Malli Nindu Jabili October 19th ఎపిసోడ్ 472: ఉన్నట్టుండి జాబ్ మానేయమంటే ఎలా మాలిని అని అరవింద్ అంటాడు. ఓపిక పట్టి పట్టి అలసిపోయాను గౌతమ్ పర్మిషన్ ఇవ్వకపోతే జాబ్ మానేసి వచ్చేసేయ్ బ్యాగు సర్దేశాను నైట్ 12 గంటలకి ఫ్లైట్ ప్లీజ్ అరవింద్ తొందరగా వచ్చేయ్ నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని మాలిని ఫోన్ కట్ చేస్తుంది. గౌతమ్ కి చెప్పకుండా వెళ్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో అని అరవింద్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కట్ చేస్తే గౌతమ్ గుడిలో భిదే తీసుకొని అమ్మవారికి 108 బిందెల నీళ్లు పోస్తూ ఉంటాడు. ఏవండీ నీకు పిచ్చి గాని పట్టిందా ఎందుకిలావి చేస్తున్నారు అని మల్లి అంటుంది.

అరవింద్ ఎక్కువ నేను ఎక్కువ అని అడిగితే నువ్వు నేనే ఎక్కువ అని చెప్పావు కానీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని గౌతమ్ బిOదన్ను తీసుకుని వెళ్లి నీళ్లు తెచ్చి అమ్మవారు మీద పోస్తూ ఉంటాడు. ఏవండీ ఇంకా ఆపేయండి అని మల్లి అOటుది. ఇంక నువ్వు ఏం చెప్పినా నేను వినను వదిలేయ్ అని గౌతమ్ బిందె తీసుకొని వెళ్ళిపోతాడు.ఆగండి నీలో సగం నేను అంటారు కదా ఆ సగం నాకు అక్కర్లేదు ఇప్పుడు బిందెతో నీళ్లు మీరు సగం పోశారు కదా నాకు అవకాశం ఇవ్వండి నేను ఆ సగం పూర్తి చేస్తాను అని మల్లి బిందె లాక్కొని వెళ్లి నీళ్లు తెచ్చి అమ్మవారికి పోస్తూ ఉంటుంది. ఇది ఆఖరి బిందండి రండి ఇద్దరం కలిసి పోదాము అని వాళ్ళిద్దరూ కలిసి అమ్మవారి మీద ఆఖరి బింద పోస్తారు.

మల్లి నీ మనసులో నేను తప్ప ఇంకెవరూ ఉండకూడదు అని గౌతమ్ మల్లి నుదుటిన బొట్టు పెడతాడు. కట్ చేస్తే గౌత్ మల్లి ఆఫీస్ కి వస్తారు. ఏంటి ఇదంతా అని మల్లి అంటుంది. మన స్టాప్ అంతా నీ బర్త్ డే సెలబ్రేషన్ చేద్దామని అనుకున్నారు అని గౌతమ్ అంటాడు. మల్లి కేక్ కట్ చేస్తుంది అందరూ హ్యాపీ బర్త్డే అని అంటారు. పక్కన గౌతమ్ ఉండగానే అరవింద్ హ్యాపీ బర్త్డే మల్లి అని శేఖండ్ ఇస్తాడు. అరవింద్ మల్లి కి సెకండ్ ఇవ్వగానే గౌతమ్ ఒక లుక్కు ఇస్తాడు. స్టాఫ్ అంతా సార్ పార్టీ పార్టీ అని అంటారు. ఓకే నైట్ సెలబ్రేట్ చేసుకుందాం అని గౌతమ్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. అయ్యో ఆయన ఫీలయ్యాడేమో అని మల్లి తన మనసులో అనుకుంటుంది. ఇంతలో అరవింద్ వచ్చి సార్ మాలిని ట్రిప్ ప్లాన్ చేసింది నాకు పది రోజులు లీవ్ కావాలి అని అంటాడు. ఆఫీసులో నువ్వే ముఖ్యమైన కొలిక్కు అని నీకు తెలియదా అరవింద్ లీవ్ ఇవ్వడం కుదరదు అని గౌతమ్ అంటాడు.

సార్ మాలిని ఎంతో ప్రేమగా ట్రిప్ ప్లాన్ చేసింది ప్లీజ్ సార్ లీవ్ ఇవ్వండి అనే రిక్వెస్ట్ చేస్తూ అడుగుతాడు అరవింద్. పెళ్లయిన ఇన్నాళ్ళకి కూడా హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు అంటే మీ ఇద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ అర్థమైంది ఓకే నీకు లీవ్ ఇస్తున్నాను వెళ్ళు అని గౌతమ్ అంటాడు. థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ సార్ అరవింద్ అంటాడు. అది సరే మనం వేరే ఛానల్ లో అగ్రిమెంట్ కాబోతునo వాళ్లకు నీ డీటెయిల్స్ ఇచ్చావా అని గౌతమ్ అడుగుతాడు. ఇవ్వలేదు సార్ మేనేజర్ చెప్పాడు అని అరవింద్ అంటూ ఉండగా మేనేజర్ వచ్చి సార్ వాళ్లకి మన ఆఫీస్ స్టాఫ్ పేర్లు కావాలంట అని అంటాడు. అరవింద్ తన డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాడు. సార్ మీ పాస్ ఫోటో సైజ్ ఫోటో కావాలి అని మేనేజర్ అంటాడు. అలాగే అనే అరవింద్ ఫోటో తీస్తూ ఉండగా మల్లి ఫోటో కింద పడిపోతుంది.

అరవింద్ ఇంకో ఫోటో కింద పడింది అని గౌతమ్ ఫోటో తీసి చూస్తాడు అది చూసిన గౌతమ్ ఒకరి భార్య ఫోటో ఇంకొకరి పర్సులో ఉండడం దారుణం కదా అరవింద్ మల్లి ఫోటో నీ పర్సులో ఎందుకు ఉంది అని గౌతమ్ బెదిరిస్తాడు.సార్ తను చదువుకునే టైంలో ఎగ్జామ్ దగ్గర ఏదైనా ఫోటో అవసరం వస్తుందని నా పర్సులో పెట్టుకున్నాను అని అరవింద్ తప్పించుకుంటాడు. ఓ అవునా అయితే ఓకే ఇప్పుడు ఇది నీ దగ్గర ఉండడం కంటే నా దగ్గర ఉండడమే కరెక్ట్ అనే ఫోటో తీసుకొని తన దగ్గర పెట్టుకుంటాడు గౌతమ్.ఓకే సార్ అని అరవింద్ వెళ్లిపోతాడు. అరవింద్ వెళ్ళిపోగానే చేయి టేబుల్ కేసు కొడుతూ కోపంగా మల్లి తో ప్రేమగా ఉంటూ అరవింద్ ని టార్గెట్ చేయలేకపోతున్నాను ఇకమీదట అరవింద్ మీద ఫోకస్ చేయాలి ఇలా ఊరికే వదిలేయకూడదు అని గౌతమ్ అనుకుంటాడు.గౌతమ్ దగ్గర నుంచి వచ్చిన అరవింద్ మల్లి తో మాట్లాడాలని ఫోన్ చేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది