Madhuranagarilo October 9th ఎపిసోడ్ 178: అలాగే నువ్వు ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి అని మధుర అంటుంది. ఏంటి అత్తయ్య అది అని సంయుక్త అంటుంది. రాధకి శ్యామ్ కి పెళ్లి జరిగింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటే బాగోదు వెళ్లిపోతే బాగుంటుంది అప్పుడంటే శ్యామ్ కి నీకు పెళ్లి చేద్దామని ఇక్కడ ఉండమన్నాను ఇప్పుడు వాళ్లకు పెళ్లి అయిపోయింది కదా అందుకే నువ్వు కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది త్వరలోనే నీకు మంచి సంబంధం చూసి నిను అత్తవారింటికి పంపిస్తాను అని మధుర అంటుంది. వద్ద అత్తయ్య అలాంటివి ఏమీ చేయకండి ఎందుకంటే నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు పెళ్లి అనే మాట న్నాను అంతలా బాధ పెట్టింది వీలైనంత తొందరలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని సంయుక్త అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేసి ఒరేయ్ దీక్షిత్ ఈరోజు మా అమ్మ నాన్నలతో కలిసి వచ్చాను వీళ్ళే మా అమ్మ నాన్నలు అని పండు వాళ్ళని చూపెడతాడు. కొత్తగా చెప్తావ్ ఏంటి రా ఇంతకుముందు కూడా మీ నాన్నతో కలిసి వచ్చావు కదా ఈ రోజు నా బర్త్ డే చాక్లెట్ తీసుకో అని నిహాల్ అంటాడు.

రెండు రోజుల్లో కూడా నా బర్త్ డే ఉంది నాన్న నాకు గ్రాండ్ గా బర్త్డే చేస్తారా మా స్కూల్లో అందరికీ చాక్లెట్ పంచుతాను అని పండు అంటాడు. అలాగే నాన్న బాయ్ అని శ్యామ్ అంటాడు. బాయ్ నాన్న ఉంటాను అని పండు లోపలికి వెళ్ళిపోతాడు. రాధా మనం ప్రిన్సిపాల్ ని కలవాలి లోపలికి రా అని వెళ్లి శ్యామ్ ప్రిన్సిపాల్ ని కలుస్తాడు.ఏమైనా ప్రాబ్లమా అని ప్రిన్సిపాల్ అంటాడు. ఒకసారి అడ్మిషన్ ఫామ్ ఇస్తారా అని శ్యామ్ అంటాడు. అలాగే అని అడ్మిషన్ ఫామ్ ఇస్తాడు ప్రిన్సిపాల్.సార్ ఇకముందు పండుకి నేను గార్డెన్ కాదు వాళ్ళ ఫాదర్ని నేను రాధ పెళ్లి చేసుకున్నాము ఇకమీదట జరిగే పేరెంట్స్ మీటింగ్ కి మేము అటెండ్ అవుతాము మమ్మల్ని పిలవండి అని శ్యామ్ అంటాడు. పెళ్లిరోజు శుభాకాంక్షలు అలాగే పిలుస్తాము అని ప్రిన్సిపాల్ అంటాడు. కట్ చేస్తే ఏంటి రాధా ఏమి మాట్లాడవు ఇంతకుముందు గలగలమని మాట్లాడే దానివి ఓకే నీ మూడు బాగోలేనట్టుంది పాటలు పెడతాను విను అని శ్యామ్ పాటలు పెడతాడు.

పెళ్లయితే అయ్యింది కానీ పండు గురించి ఆలోచిస్తే ఏమీ బాగోలేదు పండు ఆరోగ్యం కుదుటపడ్డాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ ఈ లోపు ఇలా జరిగిపోయింది అని రాదా అనుకుంటుంది. రాధా నీకు బ్రేక్ ఫాస్ట్ అంటే ఏది ఇష్టం అని శ్యామ్ అంటాడు. ఇప్పుడు నా ఇష్ట ఇష్టాల గురించి ఎందుకు సార్ అని రాదా అంటుంది. నాకు చాలా ఆకలేస్తుంది రాధ ఏదైనా రెస్టారెంట్ దగ్గర ఆపుతాను టిఫిన్ చేసి వెళ్దాం అని శ్యామ్ అంటాడు. నాకు అక్కర్లేదు సార్ నాకు ఆకలిగా లేదు అని రాదా అంటుంది. ఆకలిగా లేదా నాతో కలిసి తినడం ఇష్టం లేదా అని శ్యామ్ అంటాడు.ఇందాకే చెప్పాను కదా సార్ నా ఇష్టంతో పనేముందని మీకు ఆకలి వేస్తే మీరు తినండి అని రాదా అంటుంది. అయితే నాకు వద్దులే వెళ్దాము అని శ్యామ్ అంటాడు.

సరే సార్ మీ ఇష్టం అని రాదా అంటుంది.కట్ చేస్తే ఏంటి పండు నీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చారా అని ధనుంజయ్ అంటాడు. అవు నాన్న పండు హ్యాపీ నేను హ్యాపీ అని శ్యామ్ అంటాడు. అదేంటి రాధా హ్యాపీగా లేదా అని మధుర అంటుంది. లేదా నేను హ్యాపీగానే ఉన్నాను పండు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను ఏంటి అత్తయ్య మీరు ఇంకా టిఫిన్ చేయలేదా అని రాదా అంటుంది. లేదమ్మా అని మధుర అంటుంది. ఏంటి అత్తయ్య ఇంకా టిఫిన్ చేసి టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటారు రేపటి నుంచి ఇలా జరగకూడదు అని టైం టు టైం వేసుకోవాలి అని రాధా అంటుంది. అలాగే అమ్మ రేపటి నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మధుర అంటుంది.

అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. కట్ చేస్తే ఇంతలో పూజారి గారు వస్తారు. నమస్కారం గురువుగారు ఇదిగోండి నా కొడుకు కోడలు జాతకాలు అని మధుర అంటుంది. అమ్మ మీ అబ్బాయి జాతక ప్రకారం ఏడేళ్ల క్రితం పెళ్లి అయింది ఆ పెళ్లి ప్రభావం ఇప్పుడు వీళ్ళ మీద పడి వీళ్ళ జంట అంతగా బాగోదు ఈ జాతకాలు శాస్త్రి గారికి చూపెట్టి పరిహార పూజకి ముహూర్తం పెడతాను అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి అని పూజారి వెళ్ళిపోతాడు. అమ్మ వస్తే గిస్తే నా మొదటి భార్య వల్లే నాకు సమస్య వస్తుంది అని శ్యామ్ అంటాడు. అసలు ఎవర్రా అమ్మాయి అమ్మాయి పేరేంటి అని మధుర అంటుంది. ఆ అమ్మాయి పేరు రుక్మిణి వాళ్లది కేసముద్రం అని శ్యామ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది