NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 02 2023 Episode 2042: ఆశ బంటిల పెళ్ళికి అంజలి లక్ష్మీ గా సంతకాలు చేస్తుందా లేదా..

Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights

Kumkuma Puvvu December 02 2023 Episode 2042 అమృత ఏమండీ త్వరగా పోనివ్వండి లేట్ అయితే అక్కడ పెళ్లి జరిగిపోతుంది తర్వాత మనం ఏం చేయలేము అంటుంది. అరుణ్ కుమార్ అలాగే అమృత స్పీడుగానే డ్రైవ్ చేస్తున్నాను ఉంటాడు. కట్ చేస్తే రిజిస్టర్ ఆఫీస్ కి సాక్షి సంతకాలు పెట్టడానికి సాగర్ లక్ష్మి కొండమ్మ పద్మావతి గారు వస్తారు.ఆశ అదిగో సాగర్ వాళ్ళు వచ్చేసారు ఆంటీ అంటుంది. కావేరి వచ్చారా రండి రండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అసలే వాడు తిక్క శంకరయ్య అంటూ మాకు తిక్క లేపుతున్నాడు అంటుంది కావేరి. లక్ష్మి వచ్చేసాం కదా పదండి అంటు అందరూ లోపలికి వెళ్తారు. ఆశ ఇదిగో ఆఫీసర్ గారు ఆఫీస్ సంతకాలు పెట్టే వాళ్ళు వచ్చేసారు తను లక్ష్మీ ఇతను సాగర్ వీళ్లే మా పెళ్ళికి సాక్షులుగా సంతకాలు చేస్తారు అంటుంది ఆశ. కావేరి ఆ సంతకాలు ఏఓ త్వరగా కానిచ్చి పెళ్లి జరిపించండి అంటుంది. ఆఫీసర్ తిక్కయ్య మధ్యలో విడాకులు తీసుకోరు కదా అంటాడు. కావేరి వీడెక్కడి తిక్కగాడండి బాబు శుభమా అంటూ పెళ్లి కోసం వస్తే విడాకులు అంటాడు ఏంటి అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights
Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights

ఆఫీసర్ తిక్కయ్య ఏ విడాకులు కాకూడదా ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారు వారిలో కొంతమంది తీసుకోవడం లేదా విడాకులు విడాకులు తీసుకున్న వాళ్లందరికీ ప్రేమ లేదా అంటాడు తీర్థయాత్రలు కానీ బస్సులో ప్రయాణం చేస్తున్న వాళ్లకి యాక్సిడెంట్ కాకూడదని ఏమన్నా రాసి ఉందా, అలాగే ఫ్లైట్లో దేవున్ని చూడడానికి వెళ్లే వాడికి ఫ్లైట్ క్రాష్ అవ్వకూడదని ఏమన్నా రాసి ఉందా అంటాడు. కొండమ్మ అయ్యా తిక్కయ్య గారు మీరు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఏదో ఒక ముద్ద మీ గొంతుకు అడ్డం పడి మీరు పుటుక్కున పోకూడదని ఏమన్నా రాసి ఉందా చెప్పండి అంటుంది కొండమ్మ . ఆఫీసర్ తిక్కయ్య ఈ తిక్కయ్యకే తిక్క ప్రశ్నలు వేస్తున్నారా నాకసలే తిక్క ఎక్కువ నా తిక్కకు లెక్కే లేదు ఎక్కువ మాట్లాడారు అనుకో ఈ పెళ్లి అసలు చేయను గాక చెయ్యను అంటాడు తిక్కయ్య. కావేరి వీడు తిక్కతో చూస్తున్నాము అంటుంది.ఆఫీసర్ తిక్కయ్య కావేరి ని ఓహో అలా అయితే వచ్చి నువ్వు పెట్టు సంతకం అంటాడు. లక్ష్మి అయ్యా తిక్క శంకరయ్య గారు పెట్టాల్సింది వాళ్లు కాదు మేము సంతకాలు పెట్టేది ఆ ఫార్మాలిటీస్ త్వరగా చూసి కానివ్వండి అంటుంది. ఆఫీసర్ తిక్కయ్య ఇదిగో చూడండి నేను ఫార్మలిటీస్ అన్ని పూర్తి చేసినాక పిలుస్తాను అప్పటిదాకా బయట వెయిట్ చేయండి అంటాడు. అన్ని ఫార్మల్ టీస్ చూశాక వారిని పిలుస్తాడు తిక్క శంకరయ్య ఆశ తో బంటితో సంతకాలు చేయిస్తాడు.

Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights
Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights

కట్ చేస్తే అమృత అరుణ్ కుమార్ వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కి చేరుకుంటారు. ఆఫీసర్ తిక్కయ్య సాక్షి సంతకాలు చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ సంతకాలు చేయండి అంటాడు. ఇంతలో అరుణ్ కుమార్ వచ్చి సంతకాలు పెట్టొద్దు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటాడు. ఆఫీసర్ తిక్కయ్య ఇదే మరి తిక్క రేగిపోతుంది ముందే చెప్పాను ఇలాంటి తిరకాసులు పెడితే నేను అసలు ఊరుకోను అంటాడు. అమృత సర్ ఆఫీసర్ గారు మా బంటి కి పెళ్లి ఇష్టం లేకుండా తనని దొంగతనం గా తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు అంటుంది. ఆఫీసర్ తిక్కయ్య ఏంటి బాబు అది నిజమేనా అంటాడు బంటి అవునండి నన్ను హాస్పిటల్ కి అని తీసుకువచ్చారు కానీ ఇక్కడికి వచ్చాక పెళ్ళంటున్నారు అంటాడు బంటి. అమృత అంజలి నీతో కొంచెం మాట్లాడాలి ఇలా బయటికి వస్తావా అంటుంది. అంజలి నేను రాను అయినా మీరు నన్ను పదేపదే అంజలి అని పిలవద్దు అని చెప్పాను కదా మళ్లీ ఏంటి అంజలి అని పిలుస్తున్నారు అంటుంది. అరుణ్ కుమార్ ఏంటమ్మా అంజలి ఇలా మాట్లాడుతున్నావ్ ఒకసారి మాతో రా అని అంటాడు. సాగర్ లక్ష్మీ ఎక్కడికి రాదు మీరు వెళ్లొచ్చు అంటాడు. ఆశ మీరెందుకు ఇక్కడికి వచ్చారు మీరు ఎవరు ఈ పెళ్లి ఆపడానికి అంటుంది. అమృత ఓహో ఆశ మీరెవరు అన్న కాడికి వచ్చిందా? మేము ఎవరో తెలియదా నీకు అంటుంది. పద్మావతి అయినా ఏంటండీ మీరు పదే పదే మా లక్ష్మిని పట్టుకుని అంజలి అంటున్నారు మీకు ఎన్ని సార్లు చెప్పాలి అంటుంది. అరుణ్ కుమార్ పద్మావతి గారు మీరు ఏంటో అందరికీ తెలుసండి మీరు కాసేపు ఆగుతారా అంటాడు. కావేరి ఏంట్రా తమ్ముడు ఆగేది అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటుంది.అరుణ్ కుమార్ ఏంటక్కా ఇన్ని రోజులు అక్కవని చూశాను కానీ నువ్వు ఇంత అగాదానికి పాల్పడతావని అసలు అనుకోలేదు ఇప్పుడు ఇక అక్క బావ అని ఎవరిని చూడను ఆఫీసర్ గారు తను మా కూతురు అంజలి ఇతను నా అల్లుడు బంటి ఇతనికి మతిస్థిమితం సరిగా లేదు అంటాడు. ఆఫీసర్ తిక్కయ్య ఈ తిక్కయ్యకే తిక్క వదిలే సమాధానాలు చెబుతున్నారు కదా అసలు నువ్వు అంజలివా లక్ష్మీవా ఏదో ఒకటి తేల్చుకో నేను వెళ్లి టీ తాగి వస్తాను అంటాడు తిక్కయ్య.

Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights
Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights

కట్ చేస్తే అమృత అంజలి నువ్వు వస్తావా రావా అంటూ అంజలి చెయ్యి పట్టుకుని అమ్మవారి దగ్గరికి లాక్కు వెళుతుంది. అంజలి శరీరంలో ఉన్న లక్ష్మీ ఆత్మ ఇప్పుడు నేను అమ్మవారి దగ్గరికి వెళ్తే నేను కాళీ బూడిదై పోతాను అలా జరగకూడదు అంటూ అంజలి శరీరంలో నుంచి తప్పుకుంటుంది లక్ష్మీ ఆత్మ. అంజలి ఏదో తెలియని షాక్ లో నుంచి బయటికి వచ్చినట్లు అమ్మ నాన్న మీరేంటి ఇక్కడున్నారు అసలు మనమేంటి ఈ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎందుకు ఉన్నాము అని అడుగుతుంది. అమృత ఏంటి అంజలి ఇదంతా నీకు తెలియకుండానే చేస్తున్నావా నువ్వే కదా సాగర్ తో కలిసి సాగర్ భార్యగా సాక్షి సంతకాలు పెట్టడానికి ఆశ బంటిలో పెళ్లికి వచ్చావు అంటుంది అమృత. ఆ మాటకు అంజలి షాక్ అయి ఏం చెప్తున్నావమ్మా నేను ఆశ బంటిల పెళ్లి జరిపించడం ఏంటి బంటి నా భర్త అయినా నేనుండగా ఆ ఆశకు ఎలా పెళ్లి జరిపిస్తాను అనుకుంటున్నారు. అరుణ్ కుమార్ పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అంజలి నువ్వు ఇన్ని రోజులు నటించింది చాలు ఇకనైనా ఆ నటన నుంచి బయటికి రా వచ్చి నీ భర్తను కాపాడుకో లేదంటే బంటి ఆశ సొంతమై పోతాడు అంటాడు. అంజలి అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. అమృత నీకు అర్థమయ్యేలా నేను చెబుతాను ఈ అమ్మ వారి కుంకుమ పెట్టుకో అంటూ అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి అంజలి నుదుటి మీద పెడుతుంది అమృత. అమృత ఇప్పుడు చెప్పు అంజలి నువ్వు నిజంగానే నటిస్తున్నావా లేదంటే ఆ సాగర్ కి భార్యగా ఉండిపోవడానికి నటిస్తున్నావా చెప్పు అంటుంది. అంజలి అమ్మ ఏంటి అలా మాట్లాడుతున్నావ్ బంటి నా ప్రాణం బంటిని వదిలి నేను ఎలా బ్రతుకుతాను అనుకుంటున్నావు అసలు ఏం జరుగుతుంది అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights
Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights

అరుణ్ కుమార్ ఇంతసేపు జరిగింది అదే ఇప్పుడు నీ ఇష్టం అక్కడ జరిగిందంతా నీకు చెప్పావు నువ్వు సంతకాలు పెట్టి బంటిని ఆశకు అప్పచెప్పుతావా లేదంటే పెళ్లి చెడగొట్టి బంటిని నీ సొంతం చేసుకుంటావో అది నీ ఇష్టం అంజలి అంటూ అమృత అరుణ్ కుమార్ చెబుతారు. అంజలి అమ్మ ఆ పెళ్లి నేను ఆపుతాను పదండి అంటూ ఆఫీస్ లోపలికి వస్తారు. లక్ష్మి ఏ ఆశ ఏంటి ఇదంతా అని అడుగుతుంది.ఆశ షాక్ అయ్యి అదేంటి లక్ష్మి నువ్వే కదా సాక్షి సంతకాలు పెడతానని వచ్చావు అంటుంది. అంజలి ఏ ఆశ లక్ష్మీ అంటున్నావ్ ఏంటి నా పేరు అంజలి నేను అంజలిని లక్ష్మీని కాదు అంటుంది ఆ మాటలకు అందరూ షాక్ అయి సాగర్ అదేంటి లక్ష్మి ఇప్పటిదాకా నేను లక్ష్మిని నేను సంతకాలు చేస్తాను అన్నావు కదా మరి ఇప్పుడేంటి మళ్లీ అంజలి అని ప్రవర్తిస్తున్నావ్ అంటాడు. అంజలి నేను చెప్పానా అలా ఎప్పటికైనా నేను అంజలిని బంటి నా వాడు నా భర్త మాత్రమే ఇంకొక్క మాట ఎవరైనా మాట్లాడారు అనుకో అసలు ఊరుకోను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను బంటి మనం వెళ్దాం పద అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights
Kumkuma Puvvu Today Episode December 02 2023 Episode 2042 Highlights

బంటి అసలు నువ్వు అంజలివా లక్ష్మీవా అంటాడు. అంజలి అదేంటి బండి నేను నీ అంజలిని లక్ష్మిని కాదు అంటుంది. కావేరి ఏ ఇదిగో అంజలి నువ్వు ఇన్ని రోజులు ఆడిన నాటకం చాలు కాసేపు అంజలిగా కాసేపు లక్ష్మీగా నటిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా అంటుంది. చంద్రం అదేంటమ్మా నువ్వే కదా నేను లక్ష్మి నీ సంతకాలు పెడతాను అన్నావు మళ్లీ ఇప్పుడేంటి నేను అంజలిని ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని మాట్లాడుతున్నావ్ మాకు ఏమీ అర్థం కావడం లేదు నువ్వే లక్ష్మీ అంటున్నావ్ మళ్ళీ నువ్వే అంజలి అంటున్నావ్ ఇది ఎంత ఏంటి అంటాడు చంద్రం అంజలి ఇప్పుడు నేను చెబుతున్నాను కదా మామయ్య నేను అంజలిని లక్ష్మిని కాదు అంటుంది

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri