NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 02 2023 Episode 89: స్వరని అభిషేక్ ని ఫోటో తీసిన విశాల్ ఏం చేస్తాడు..

Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights

Paluke Bangaramayenaa December 02 2023 Episode 89: స్వర అభి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కథను ఫోన్ చేసి మేడం ఇక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ని గుద్దేసి ఒకతను వెళ్లిపోయాడు అని చెప్తాడు.ఈయన కాల్ లిస్ట్ లో మీ పేరు ఉండడం చూసి మీకు ఫోన్ చేశాను మీరు ఎంత  త్వరగా వస్తే అంత మంచిది అని అతను అంటాడు. ఎక్కడ జరిగింది అని అడుగుతుంది స్వర. మల్లారెడ్డి గూడలో జరిగిందని చెప్తాడు. నేను వస్తున్నాను అని చెప్పి వెళ్తుంది స్వర. కట్ చేస్తే,ఝాన్సీ గుడి నుంచి ఇంటికి వెళుతూ ఈరోజు ఎలాగైనా సరే అభిషేక్ కి నా ప్రేమ గురించి చెప్పాలి తీరా చెప్పాక ఇదేంటి ఝాన్సీ నేను ఎప్పుడు నేను అలా అనుకోలేదు ఫ్రెండు అనుకున్నాను అంటే నేనేం చేయాలి అని అనుకుంటుంది ఝాన్సీ.ఏదైనా అనుకోని ఈరోజు నా ప్రేమ గురించి చెప్పే తీరుతాను అని ఝాన్సీ అనుకుంటూ ఇంటికి వెళ్తుంది ఝాన్సీ.కట్ చేస్తే,స్వర ఏంటి కృష్ణయ్య ఇలా చేశావు నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అభిషేకుని నేను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాను కదా పొద్దున్నే ఇప్పుడు ఎందుకు ఇలాంటి ప్రమాదం కొని తెచ్చావు అభిషేక్ సార్ కి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అని స్వర అనుకుంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights

ఆటో అతను ఏం జరిగింది అని అడుగుతాడు.ఎవరో ట్రాఫిక్ పోలీస్ కి యాక్సిడెంట్ అయింది ఉన్నాడో పోయాడు అని అంటాడు.అభిషేక్ సారేనా అని స్వర భయ్యపడుకుంటూ అక్కడికి వెళ్లి చూస్తుంది.ఇంతలో అభిషేక్ వచ్చి హలో అక్కడ ఏం చూస్తున్నారు తమాషా చేస్తున్నారా వెళ్ళండి అని అంటాడు.అభిషేక్ ని చూసిన స్వరా పరిగెత్తికెళ్ళి కౌగిలించుకుంటుంది.అదే సమయానికి అక్కడికి ఝాన్సీ వచ్చి చూస్తుంది తన గుండె రెండు ముక్కలైపోతుంది.ఇంతలో అక్కడికి విశాల్ కూడా వచ్చి ఆ దృశ్యాన్ని చూసి తన ఫోన్లో ఫోటో తీసుకుంటాడు. దేవుడా నేను అనుకున్నట్టు జరిగింది థాంక్స్ అని విశాల్ అనుకుంటాడు. ఆ సంఘటన చూసినా ఝాన్సీ అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది.ఏమైంది స్వరా అని అభిషేక్ అంటాడు. ఎవరో ఫోన్ చేసి నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను అని స్వర అంటుంది. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని అని నువ్వు అర్థం చేసుకోవాలి స్వర అని అభిషేక్ అంటాడు. కట్ చేస్తే, ఏంటి రంగరాజు గారు ఇది ఆ కరుణకి ఫామ్ హౌస్ రాసేయడం నాకు ఇష్టం లేదు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights

ఇలాంటి కుక్కలకి అలాంటి బిస్కెట్లు వేస్తూ ఉండాలి వైజయంతి గారు సింహం నాలుగు అడుగులు  వెనకకు వేసినంతమాత్రా సింహం కాకుండా పోతుందా చెప్పు ఇలాంటి వాళ్లు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటారు వాళ్ళని దాటుకొని నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి నాయుడు నీకు సీటు ఇచ్చాడు కదా అని రంగరాజు అంటాడు. సరే రంగరాజు గారు అని వైజయంతి అంటుంది. ఇంతలో విశాల్ అక్కడికి వస్తాడు. వీడొకడు నా ప్రాణానికి పెళ్లి పెళ్లి అని చంపేస్తున్నాడు అని వైజయంతి తిట్టుకుంటుంది. వీడికి ఆ స్వరని అంటగట్టే వైజయంతి దరిద్రం వదిలిపోతుంది అని రంగరాజు అంటాడు. అత్తయ్య నేను వీడియో తీసుకువచ్చాను చూస్తావా అని అంటాడు విశాల్. ఒక్కటే వీడియో ఎన్నిసార్లు చూపెడతావు అని విసుక్కుంటుంది వైజయంతి. నేను చూపించేది మర్డర్ వీడియో కాదు అత్తయ్య రొమాంటిక్ వీడియో నాకు కాబోయే భార్యది అని విశాల్ వీడియో చూపెడతాడు.

Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights

అసలు నీకు ఈ వీడియోలని ఎక్కడ దొరుకుతాయి బాబు అని రంగరాజు అంటాడు.కదా స్క్రీన్ ప్లే అంతా అత్తయ్యే ఈ వీడియో తీసుకెళ్లి మా మామయ్యకి  చూపించి డైరెక్ట్ గా అడుగుతాను నీ కూతుర్ని పెంచడం ఇలాగేనా అని విశాల్ అంటాడు. చూడు బాబు నువ్వు ఈ వీడియో డైరెక్ట్ గా మీ మామగారికి చూపెడతాను అంటున్నావు ఆయన కుర్చీలో నుంచి కదలలేడు మెదడు లేడు ఆయనకి చూపెడితే ఏం చేస్తాడు అని రంగరాజు అంటాడు. ఒకప్పటి నాయుడు అయితే నువ్వు ఈ వీడియో చూపెడితే తోక తొక్కిన పాముల గుస కొట్టేవాడు కానీ ఇప్పుడు అలా కాదు తన కూతురి మీద ప్రేమను పెంచుకున్నాడు ఆ వీడియో చూపెడితే డిలీట్ చేయమంటాడు చేస్తావా అని వైజయంతి అంటుంది. కదలలేని మెదలలేని ఆయన డిలీట్ చేయమంటే నేను చేస్తానా అని విశాల్ అంటాడు. ఇప్పుడు ఈ వీడియో తీసుకెళ్లి చూపెడితే కావాలని మా అమ్మాయిని బ్లెండ్ చేస్తున్నారు అంటారు ఇదే వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశావు అనుకో జనులకు తొందరగా వెళ్ళిపోతుంది నీ చేతులకు మట్టి అంటకుండా ఉంటుంది నీ శత్రువుల జీవితాల మీద దుమ్ము కొట్టినట్టు ఉంటుంది అని రంగరాజు సలహా ఇస్తాడు. ఈ సలహా ఇచ్చినందుకు థాంక్స్ అని వెళ్లిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights

కట్ చేస్తే,ఏం చేస్తున్నావ్ నాయనమ్మ అని చందన అడుగుతుంది. కళ్ళు కనబడడం లేదా బియ్యంలో రాళ్లు వేరుతున్నాను అని వల్ల బామ్మ  అంటుంది. నా సంగతేంటి కానీ నువ్వేంటి కాలు కాలిన పిల్లి లాగా అటు ఇటు తిరిగేస్తున్నావ్ అని వాళ్ళ బామ్మ అంటుంది. మా ఆయన బయటికి వెళ్లాడు కదా ఇంకా రాలేదేంటి అని చూస్తున్నాను అని చందన అంటుంది.నీ మొగుడు ఏమన్నా డ్యూటీ కి వెళ్ళాడా బయట బలాదురుగా తిరగడానికేగా వెళ్ళాడు తినే టైంకి వస్తాడులే అని వాళ్ళ బామ్మ అంటుంది. నువ్వు ఇలాగే మాట్లాడవనుకో ఏదో ఒక రోజు నాకు కోపం వచ్చి నువ్వు నడిచే దారిలో నూనె పోసి కింద పడేస్తాను అని  చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 02 2023 Episode 89 Highlights

పాతకాలం చింతకాయ లాగా ఇంకా నూనెలు పోయడం అరటి తొక్కలు వేయడం ఏంటే నేనే అయితే డైరెక్ట్ గా ఎటాకే అని వాళ్ళ బొమ్మ అంటుంది. అందుకేనా ముసలోడు తొందరగా బకెట్ తన్నేసాడు అని చందన అంటుంది. కాదే బయటికి వెళ్లి వస్తానని అట్నుంచి అంటే పైకి వెళ్ళిపోయాడు అని వాళ్ళ బామ్మ అంటుంది. అంటే తాతయ్య ఇంకా బ్రతికే ఉన్నాడా నీ గోల భరించలేక అటు నుంచి అటే వెళ్ళిపోయి ఉంటాడు అని చందన అంటుంది. నోరు మూయవే పిల్ల పిచ్చుక అని అలా బామ్మ అంటుంది. ఇంతలో ఝాన్సీ బాధపడుకుంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. ఎన్నడూ లేనిది ఏంటి ఝాన్సీ ఇలా బాధపడుకుంటూ వెళ్తుంది అని చందన అనుకుంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Karthika Deepam 2 May 20th 2024 Episode: కార్తీక్ పై నుప్పులు చిందిన దీప.. కాంచనని నిలదీసి కడిగేసిన జ్యోత్స్న..!

Saranya Koduri

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri