Prema Entha Madhuram October 19th Episode 1077: ఆర్య వర్ధన్ సూర్య ని పోస్టుమార్టం చేయించడానికి హాస్పిటల్ కి తీసుకు వస్తాడు. అవును ఆంటీ కి ఫోన్ చేస్తాను అన్నాను కదా అని అను ఫోన్ తెచ్చి సుగుణ కి ఫోన్ చేస్తుంది. అమ్మ అను గారు ఫోన్ చేస్తున్నారు మాట్లాడు అని ఉష అంటుంది. హలో ఆంటీ భోజనం చేశారా టాబ్లెట్ వేసుకున్నారా అని అను అంటుంది. లేదమ్మా నా కొడుకు కోసం ఎదురు చూస్తున్నాను అని సుగుణ అంటుంది. అదేంటి ఆంటీ ఇంతవరకు అన్నం తినకుండా టాబ్లెట్ వేసుకోకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది మీరు ముందు భోజనం చేసి టాబ్లెట్ వేసుకోండి మీ కొడుకు తిరిగి వస్తాడులే నేను పొద్దున్నే పిల్లలు స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని అను అంటుంది. అను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే అది నీ వల్లే నా కొడుకుని చూసుకోవడానికి బ్రతికానేమో నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మ అని సుగుణ అంటుంది.

ఆంటీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీ కొడుకు వస్తాడులే అని అను ఫోన్ కట్ చేస్తుంది. అమ్మ ఊష అన్నయ్య ఇంకా రాలేదు వాడికి ఒకసారి ఫోన్ చెయ్ అని సుగుణ అంటుంది. ఉష ఎన్ని సార్లు ఫోన్ చేసినా సురేష్ ఏతడు. ఆర్య సూర్యకి ఇంటి దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫోన్లు వస్తున్నాయి వాళ్లకి సూర్య లేడని చెప్పనా అని జెండి అంటాడు. వాళ్లతో మాట్లాడే అంత ధైర్యం మనకు లేదు జెండి పాపం కొడుకు తిరిగి వస్తాడని ఎదురుచూస్తున్న ఆవిడకి నిజం చెప్తే వాళ్ళు ఏమైపోతారో అని ఆర్య అంటాడు. అలా వాళ్ళు ఏమైపోతారో అని భయపడి నిజం చెప్పకుండా ఉండలేం కదా ఆర్య అని ఫోన్ చేసి ఆర్య కి ఇస్తాడు జెండి.

వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి సూర్య ఎలా ఉన్నావ్ నాన్న ఎప్పుడు వస్తున్నావ్ ఇన్నాళ్లు నీ కోసమే రా నేను బ్రతికి ఉన్నాను నువ్వు ఎప్పుడు వస్తావు నిన్ను ఎప్పుడు చూస్తానని ఎదురు చూస్తున్నాను 20 సంవత్సరాలయింది నాన్న నీ మాట విని నీకోసం ఎన్ని మొక్కలు మొక్కను ఎన్ని పూజలు చేశాను ఇవ్వాల ని కోసమే గుడికి వెళ్లి వస్తుంటే యాక్సిడెంట్ అయింది నాన్న కానీ ఒక అమ్మాయి నన్ను కాపాడి హాస్పిటల్ తీసుకెళ్ళింది నా ప్రాణాలను అమ్మాయి కాపాడింది ఈరోజు నిన్ను చూడడం కోసమే ఆ అమ్మాయి నన్ను కాపాడినట్టుంది నాన్న నువ్వు ఎప్పుడు వస్తావు రా నీ కోసం పాయసం వోడాను త్వరగా ఇంటికి రా నాన్న నేను ఇన్ని మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడవేంటి సూర్య అని సుగుణ అంటుంది.

