NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మనం చేసిన మంచి గ్రామగ్రామాన ఇంటింటికి తెలియజేయాలి .. కొత్త కార్యక్రమాలు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్

Share

YSRCP:మనం చేసిన మంచిని గ్రామగ్రామాన ఇంటింటా అందరికీ తెలియజేసే బాధ్యతను మండల స్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధుల భుజస్కందాలపై మోపుతున్నానని అన్నారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు సోమవారం వైసీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. తొలుత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సభా ప్రాంగణంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సమావేశంలో వైసీపీ కొత్తగా నాలుగు కార్యక్రమాలను ప్రకటించింది.

నాలుగు కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. 1. జగనన్న ఆరోగ్య సురక్ష, 2.వై ఏపీ నీడ్స్ జగన్, 3.ఆడుదాం ఆంధ్ర, 4, బస్సు యాత్ర లతో ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన అందరూ తన కుటుంబ సభ్యులని అన్నారు. రాష్ట్ర చరిత్రలో 52 నెలల్లో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చేశామన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయలు లబ్దిదారులకు బటన్ నొక్కి నేరుగా అందజేశారమని తెలిపారు.  మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ చెప్పారు. ప్రజలకు తొలి సేవకుడిగా బాధ్యతతో వ్యవహరించానని అన్నారు.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే జరుగుతోందనీ, దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం జగన్ సూచించారు. నవంబర్ 10 వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నవంబర్ 1 వ తేదీ నుండి డిసెంబర్ 10వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించాలన్నారు. సచివాలయ పరిధిలో జరిగన అభివృద్ధి పనులు, సంక్షేమ వివరాలు తెలియజేసే బోర్డులను ఆవిష్కరించే కార్యక్రమంలో నాయకులు పాలుపంచుకోవాలన్నారు. ప్రతి గ్రామంలోనూ ఎంత మందికి మంచి జరిగిందో బోర్డులు ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ సందర్భంగా గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని చెప్పారు. గ్రామాల్లో పెద్దల ఇంటికి వెళ్లి వారితో సమావేశం అవ్వాలనీ, వారి ఆశీస్సులు, దీవెనలు తీసుకోవాలన్నారు.

ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 31వరకూ దాదాపు 60 రోజులు బస్సు యాత్రలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయన్నారు. ఈ బస్సు యాత్రల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు, సీనియర్ నాయకులు ఉంటారనీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గాల్లో మీటింగ్ లు జరుగుతాయన్నారు. ప్రతి రోజు రాష్ట్రంలో మూడు మీటింగ్ లు జరుగుతాయన్నారు. ఇది మామూలు బస్సు యాత్ర కాదనీ, ఇది సామాజిక న్యాయ యాత్ర, పేద సామాజిక వర్గాలను కలుపుకుని వెళ్లే యాత్ర, పేదలకు మంచిని వివరించే యాత్ర, పేదవాడి తరపున నిలబడే యాత్ర అని అన్నారు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే యుద్దం.. పేదవాడికి, పెత్తందార్లకు మద్య జరిగబోయే యుద్దం అన్నారు. జరగబోయే క్లాస్ వార్ లో పేదవాళ్లు మొత్తం ఏకం కావాలని అప్పుడే పెత్తందార్లను ఎదుర్కోగలమని అన్నారు.

డిసెంబర్ 11 వ తేదీ నుండి ఆడుదాం .. ఆంధ్ర కార్యక్రమం మొదలవుతుందన్నారు. సంక్రాంతి వరకూ అంటే జనవరి 15 వరకూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఆడుదాం .. ఆంధ్ర కార్యక్రమం అని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహిద్దామన్నారు. మన దేశ టీమ్ లో వైనాట్ ఏపీ అన్నట్లుగా సాగాలన్నారు. ఈ నాలుగు కార్యక్రమాలే కాకుండా జనవరి 1వ తేదీ నుండి మరో మూడు కార్యక్రమాలు మొదలు అవుతాయని తెలిపారు. ఫిబ్రవరిలో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిని చేసుకుందామని, ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోను తీసుకువెళ్తామని తెలిపారు. మార్చి నెలలో ఎన్నికలకు సన్నద్దం అవుతామని సీఎం జగన్ తెలిపారు.

పచ్చగజ దొంగలు చంద్రబాబు అరెస్టును అన్యాయం అంటున్నారని జగన్ విమర్శించారు. బాబును సమర్ధించడం అంటే పేదలను వ్యతిరేకించినట్లేననీ, చంద్రబాబును సమర్ధించడం అంటే పెత్తందారి వ్యవస్థను సమర్ధించడమేనని అన్నారు. రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా .. ఫలితం సున్నానే అంటూ టీడీపీ, జనసేన పొత్తులపై ఎద్దేవా చేశారు సీఎం జగన్. చంద్రబాబు, దత్తపుత్రుడు ఇంకెవరు కలిసి వచ్చినా సున్నానేనని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వాళ్లకు లేదనీ, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం వారి లక్ష్యమని విమర్శించారు. రాజకీయం అంటే చనిపోయాక కూడా బతికుండటం అని అన్నారు. మంచి జరిగితేనే అండగా ఉండాలని కోరుతున్నాననీ, మన ధైర్యం అంతా చేసిన మంచేనని, అందుకే వైనాట్ 175 అని ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు సీఎం జగన్.

AP CID Innar Ring Road Scam: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ .. ఆ మాజీ మంత్రికీ నోటీసులు ..


Share

Related posts

Presidential Poll: విపక్షాల వ్యూహాత్మక అడుగులు.. రాష్ట్రపతి అభ్యర్ధిగా ఆ మాజీ బీజేపీ నేత..?

somaraju sharma

Vakeel saab : వకీల్ సాబ్ మళ్ళీ సెట్స్ మీదకి .. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే దిల్ రాజు ఈ డెసిషన్ ..?

GRK

Grama Panchayats: ఆందోళన బాట పట్టిన సర్పంచ్‌లు..పంచాయతీ నిధులు వెనక్కి పంపిన ప్రభుత్వం

somaraju sharma