NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: పదోవారం తారుమారైన లెక్కలు.. భోలె హౌస్ నుండి ఎలిమినేట్..??

Share

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ పదో వారం గేమ్ సాగుతోంది. ఈ వారం మొత్తం ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రావడంతో.. హౌస్ లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. సోమవారం నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి శుక్రవారం సాయంత్రం కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. అందుతున్న వార్తల ప్రకారం పదో వారం హౌస్ కి శివాజీ కెప్టెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే వీకెండ్ ఎపిసోడ్ దగ్గర పడటంతో శనివారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

in tenth week calculations are messed up Bhole Eliminated from the bigg boss House

పదో వారం నామినేషన్స్ లో శివాజీ, ప్రిన్స్ యావర్, గౌతమ్, భోలే, రతిక ఉన్నారు. ఐదుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది శుక్రవారం వరకు ఆడియన్స్ ఎవరు అంచనా వేయలేకపోయారు. ఐదుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో.. ఓటింగ్ చాలా హోరా హోరీగా సాగింది. శుక్రవారం వరకు రతిక ఎలిమినేట్ అవుతున్నట్లు బయట గట్టిగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా అందుతున్న లీక్ వార్తల ప్రకారం సీజన్ సెవెన్ ఎంటర్టైనర్ సింగర్ భోలే ఎలిమినేట్ అయినట్లు.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కొద్దిపాటి తేడాతో రతిక ఎలిమినేషన్ నుంచి తప్పించుకుందానీ సమాచారం.

in tenth week calculations are messed up Bhole Eliminated from the bigg boss House

దీంతో పదో వారం లెక్కలు మొత్తం తారుమారు కావడం జరిగిందనీ ఆడియన్స్ భావిస్తున్నారు. సింగర్ భోలే.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హౌస్ లో ఉన్న రోజులన్నీ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు. పరిస్థితులకు తగ్గ జంగా అప్పటికప్పుడు పాట క్రియేట్ చేసి.. పాడటం భోలే లోని డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వాలన్న నామినేషన్ టైములో సరైన రీజియన్ చెప్పకపోతే చెడుగుడు ఆడుకోవాలని భోలే తర్వాతే ఎవరైనా. అంతగా అద్భుతమైన గేమ్ ఆడటం జరిగింది. హౌస్ లో భోలే వచ్చాక ఎంటర్టైన్మెంట్ డబల్ అయింది. అయితే ఏ నెగెటివిటీ లేకుండానే భోలే ఎలిమినేట్ కావటం అతనికి ప్లస్ అని చెప్పవచ్చు.


Share

Related posts

Brahmamudi Serial మే 17th ఎపిసోడ్: కావ్య కి ఖరీదైన చీరని కొన్నివడానికి షాపింగ్ మాల్ కి తీసుకెళ్లిన రాజ్ 

bharani jella

Krishna Mukunda Murari: ముకుంద తన పగతో రేవతిని కూడా భయపెట్టిందా…

bharani jella

Jackson Wang: ముంబైకి వచ్చిన కే-పాప్ స్టార్.. జాక్సన్ వాంగ్‌తో ఫోటో దిగేందుకు ఎగబడ్డ బాలీవుడ్ సెలబ్రిటీలు. వాంగ్ ఎవరు? ఎందుకు ఇతనికంత క్రేజ్!

Raamanjaneya