NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: బాబుకు బ్యాడ్ డే ..ఏసీబీ కోర్టులోనూ లభించని ఊరట

Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులనూ ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై  ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. అదే విధంగా సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను కూడా న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. ఏసీబీ కోర్టులు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ పై రెండు రోజుల క్రితం ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. కొద్దిసేపటి క్రితం రెండు పిటిషన్ లపై ఉత్తర్వులు జారీ చేశారు.

Unexpected scene in ACB court while Chandrababu was in court cage
Chandrababu

అటు ఏపీ హైకోర్టులోనూ చంద్రబాబుకు చుక్కెదురైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు ఘటన, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన మందస్తు బెయిల్ పిటిషన్ లను హైకోర్టు కొట్టేసింది. గత నెల 9వ తేదీ చంద్రబాబు ను సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దాదాపు నెల రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. చంద్రబాబు తరపున అటు ఏసీబీ కోర్టు, ఇటు హైకోర్టులో సుప్రీం కోర్టు న్యాయవాదులు వాదనలు వినిపించినా, ప్రభుత్వ న్యాయవాదుల వాదనలే న్యాయస్థానాల్లో నెగ్గాయి.

What is this inner ring road case.. If found in this, Tihar Jail is guaranteed for Chandrababu
What is this inner ring road case.. If found in this, Tihar Jail is guaranteed for Chandrababu

మరో పక్క చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు వాడివేడిగా జరుగుతున్నాయి. సుప్రీం కోర్టు ధర్మాసనం నుండి ఎటువంటి ఉత్తర్వులు వెలువడతాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటీ వారెంట్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి.

chandrababu reaction about CID comments
chandrababu

చంద్రబాబు ముందస్తు బెయిల్, బెయిల్ పిటిషన్ లు డిస్మిస్ కావడంతో సీఐడీ చంద్రబాబును ఈ రెండు కేసుల్లోనూ అరెస్టు చూపి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో చంద్రబాబు మరి కొన్ని రోజులు కారాగార వాసం చేయాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి.

YSRCP: మనం చేసిన మంచి గ్రామగ్రామాన ఇంటింటికి తెలియజేయాలి .. కొత్త కార్యక్రమాలు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N