫిన్ వడ్డిస్తాడు మోక్ష.అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా జ్వాలా కు కడుపులో పిసికినట్లుగా అయి వెళ్లి వాంటింగ్ చేసుకుంటుంది. అది చూసిన అందరూ షాక్ అవుతారు చిత్ర జ్వాల దగ్గరికి వెళ్లి ఏంటక్కా ఏంటి వాంటింగ్ చేసుకుంటున్నావు అని అడుగుతుంది.
జ్వాలా ఏమో తెలియదు చిత్ర ఉదయం నుంచి అంతా కడుపులో పిసుకుతున్నట్లుగా అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి అని చెబుతుంది జ్వాల. చిత్ర ఏంటక్కా నీ వాళ్ళకం చూస్తుంటే ఇవి ప్రెగ్నెన్సీ వాంటింగ్స్ లాగా ఉన్నాయి అని అంటుంది చిత్ర. జ్వాలా అయినా నాకు ఇప్పుడే పిల్లలు వద్దు నేను ఆ బటన్ మోయలేను అంటుంది జ్వాలా. శబరి నువ్వు అనుకుంటే అవుతుందా ఏంటి అది దేవుడు ఎప్పుడు ఎవరికీ ఏమి ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు అంటుంది. చిత్ర అయినా నీకెందుకు అక్క భయం భయపడాల్సిన అవసరమేంటి నీకేమైనా పామలు పక్షులు పుడతాయా ఏంటి అలాంటి వారే ఏది ఏమైనా సరే పిల్లనుకనే తీరుతామని అంటున్నారు అలాంటప్పుడు నువ్వెందుకు అక్క భయపడతావు పిల్లల్ని కానీ తీరాలి అంటుంది చిత్ర.
కట్ చేస్తే మోక్ష ఏంటి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మా బిడ్డ గురించి కదా అసలు మీరు మా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మాటలు తిన్నగా రానివ్వండి అంటాడు మోక్ష. జ్వాల అవును అంటాము ఇప్పుడు చిత్ర అన్నదాంట్లో తప్పేముంది డాక్టర్స్ మాకు ఏమైనా మా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏ రూపంలో ఉందో తెలియదు అని చెప్పారా ఏంటి అంటుంది. మోక్ష నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడమంటున్నానా అయినా కానీ మా బిడ్డ ఎలా పుడితే మీకేం అవసరం భరించేది మేము ఇంకొకసారి మా గురించి మాట్లాడితే మాత్రం ఇలా తప్పుడు కూతలు కూస్తే మాత్రం తన్ని తరిమేయాల్సి వస్తుంది అంటాడు మోక్ష. ఆ మాటకు కుమార్ భార్గవ్ షాక్ అయ్యి అలాగే చూస్తారు చిత్ర అమ్మో అమ్మో చూశావా అక్క మనల్ని తన్ని తరిమేస్తాడంట అంటే ఏంటి దీని అర్థం ఈ ఆస్తి అంతా ఇతని గారిదే అని మాట్లాడుతున్నాడు కదా అంటుంది చిత్ర. అప్పుడు కుమార్ కోపంగా లేచి మోక్ష మాటలు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు తన్ని తరిమేస్తూ ఉంటే ఇక్కడ ఎవరూ చేతికి గాజులు వేసుకొని కూర్చోవడం లేదు అంటాడు కుమార్.
మోక్ష అయితే ఏం చేస్తారు కొడతారా అని అంటాడు మోక్ష. భార్గవ్ ఈ ఆస్తంతా నీ ఒక్కడిదే అయినట్టు మాట్లాడితే ఏంటి ఇందులో మాకు కూడా వాటా ఉంది ఆ మాటకొస్తే కొడతాము కొట్టి తీరుతాము అని అంటాడు భార్గవ్.మోక్ష అయితే రండిరా చూసుకుందాం అంటూ కుమార్ భార్గవ్ మీదికి వెళతాడు. చిత్ర అమ్మో అమ్మో చూశారా అత్తయ్య ఈ మోక్ష మమ్మల్ని నిజంగానే కొట్టి చంపేసేలా ఉన్నాడు ఈ పంచమి వల్ల పంచమి కడుపులో బిడ్డ వల్ల ఇదిగో ఇలాంటి గొడవలే ఇంట్లో మొదలైతాయని చెప్పింది ఆ సోది అమ్మ అదంతా ఇప్పుడు నిజంగా జరుగుతుంది అత్తయ్య అంటుంది చిత్ర. రఘురాం మోక్ష నువ్వు ఆగు అంటాడు.
పంచమి ఆగండి మోక్ష బాబు అంటూ మోక్ష చెయ్యి పట్టుకుని లాగుతుంది. వైదేహి ఏంటి మోక్ష చిన్న పెద్ద తేడా లేకుండా అలా మాట్లాడతావా అని అంటుంది. మోక్ష ఆ తేడా లేకుండా మాట్లాడింది వాళ్ళు వాళ్ళని అనవేంటమ్మా నన్ను అంటావు అని అంటాడు మోక్ష. రఘురాం మోక్ష ముందు నువ్వు పంచమిని తీసుకుని నీ గదిలోకి వెళ్ళు అంటాడు మోక్ష పంచమిని తీసుకుని వెళ్లిపోతాడు. శబరి చూడండి మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి తీరని గాయం చేస్తున్నారు మీ కళ్ళు అంతా ఆ పంచమి కడుపులో ఉన్న బిడ్డ మీదనే కదా ఆ బిడ్డకు పొరపాటున ఏదైనా జరగకూడని జరిగిందే అనుకో ఆ పాపం మొత్తం మీదే అవుతుంది గుర్తుపెట్టుకోండి అంటుంది శబరి.
కట్ చేస్తే మోక్ష పంచమిని తీసుకొని బయటికి వెళ్లడానికి కారు లో కూర్చుంటాడు. ఖరాలి తన మంత్ర శక్తితో ఒక పెద్ద అగ్నిజ్వాలను వాళ్ల కారు మీద పడి కాలిపోయేలా చేస్తుంది. మోక్ష పంచమి కూర్చున్న కారు మంటలు అంటుకుంటాయి. లోపల ఉన్న మోక్ష పంచమి బయటకు రావడానికి వీలు లేకుండా తన మంత్ర శక్తితో డోర్ లాక్ చేస్తుంది ఖరాలి. ఆ మంటలు చూసినా ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చి మోక్ష బయటకు వచ్చేసి బయటికి వచ్చేసి అని అరుస్తూ ఉంటారు కానీ చిత్రా జ్వాలా భార్గవ్ నీ కుమారుని వెళ్లొద్దు అంటూ చెయ్యి పట్టుకుని గట్టిగా లాగుతూ ఉంటారు. ఎలాగో ఒకలాగా మోక్ష డోర్ మాత్రం ఓపెన్ అయ్యి బయటకు వస్తాడు. కానీ పంచమి వైపు ఉన్న డోరు లాకు రాకపోవడంతో పంచమి కార్ లోనే ఉంటుంది. ఖరాలి పంచమిని ఆ మంటల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ నవ్వుతూ ఉంటుంది