Paluke Bangaramayenaa november 11 2023 episode 71: కీర్తి బెండకాయలు కట్ చేయడం అయిపోయిందా అని ఝాన్సీ అంటుంది అయిపోయింది ఝాన్సీ అని కీర్తి అంటుంది. ఏంటి ఈ బెండకాయలను నువ్వు కట్ చేసావా అని వైజయంతి అడుగుతుంది. లేదులే ఆంటీ మీరే కట్ చేశారు కానీ ఝాన్సీ అడిగేసరికి నేను అలా చెప్పాను అంతే మా అమ్మకు నీ గురించి చెప్తాను ఆంటీ నాకు బెండకాయలు కట్ చేయడం నేర్పించావు అని కీర్తి అంటుంది. ఈ అమ్మాయి మొన్న కూడా టీ తీసుకు వెళ్తానంటే మెట్లు ఎక్కి రాగానే ఆంటీ నేను తీసుకెళ్తాను అంటూ కాఫీ తీసుకుంది ఈరోజు బెండకాయలు కూడా నేను కట్ చేస్తే నేనే కట్ చేశానని చెప్పుకుంది కొంచెం తేడాగా ఉంది అని వైజయంతి అనుకుంటుంది కట్ చేస్తే విశాల్ అభిషేక్ చంప దెబ్బ కొట్టాడని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కళ్యాణి వచ్చి ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.

అమ్మ ఇకమీదట నువ్వు చెప్పినట్టు నేను ఏమి వినను చంపేస్తా అమ్మ అని విశాల్ అంటాడు. ఏంటి నాన్న నువ్వు అంత ఆవేశపడితే ఎలా చెప్పు నీకు స్వరకి పెళ్లయ్యేదాకా నువ్వు అభిషేక్ కంట్లో పడకురా ఈపాటికి నీ మీద అభిషేకి డౌట్ వచ్చినట్టుంది చూసావుగా నిన్న ఎలా ఎంక్వయిరీ చేశాడు ఎక్కడ దొరికిపోతావు అని టెన్షన్ పడ్డాను అని కళ్యాణి అంటుంది. అమ్మ అన్నిట్లో నాకు అడ్డం వస్తున్నాడు కాబట్టి అభిషేక్ ని నేను చంపేస్తానమ్మ అని విశాల్ అంటాడు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది విశాల్ స్వరకి నీ గురించి తెలిసినట్టుంది అలాంటప్పుడు ఆ అమ్మాయి నిన్ను ఎలా చేసుకుంటుంది రా అందుకనే మనం వైజయంతిని ఒత్తిడి చేస్తే పెళ్లి చేస్తుంది నువ్వు ఆవేశ పడకుండా ఆలోచించు అని కళ్యాణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వైజయంతి నాయుడు దగ్గరికి వెళ్లి బావ అభి చాలా ఎక్కువ చేస్తున్నాడు అని వైజయంతి అంటుంది.

సుగుణని నువ్వే చంపావని అన్నాడా అని నాయుడు అంటాడు. నేనెందుకు చంపుతాను బావ కానీ ఎంక్వైరీ పేరుతో విశాల్ ని కొట్టాడు బావ అని వైజయంతి అంటుంది. ఏంటి విశాల్ ని కొట్టాడా అబి గురించి నాకు తెలుసు వైజయంతి అప్పుడప్పుడు నాకు కోపం వచ్చినా ఈమధ్య నాకు అభిషేక్ గురించి తెలుస్తుంది తొందరపడి మాట జారడు కోపం తెచ్చుకోడు. అలాంటి వాడు చెయ్ చేసుకున్నాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది వైజయంతి సరే నేను అబి తో తర్వాత మాట్లాడతాను అని నాయుడు అంటాడు. విశాల్ ని ఎందుకు కొట్టావు అని చెడామడా తిట్టేయ్ బావ అని వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బావకి అభిషేక్ మీద ప్రేమ పెరుగుతుంది ఈ హత్య చేయలేదని అబి నమ్ముతున్నాడని ఆయనకు తెలిసినట్టుంది అదే జరిగితే స్వర వచ్చి నేను అభిషేక్ ని ప్రేమిస్తున్నాను నాన్న అంటే ఒప్పుకునేలా ఉన్నాడు అలా జరగకూడదు దశదిశకర్మ అయిపోగానే స్వరకి విశాల్ కి పెళ్లి చేయాలి లేదంటే బావ అభిషేక్ ని అల్లుడి గా చేసుకునేలా ఉన్నాడు అని వైజయంతి అనుకుంటుంది.

ఇంతలో ఝాన్సీ వచ్చి మేడం విశాల్ అంత మంచివాడు కాదు అతనికి ఇంతకుముందే పెళ్లయింది అమ్మాయిని చంపేశాడు కేసుని టేకప్ చేసిన లాయర్ లని ఇద్దరిని కూడా చంపేశాడు నిన్న నైట్ వచ్చి నా మీద హత్య ప్రయత్నం చేశాడు మీరు తెలిసో తెలియకో విశాల్ తో పెళ్లికి ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు ఆ పెళ్లి జరగదు మేడం అని ఝాన్సీ అంటుంది. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరివి ఎంతట ఉండాలో అంతటనే ఉండు లేదంటే బాగోదు స్వర నీ దగ్గర పని చేస్తుందని ఊరుకుంటున్నాను అని వైజయంతి కోపంగా అంటుంది. మీరు పెళ్లిని ఆపిన ఆపకపోయినా న్యాయం గెలిచి ఆ విశాల్ కి శిక్ష పడుతుంది మేడం అప్పుడైనా పెళ్లి ఎలాగూ ఆగిపోతుంది కదా అని ఝాన్సీ అంటుంది. కట్ చేస్తే అభిషేక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కీర్తి వచ్చి అన్నయ్య స్వర మంచి అమ్మాయి విశాల్ చెడ్డవాడు అంట కదా ఎందుకు అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు ఆ వెళ్లి జరగకూడదు అన్నయ్య అని కీర్తి అంటుంది.

నీకు ఎవరు చెప్పారు కీర్తి నువ్వు చిన్న పిల్లవి ఇలాంటి విషయాలలో ఎందుకు జోక్యం చేసుకుంటావు అని అభిషేక్ అంటాడు. లేదు అన్నయ్య స్వర చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయికి అన్యాయం ఎలా జరుగుతుంది అని కీర్తి అంటుంది. వాళ్ళ అమ్మ దశదిశకర్మ అయ్యే లోపు ఆ విశాల్ కాడికి శిక్ష పడుతుంది లేమ్మా ఆ పెళ్లి ఆగిపోతుంది అని అభిషేక్ అంటాడు. అన్నయ్య స్వర ఎవరినైనా ప్రేమిస్తుందా అన్నయ్య అని కీర్తి అంటుంది. ఎందుకు అలా అడిగావు అని అభిషేక్ అంటాడు. వాళ్ళ నాన్న కోసం ఒప్పుకున్నద అంట కదా ఎలాగూ విశాల్ అంటే స్వరకి ఇష్టం లేదు కదా ఇంకెవరినైనా ఇష్టపడుతుందేమో అని అడిగాను అని కీర్తి అంటుంది. తనుకు ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న ప్రేమ దొరుకుతుందని పెళ్లికి ఒప్పుకుంది తను ఎవరిని ప్రేమించట్లేదు అయినా నువ్వే చెప్పావు కదా స్వర మంచిదని మంచి వాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది ఆ భగవంతుడు చెడు చేయడు అని అభిషేక్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది