Paluke Bangaramayenaa October 19 ఎపిసోడ్ 51: సరేలే ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి అని అభిషేక్ అంటాడు.కొత్తపేట కోర్టుకు వెళ్తున్నాను అని ఝాన్సీ అంటుంది. వేస్ట్ ఫెలో స్వర నాకు ఫోన్ చేసి హిందూ రాసిన లెటర్ గురించి చెప్పింది అని అభిషేక్ అంటాడు. అవునా వచ్చాక చూద్దాంలే అని ఝాన్సీ అంటుంది. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ అబి అని అంటుంది. ఝాన్సీ తో మాట్లాడుతున్న అమ్మ స్వరను చేసుకోబోయే వాడు మంచివాడు కాదు ఇంతకుముందు అతనికి పెళ్లయింది ఆ అమ్మాయిని చంపేశాడు అని అభిషేక్ అంటాడు. పాపం రా స్వరా ఎలాగైనా సరే కాపాడండి అని వాళ్ళ అమ్మ అంటుంది. అలాగే అమ్మ తనను ఏదో ఒకటి చేసి రక్షిస్తాము అని అభిషేక్. కట్ చేస్తే విశాల్ స్వరని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఏంటి స్వర ఎన్నిసార్లు మీ ఆఫీస్ కి వచ్చాను కనీసం లోపలికి రమ్మని కూడా ఒక్కసారి అనవేమిటి అని విశాల్ అంటాడు.

ఈ దుర్మార్గుడి కేసు ఝాన్సీ మేడం టేక్ అప్ చేసిందని తెలిస్తే తనని ఏమైనా చేస్తాడు అని తన మనసులో అనుకుంటుంది. ఏంటి స్వర ఏమీ మాట్లాడవు అని విశాల్ అంటాడు. ఇంతలో ఆఫీసులో ఉండే అబ్బాయి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం మేడం గారు కోర్టుకు వెళ్లారు రావడానికి లేట్ అవుతుంది ఇంత ఎర్లీగా వచ్చారేంటి అని అంటాడు. అవునా అని స్వర అంటుంది. ఏంటి మేడం ఆయనెవరు మీకు కాబోయే శ్రీవారా మీ పెళ్లికి ముందు గట్టిగా దావత్ ఇవ్వాలి సార్ అని వెళ్ళిపోతాడు. అంటే స్వర ఆఫీసులో నా గురించి డిస్కషన్ పెడుతుంది అంటే స్వర మనసులో ఎవరూ లేరు అన్నమాట నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని విశాల్ అనుకుంటాడు. రండి మా ఆఫీసు చూపెడతాను అన్ని స్వరా లోపలికి తీసుకువెళుతుంది.విశాల్ స్వరకాల పట్టుకుని నన్ను క్షమించు స్వర నిన్ను అపార్థం చేసుకున్నాను నువ్వు క్షమిస్తే కానీ నేను లేవను అని విశాల్ స్వర కాళ్ళ మీద పడతాడు. అయ్యో లేవండి ఝాన్సీ మేడం చూస్తే తిడుతుంది అని స్వర అంటుంది.

ఓ మీ మేడం పేరు ఝాన్సీ నా నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నా గురించి మీ అటెండర్ కు కూడా తెలిసింది అంటే నువ్వు నన్ను ఎంత ఇష్టపడుతున్నావో అర్థమైంది స్వరా అని విశాల్ అంటాడు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది చెడ్డ వాళ్లకి ఈరోజు కాకపోయినా రేపైనా శిక్ష పడుతుందని మా అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది అని స్వర అంటుంది. నేను వెళ్తున్నాను స్వర బయట పనుంది అని విశాల్ వెళ్ళిపోతాడు. హమ్మయ్య వీడికి ఝాన్సీ మేడం గురించి తెలియలేదు బతికిపోయాను అని స్వర తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే జయంతి విశాల్ వాళ్ళ ఇంటికి వస్తుంది. రా వదిన కూర్చో అని సోఫా ని తన కొంగుతో తుడుస్తుంది వాళ్ళమ్మ. పర్వాలేదు నేనంటే భయం ఉంది నేనెందుకు వచ్చాను నీకు చెప్తాను విను నాకు ఏదైనా కావాలి అంటే అడగను లాక్కుంటాను కానీ నేను ఆ పని చేయక్కర్లేదు ఎందుకంటే నేను అడగకపోయినా నువ్వు ఇచ్చేస్తావు కాబట్టి అని జయంతి అంటుంది.

ఏంటో వదినా అది అని విశాల్ వాళ్ళ అమ్మ అంటుంది.సిటీ అవుట్ కట్స్ లో స్థలం ఉంది కదా అది నా పేరు మీద రాయాలి అని జయంతి అంటుంది.అది నీకెలా తెలి పోయింది వదిన ఆయన అది నీ పేరు మీద రాయలేము ఎందుకంటే మా వాడికి కట్నం కింద వచ్చింది ఆ అమ్మాయి పేరు మీదే ఉంది అని విశాల్ వాళ్ళ అమ్మ అంటుంది. రిజిస్టర్ పేపర్ అయినా ఉంటాయి కదా తీసుకొచ్చి ఇవ్వు అని జయంతి అంటుంది.సరే అని విశాల్ వాళ్ళ అమ్మ పేపర్లు తెచ్చి ఇస్తే అవి చూసిన జయంతి ఏంటి జిరాక్స్ ఇచ్చావు ఒరిజినల్ ఏవి అని అంటుంది. ఆ చచ్చింది ఆ పేపర్లు ఎక్కడ పెట్టింది నాకు నిజంగా తెలియదు వదిన నా మీద ఒట్టు అని వాళ్ళ అమ్మ అంటుంది. సరే అవి ఎక్కడ ఉన్నాయో వెతికి పెట్టు అవి నాకు అవసరం అని జయంతి కోపంగా వెళ్ళిపోతుంది.కట్ చేస్తే విశాల్ స్వరని హోటల్ కి తీసుకు వస్తాడు. స్వర నువ్వేం తింటావో చెప్పు అని అంటాడు. నీకు ఏది ఇష్టమైతే అదే నేను తింటాను సార్ అని అంటుంది. నూడిల్స్ తినడం నీకు ఇష్టం ఉండదు కదా అని విశాల్ అంటాడు. ఇప్పుడు మీకోసం తింటాను సార్ ఆర్డర్ చెప్పండి అని స్వర అంటుంది.

విశాల్ వెయిటర్ ని పిలిచి రెండు ప్లేట్లు నూడిల్స్ తీసుకురండి అని చెప్తాడు. సరే సార్ అని వెయిటర్ వెళ్తాడు. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా స్వర ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేద్దామని ఆన్ చేసి బ్యాగ్ పక్కన పెడుతుంది. స్వర నువ్వు ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు మానే యి అని విశాల్ అంటాడు. ఎందుకు సార్ మీరే ఒకప్పుడు నన్ను ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు సార్ అని పదే పదే అడుగుతుంది స్వర. విశాల్ కి కోపం వచ్చి ఎందుకంటే నేను మర్డర్ చేశాను కాబట్టి నాకింతకు ముందే పెళ్లి అయింది ఆ అమ్మాయిని చంపేశాను అని అంటాననుకున్నావా స్వర అని నవ్వుతాడు. ఎందుకు సార్ జోక్ చేస్తున్నారు అని స్వర అంటుంది.

నిజంగానే స్వర నాకు ఇంతకుముందే పెళ్లయింది ఆ అమ్మాయి చనిపోయింది కానీ ఆ మర్డర్ నేనే చేశాను అని అనుమానపడే ఇందువాళ్ళ నాన్న నా మీద కేసు పెట్టాడు ఇంకా కేసు నడుస్తూనే ఉంది స్వర అని విశాల్ అంటాడు. ఇంతలో వెయిటర్ నూడిల్స్ తెచ్చి అక్కడ పెడతాడు.స్వర ఫోన్ తీసి వీడియో కట్ చేసి బ్యాగ్ లో పెడదామనుకునేసరికి విశాల్ చూసి స్వర స్మార్ట్ ఫోన్ ఎప్పటి నుంచి వాడుతున్నావ్ ఏది ఇలా ఇవ్వు చూస్తాను అని విశాల్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది