NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rain Alert: ఏపీకి వాతావరణ హెచ్చరిక .. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Share

Rain Alert: అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న అగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 20 నాటికి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది ఐఎండీ.

Rain alert

ఈ ప్రభావం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. ఏపీలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పు ప్రాంతాల్లో తేలిక పాటి  నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అలానే ఈ నెల 23 నుండి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని మరి కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా, ఆపై వాయిగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడితే ఈ నెల 25వ తేదీ నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు తుఫాను గండం పొంచి ఉండవచ్చని అంచనా వేస్తొంది ఐఎండీ. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఇవేళ (గురువారం) తేలికపాటి వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

RK Roja: ఆ సామాజిక వర్గానికి ఆగ్రహం తెప్పించిన మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు .. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు


Share

Related posts

ఇక జగన్ గాలానికి దొరికే టిడిపి చేపలు లేనట్లే ! సేఫ్ జోన్ లో చంద్రబాబు!

Yandamuri

30నుండి ఎపి అసెంబ్లీ సమావేశాలు

somaraju sharma

నాలుగువైపులా నలుగురు.. మద్యలో రాజమౌళి.. ఇలా టార్గెట్ చేస్తున్నారేంటి ..?

GRK