Paluke Bangaramayenaa October 9 ఎపిసోడ్ 42: ఎవరితో షాపింగ్ కి వచ్చిందనుకుంటా కనీసం నాకు చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు నేను తన కాబోయే మొగుడిని కదా అని విశాల్ అంటాడు. తనేదో తెలియక వచ్చి ఉంటుందిలే నీకు చెప్పాల్సిన పని ఏముందిరా అని వాళ్ళ అమ్మ అంటుంది. స్వర మీద నాకు చానా అనుమానం వస్తుంది కచ్చితంగా పోలీస్ వాడు కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు అని వెతుకుతూ ఉంటాడు. ఏ విశాల్ ఏంట్రా దీనికోసం అటు ఇటు వెతుకుతున్నావ్ తను నీకు కాబోయే భార్య కాదు పార్టీలో కూడా పరిచయం చేసుకోలేదు నీ భార్యని పరిచయం చేయద్దు పద అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. నేను తనతో కలిసి రాలేదు ఎవరో అబ్బాయితో వచ్చి ఉంటుంది అని విశాల్ అంటాడు. రేయ్ నీకు కాబోయే భార్య మీద అంత అనుమానం ఏంట్రా నువ్వు ఇంకా మారలేదా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.

ఆ పోలీసోడు వచ్చి ఉంటే పార్కింగ్లో వాడి కారు ఉంటుందిగా వెళ్లి చూద్దాం అని వెళ్లి చూస్తే అక్కడ కారు ఉంటుంది నిమెనాన మాట స్వర పోలీసోడు కలిసే వచ్చారు అని విశాల్ అనుకుంటాడు. కట్ చేస్తే అన్నయ్య నాకు మూడు డ్రెస్సులు నచ్చాయి ట్రైల్ వేసి చూస్తాను అని కీర్తి అంటుంది. అలాగేనమ్మా థాంక్యూ స్వరా మా చెల్లెలికి కాస్ట్లీ డ్రెస్సులు ఎక్కడ కొనియాల్సి వస్తుందిఅని టెన్షన్ పడ్డాను సర్ది చెప్పావు అని అభి అంటాడు. ఇంతలో స్వర విశాల్ ని చూస్తుంది అభి సార్ ఇలా రండి విశాల్ కూడా షాపింగ్ కి వచ్చాడు మనిద్దరిని ఇలా చూస్తే బాగోదు అని స్వర అంటుంది. ఇలా కంగారు పడడం మానేసి కూల్ గా నాకు ఏం జరిగిందో చెప్పు అని అభిషేక్ అంటాడు.

మా నాన్నకి మా పిన్నికి నీతో మాట్లాడితే నచ్చదు వాళ్లు చూస్తే నిను జాబ్ లో నుంచి తీసేస్తారు అన్ని స్వర అంటుంది. చూడు స్వర నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు వాళ్ళు ఏం చేసినా నన్ను జాబ్ లో నుంచి తీసే లేరు అందుకేనా నువ్వు ఇంతకుముందులా నాతో మాట్లాడట్లేదు అని అభిషేక్ అంటాడు. దేవుడా వాళ్ళిద్దరూ వీడికంట పడకుండా చూడు అని విశాల్ వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ల కోసం షాపింగ్ మాల్ అంత వెతుకుతూ ఉంటాడు విశాల్. ఇంతలో వాళ్ళ షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు అభిషేక్ వాళ్ళు. లాభం లేదమ్మా పార్కింగ్ దగ్గర వెయిట్ చేద్దాం పద అని విశాల్ అంటాడు తీరా అక్కడికి వచ్చి చూస్తే కారుండదు వెళ్లిపోయారమ్మ స్వరా నన్నే మోసం చేస్తావా అని విశాల్ అనుకుంటాడు.