అమ్మ సూర్య అని ఆర్య వర్ధన్ మాట పూర్తిచేసేలోపే. సుగుణ అమ్మ అని ఎన్నాళ్లకు పిలిచావు నాన్న ఈమాట కోసమే రా నేను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను ఈ అమ్మకి డబ్బు లేని అక్కర్లేదు నాన్న నువ్వు ఉంటే చాలు నువ్వు ఇంటికి వచ్చి మీ చెల్లెల బాధ్యత తీసుకొని వాళ్ళని చదివించి వాళ్ళ పెళ్లి చేస్తే చాలు నిన్ను చూస్తూ బతికేస్తాను నువ్వు ఇక తిరిగి రావని మన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎగతాళి చేసి మాట్లాడి బాధ పెట్టారు నువ్వు తిరిగి వచ్చాక వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు అవుతుంది నాన్న నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయ్ అని సుగుణ అంటుంది. ఆవిడ బాధని ఆవిడ మాటలు విన్న ఆర్య ఏమీ మాట్లాడక సరే అమ్మ ఇంటికి వస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు.అమ్మ ఉషా అన్నయ్య వస్తున్నాడు అంట అమ్మ అని సుగుణ ఎంతో సంతోష పడిపోతుంది. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది.

మనం కేర్ తీసుకోవాలి కమిషనర్ నెంబర్ తీసుకో ఆ జలంధర్ మీద కంప్లీట్ చేద్దాం అని నీరజ్ అంటాడు. నువ్వు జలంధర్ మీద కేసు పెట్టాలని ఆలోచిస్తున్నావు కానీ ఆర్య మాత్రం సూర్య కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలని ఆలోచిస్తున్నాడు అని జండి అంటాడు. ఇంతలో ఆర్య సురేష్ వేసుకున్న బట్టలు చెప్పులు దండా వేసుకొని సురేష్ లాగా మారిపోయి కిందికి వస్తాడు. ఇదేంటి దాదా నువ్వు నీ బట్టలు వేసుకున్నావు అని నీరజ్ అంటాడు. ఆర్య ఆలోచించే ఈ పని చేస్తున్నావా అని జెండి అంటాడు. నేను సూర్య లేడని వాళ్ళ అమ్మకి చెబుదామని ఫోన్ చేశాను కానీ వాళ్ళ అమ్మ నేనే సూర్య నాని మాట్లాడింది ఆవిడ మాటలు విన్నాక నాకు ఒక విషయం అర్థమైంది వాళ్లకు కావాల్సింది ఆర్థిక సహాయం కాదు నేను నీకు తోడుగా ఉన్నాను అనే ఒక ధైర్యం కావాలి ఆ కుటుంబాన్ని చూసుకోవడానికి బాధ్యతగా ఒక కొడుకు కావాలి వాళ్ల అమ్మ 20 సంవత్సరాలుగా సూర్య కోసం ఎదురుచూస్తుంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆవిడకి కొడుకు లేడని ఇక రాడని చనిపోయాడని ఎలా చెప్పను అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆర్య అంటాడు.

ఆర్య వాళ్లను ఆదుకోవాలంటే వాళ్ళ చెల్లెలికి జాబ్ ఇచ్చి వాళ్ల చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది కానీ నువ్వు సూర్య గా అక్కడికి వెళ్లడం ఎందుకు అని అంజలి అంటుంది. అవును దాదా అంజలి చెప్పింది కరెక్టే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి వాళ్లకి జీవితాంతం సరిపోయేంత డబ్బును ఇస్తే సరిపోతుంది కదా అని నీరజ్ అంటాడు. వాళ్లకు డబ్బు ఇస్తేనో జావిస్తేనో తీరిపోయే సమస్య కాదు వాళ్ల కుటుంబానికి కావలసిన ఒక తోడు ధైర్యం అయినా వాళ్లకు ప్రాణాలు కోల్పోయాడు మనం ఏమిచ్చినా ప్రాణం తిరిగి రాదు కదా అయినా ఆవిడ మాటలను బట్టి నాకు అర్థం అయింది

వాళ్ళు డబ్బులు కు ఆశపడే వాళ్ళు కాదు అభిమాన దనులు వాళ్ల కొడుకు వస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు చూడు నీరాజ్ ఈరోజు నుంచి ఆఫీసులో అన్ని పనులు నువ్వే జెండి చూసుకోవాలి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే నేను అటెండ్ అవుతాను ఇక రాజ్ అండి మనం వెళ్దాం అని ఆర్య వర్ధన్ వెళ్ళిపోతాడు. దాదా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఏమో నాకేమీ అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం అనే నీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే తను ఏం చేయాలనుకుంటున్నాడు అదే చేయని ఇప్పుడు మనం ఏమి చేయలేము కదా అని అంజలి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది