NewsOrbit
Entertainment News రివ్యూలు సినిమా

Bhagavanth Kesari Review: ఎమోషన్ యాక్షన్ డ్రామాగా బాలకృష్ణ “భగవంత్ కేసరి”… శ్రీ లీల టాప్ పెర్ఫార్మెన్స్..!!

Share

Bhagavanth Kesari Review: నటసింహం నందమూరి బాలయ్య బాబు యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించిన “భగవంత్ కేసరి” నేడు విడుదల కావడం జరిగింది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్, ఆర్ శరత్ కుమార్, రఘుబాబు, జాన్ విజయ్, వీటీవీ గణేష్ తదితరులు
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సినిమాటోగ్రఫి: సీ రాంప్రసాద్
ఎడిటింగ్: తమ్మిరాజు
మ్యూజిక్: థమన్ ఎస్
బ్యానర్: షైన్ స్క్రీన్
నిడివి: 164 నిమిషాలు
రిలీజ్ డేట్: 19-10-2023

Balakrishna Bhagavanth Kesari as an emotion action drama SreeLeela top performance

పరిచయం:

నటసింహం నందమూరి బాలయ్య బాబు.. వరుస పెట్టి విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నారు. 2021లో అఖండ సినిమాతో విజయం సాధించిన బాలయ్య ఒక ఏడాది గ్యాప్ తీసుకుని ఈ ఏడాది ప్రారంభంలో వీర సింహారెడ్డి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది. అనంతరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. అనిల్ రావిపూడి పూర్తి వినోదాత్మక కంటెంట్ తో కూడిన యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేసే డైరెక్టర్. ఇక బాలయ్య బాబు ఆల్ రౌండర్. అటువంటిది వీరి కాంబినేషన్ లో వచ్చిన “భగవంత్ కేసరి” అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది. దసరా పండుగ నేపథ్యంలో గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

స్టోరీ:

అడవి జాతికి చెందిన నేలకొండ భగవంత్ కేసరి (బాలకృష్ణ). ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నప్పుడు జైలర్ (శరత్ కుమార్) కూతురు విజయలక్ష్మి అలియాస్ విజ్జి (శ్రీ లీల) తో అనుబంధం ఏర్పడుతుంది. అయితే అనుకోని కారణాలవల్ల విజయలక్ష్మి తండ్రి చనిపోతాడు. దీంతో బాలకృష్ణ వెంటనే విజయలక్ష్మిని చేరదీస్తాడు. సొంత కూతురు కాకపోయినా అంతకుమించి అన్న రీతిలో విజయలక్ష్మి పట్ల బాలకృష్ణ ప్రేమానురాగాలు చూపుతాడు. అంతేకాకుండా విజయలక్ష్మిని ఎలాగైనా ఆర్మీలో జాయిన్ అయ్యేలా ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దడానికి తాపత్రయపడతాడు. విజయలక్ష్మి నిజమైన తండ్రి కల కూడా అదే. దీంతో విజయలక్ష్మి కి సింహం లాగా తయారు చేయాలని భగవంత్ కేసరి రకరకాల ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సైకాలజిస్ట్ కాత్యాయని (కాజల్) కూడా సహాయం చేయడానికి రెడీ అవుద్ది. ఇటువంటి జీవితం కలిగిన ఈ ముగ్గురి లైఫ్ లోకి ప్రపంచంలో నెంబర్ వన్ మాఫియా లీడర్ కావాలనుకుంటున్నా రాహుల్ సాంగ్వి(అర్జున్ రాంపాల్) ఎలా వచ్చాడు అతడు విజయలక్ష్మి ప్రాణాలను తీయాలని చూస్తాడు. ఈ క్రమంలో ఆ ప్రపంచ డ్రగ్ మాఫియా రౌడీతో భగవంత్ కేసరి ఎలా తలపడ్డాడు. ఆ తర్వాత భగవంత్ కేసరి ఎందుకు జైలుకు వెళ్లాడు..? రాహుల్ సాంగ్వి ఎందుకు విజయలక్ష్మిని చంపాలనుకుంటున్నాడు అనేది సినిమా థియేటర్ లో చూడాల్సిందే.

Balakrishna Bhagavanth Kesari as an emotion action drama SreeLeela top performance

విశ్లేషణ:

ఒక మంచి మాస్ ఇమేజ్ కలిగిన బాలకృష్ణని చాలా అద్భుతంగా “భగవంత్ కేసరి”లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చూపించాడు. చాలా కొత్తగా బాలకృష్ణ ప్రజెంట్ చేయడం జరిగింది. సినిమా మొత్తానికి బాలయ్య మేకోవర్… యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటన హైలెట్ అని చెప్పవచ్చు. వీరిద్దరి పాత్రలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయి. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో బాలకృష్ణ అదరగొట్టేశారు. ముఖ్యంగా తెలంగాణ యాస భాషలో బాలయ్య పలికిన డైలాగులు.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంకా ఎమోషన్స్ సన్నివేశాలలో.. బాలయ్య నటన  విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా శ్రీ లీల మరియు బాలకృష్ణ మధ్య వచ్చే ఎమోషన్ సన్నివేశాలు… ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. తండ్రి కూతుర్లు కాకపోయినా దానికి మించిన బాండింగ్ వాళ్ళ మధ్య ఉన్నట్లు కథని బలంగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచేలా డైరెక్టర్ పన్నీ తనానికి హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. విలన్ పాత్రలో హిందీ నటుడు అర్జున్ రాంపాల్.. చాలా స్టైలిష్ గా కనిపించారు. హీరోయిన్ కాజల్ పాత్ర పరిధి మేరకు చాలా డీసెంట్ లుక్స్ తో పాటు నటనతో ఆకట్టుకుంది. సినిమాలో శ్రీ లీల మరియు బాలకృష్ణ తో వచ్చే క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెంటిమెంట్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేలా కథని అద్భుతంగా దర్శకుడు నడిపించారు. చిచ్చా మరియు బిడ్డ అంటూ బాలయ్య శ్రీలీల.. చెలరేగిపోయారు. ఫస్ట్ ఆఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో నడిపించగా సెకండాఫ్ లో సెంటిమెంట్ సన్నివేశాలతో ఆడియన్స్ ని కట్టి పారేశారు. ముఖ్యంగా ఆడవాళ్లపై సమాజంలో జరిగే దాడులను ఉద్దేశించి చాలా భావోద్వేగాకరమైన బలమైన సందేశాన్ని.. “భగవంత్ కేసరి” ద్వారా అందించడం జరిగింది.

Balakrishna Bhagavanth Kesari as an emotion action drama SreeLeela top performance

ప్లస్ పాయింట్స్:

బాలకృష్ణ, శ్రీ లీల నటన
స్టోరీ, ఎమోషనల్ సన్నివేశాలు
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్ లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు
హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.

ఓవరాల్ గా: భగవంత్ కేసరి.. బాలయ్య.. శ్రీ లీల నటన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

Share

Related posts

Ennenno Janmala Bandam: అభికి జైలు శిక్ష.. వేద ప్లాన్ వర్కౌట్.. రేపటికి ట్విస్ట్ ఇదే..

siddhu

టీజ‌ర్ డేట్ ఫిక్స్‌

Siva Prasad

`ఎన్‌బీకే 107`కు రిలీజ్ డేట్ లాక్‌.. బాల‌య్య వ‌చ్చేది ద‌స‌రాకు కాదు?!

kavya N