కట్ చేస్తే ఇప్పుడు టైమ్ ఎంత అయిందో తెలుసా 10 అవుతుంది అని అభిషేక్ అంటాడు. అవునా చూసుకోలేదు అబి షాపింగ్ ఎలా జరిగింది కీర్తి కి డ్రెస్సులు నచ్చాయా అయినా స్వర పక్కనే ఉంది కదా నచ్చేలా చేస్తుందిలే అని ఝాన్సీ అంటుంది. స్వర ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి వాళ్ల నాన్నకి పిన్నికి ఇంకా భయపడుతుంది ఇన్ని రోజులు స్వర నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని నేను అనుకున్నాను ఆ కారణం ఏంటో ఈరోజు తెలిసింది అని అభిషేక్ అంటాడు. కూతురు దగ్గర ఉన్న ప్రేమ పంచలేని తండ్రి స్వర వల్ల నాన్న అయితే కూతురు దూరమైన తనకోసం పోరాడుతున్న విశ్వం ఇందు కోసం ఎంతలా పోరాడుతున్నాడు ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉంది చూడు అని ఝాన్సీ అంటుంది. ఇందుకు న్యాయం జరగాలంటే ఆ చంటి అనే వాడు దొరకాలి అని అభిషేక్ అంటాడు. వాడి దొరికితే సరిపోదాబి పద్మవ్యూహం లాంటి వ్యూహం పన్నాలి వాడంతట వాడే వచ్చి తనలో ఈరుక్కోవాలి అలా పగడ్బందీగా ప్లాన్ చేయాలి అని ఝాన్సీ అంటుంది.

కట్ చేస్తే నాన్న పిన్ని అక్క వాళ్ళని మోసం చేస్తున్నారు ఈ నిజం తెలిస్తే అక్క పెద్దమ్మ తట్టుకోలేరు అని ఆర్య అనుకుంటాడు. ఇంతలో స్వర వచ్చి ఏంటి ఆర్య డల్లుగా ఉన్నావు అని అంటుంది. ఏమీ లేదు అక్క బాగానే ఉన్నాను అని ఆర్య అంటాడు. నా తమ్ముడు ఎలా ఉంటాడో నాకు తెలియదా నిజం చెప్పు అని స్వర అంటుంది. ఏమీ లేదక్కా ఈరోజు లేట్ అయింది ఏంటి అని ఆర్య అంటాడు. అబి సార్ వాళ్ళ చెల్లెలు తో షాపింగ్ కి వెళ్ళాను అందుకే లేట్ అయింది ఈ గిఫ్ట్ తెచ్చాను నాన్నకి ఇద్దామనుకుంటున్నాను ఎలా ఉంది అని స్వర అంటుంది. అక్క న్నాన రావడానికి లేట్ అవుతుంది అది నేనే ఇస్తానులే ఇలా ఇవ్వు అని ఆర్య అంటాడు.

వద్దులే తమ్ముడు ఎంత లేట్ అయినా సరే నాన్నకి నేనే ఇస్తాను అని స్వర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే స్వర ఫోటోని చూస్తూ అభి కాసేపు పెళ్ళంటావ్ కాసేపు పెళ్ళికొడుకు ఎవరో చెప్పనంటావ్ ఎలా అర్థం చేసుకునేది రాక్షసి అని అబి అంటాడు. చూసావటే ఫోన్లో అమ్మాయి ఫోటో చూసుకొని వాడిలో వాడు ఎలా మురిసిపోతున్నాడు అని అభిషేక్ వాళ్ళ బామ్మ అంటుంది. అవునత్తయ్య వెళ్లి చూద్దాం పద అని వాళ్ళిద్దరూ వెళ్తారు. ఏంటి దొంగల నక్కి చూస్తున్నారు అని అభిషేక్ అంటాడు. ఏమీ లేదురా అబ్బాయి ఫోన్ లో ఎవరిదో ఫోటో చూసి మురిసిపోతున్నావేంటి అని వాళ్ళ బొమ్మ అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది