Trinayani October 19th Episode 1062: బంగారు భవిష్యత్తు ఉన్ననా కోడలు బ్రతికి ఉండాలంటే ఇందాక సుమన చెప్పినట్టు నేనే ప్రాణ త్యాగం చేస్తాను అని తిలోత్తమ అంటుంది. అమ్మ ఏమంటున్నావ్ ఆలోచించు అని వల్లభ అOటాడు. అవున్రా వల్లభ మహా అయితే ఇంకో పదేళ్లు బ్రతుకుతాను కానీ ముప్పావు వంతు ఉన్న నా కోడలు బాగుంటే అంతే చాలు నైనికి ఏమైనా అయితే గానవి గాయత్రి అనాధలవుతారు హాసినికి ఏమన్నా అయితే వల్లభ పుండరీ నాదుని చూసుకోలేడు ఇక సుమన అంటావా ఊళ్లోచి చిన్న పిల్ల వీళ్ళ ముగ్గురికి ఏమీ కాకూడదు అంటే నేను ప్రాణత్యాగం చేయాలి అని తిలోత్తమ అంటుంది. మొదట వెనకడుగు వేసిన ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు తిలోత్తమ నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను అని స్వామీజీ అంటాడు.

స్వామి కన్నతల్లిని చిన్న అప్పుడే పోగొట్టుకున్నాను పెంచిన తల్లిని కూడా దూరం చేసుకోలేను అని విశాల్ అంటాడు. అంటే అమ్మలెవ్వరూ ప్రాణత్యాగం చేయకుండా పిల్లల్ని కాపాడుకునే అవకాశం ఉంటే బాగుండు అని బాబు గారు ఆలోచిస్తున్నారు అని నైని అంటుంది. అక్క పిల్లలకు అంటే నువ్వు కన్నా గాయత్రీ కూడా ప్రాణహాని కలుగుతుంది కదా అని సుమన అంటుంది. మీరు ఎవరు ప్రాణత్యాగం చేయక పోతే నలుగురు పిల్లలో ఎవరిదో ఒక ప్రాణం పోతుంది అని స్వామీజీ అంటాడు. నన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక పాప ప్రాణం త్యాగం చేయండి అని తిలోత్తమ అంటుంది. అమ్మ నువ్వు ఈ మాట అంటే ఇందాక ప్రాణం త్యాగం చేస్తానని అన్నప్పుడు ఉన్న గౌరవం అంతా పోయి అసహ్యం వేస్తుంది అని విక్రాంత్ అంటాడు.

అందుకే ఆలోచించమంటున్నాను రా అని తిలోత్తమ అంటుంది. అరే అంత లోతుగా ఆలోచించాల్సిన పనేముంది దత్తత తీసుకున్న గాయత్రి పాప ప్రాణత్యాగం చేస్తే సరిపోతుంది కదా అని సుమన అంటుంది. ఆ మాట వినగానే విశాల్ కళ్ళు నిప్పులు కురిపిస్తాయి.నీకు బుర్రు ఉండే మాట్లాడుతున్నావా సుమీ అని దూరందర అంటుంది. నీకు బుద్ధుందా అని విక్రాంత్ అంటాడు. ఆలోచించని అన్నాను దానికి ఎందుకు అంతలా ఆవేశ పడిపోతారు అని సుమన అంటుంది. నువ్వేమంటావ్ విశాల అని స్వామీజీ అంటాడు. ఆ విశాలాక్షి మీదే భారం వేస్తాము అని విశాల్ అంటాడు.. సరే మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అని స్వామీజీ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మమ్మీ ఏం చేస్తున్నావ్ అని వల్లభా అంటాడు.

ఏమీ లేదురా ఈ దుప్పటి మీద పౌడర్ చల్లి గాయత్రీ మీద కప్పితే తను మత్తులోకి పోతుంది అని తిలోత్తమ అంటుంది. దానివల్ల మనకేమి లాభం అమ్మ అని వల్లభా అంటాడు. ఒకటి అఖండ స్వామి చెప్పినట్టు గాయత్రీ నే గాయత్రి పాపా అయితే శాశ్వతంగా నిద్రపోతుంది అదే నిజంగానే పూజారి మనవరాలైతే తమ్ముడి కోసం తన చెల్లెల కోసం ప్రాణత్యాగం చేసిందని అందరూ బాధపడతారు రెండు విధాలుగా మనకు మంచే జరుగుతుంది రా అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే విక్రత్ కోపంగా లోపలికి వచ్చి ఆవేశంతో డోర్ వేస్తాడు.ఎందుకు అంత గట్టిగా డోరు దగ్గరికి వేస్తున్నారు అని సుమన అంటుంది. నీ నోరు మూయించలేను కదా అందుకే డోర్ దగ్గరికి వేస్తున్నాను అయినా గాయత్రి పాప మీద నీకెందుకే అంత కక్ష అని విక్రాంత్ అంటాడు. మీ అమ్మను కాపాడుకోవాలంటే అనాధ పిల్లని ప్రాణత్యాగం చేయాల్సిందే అని సుమన అంటుంది.

ఆ మాట వినగానే విక్రాంత్ కి ఎక్కడలేని కోపం వచ్చి సుమన చెంప మీద గట్టిగా ఒకటి ఇస్తాడు. నేను అన్న దాంట్లో తప్పేముంది నన్ను కొడుతున్నావు అని సుమన అంటుంది. మా అమ్మ పోతే భూమికి భారం తగ్గుతుంది అని అనుకుంటూ విక్రాంత్ వెళ్లిపోతాడు. ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా అని సుమన అనుకుంటుంది కట్ చేస్తే అమ్మ అందరూ నిన్ను అనాధ పిల్ల పోతే పోనీలే అని అంటుంటే కొడుకుగా ఉండి కూడా ఏమి మాట్లాడకుండా దైవం ఎలా చేస్తే అలా జరుగుతుందని సామాన్యుడిలా నిలబడిపోయాను నన్ను క్షమించమ్మా అని విశాల్ అంటాడు. ఇంతలో నైని వచ్చి ఏంటి బాబు గారు గాయత్రి తో ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. మనసులో మాట అమ్మకి తెలుస్తుంది కదా అని విశాల్ అంటాడు. అమ్మ అని నైని ఆశ్చర్యంగా ఉంటుంది. అదే నైని అమ్మ దొరికే దాకా గాయత్రీ ని అమ్మ అంటున్నాను అని విశాల్ అంటాడు. బాబు గారు అందరూ అనాధ పిల్ల అని అంటూ ఉంటే వినడానికి బాదేస్తుంది అని నైని అంటుంది.

వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా గాయత్రి పాప వెళ్లి తిలోత్తమా మత్తుమందు జల్లిన దుప్పటి తీసుకువెళ్లి హాల్లో కూర్చున్న తిలోత్తమ మీద పడేలా వేస్తుంది. ఆ దుప్పటి తీసుకునే లోపు తిలోతమ స్పృహ కోల్పోతుంది. హాసిని నడుచుకుంటూ వెళ్తూ ఎవరి సోఫాలో ముసుగేసుకుని పడుకున్నారు అని చూస్తుంది అందులో త్రిలోత్తమ కనబడగానే అమ్మో నా మీదే డౌట్ పడతారు అని తనని సోఫా లోంచి తీసి కింద పడుకోబెట్టి బెడ్ షీట్ కప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో గాయత్రి మెట్లు దిగుతూ ఉండగా దురంధర చూసి నైని పాప పడిపోతుంది ఏం చేస్తున్నావ్ అని అంటుంది. నైని పరిగెత్తుకొచ్చి గాయత్రిని ఎత్తుకుంటుంది. గాయత్రికి కాళ్లు వచ్చిన దగ్గర నుండి ఒక దగ్గర ఉండట్లేదు పిన్ని గారు ఏం చేయాలి అని నైని అంటుంది. అందరూ పరిగెత్తుకొచ్చి ఏమైంది అని అంటారు. మా ఆయన ఒక్కడే వచ్చాడు ఏంటి అని హాసిని అంటుంది.

ఇంకొకరిని తోడుగా తెచ్చుకోమంటావా అని వల్లభ అంటాడు. నీకు తోడుగా మీ అమ్మ ఎప్పుడు ఉంటుంది కదా అని హాసిని అంటుంది. అవును అన్నయ్య అమ్మెక్కడ అని విక్రాoత్ అంటాడు. ఇక్కడే కింద గార్డెన్లో ఉంటుంది రా ఎవరితోటో ఫోన్ మాట్లాడుతుంది అని వల్లభా అంటాడు. ఇంతలో స్వామీజీ వచ్చి తిలోత్తమ ప్రాణాలతో పోరాడుతుంది అని అంటాడు. స్వామీజీ ఏమంటున్నారు మీరు మా అమ్మకి ఏమైంది అని విశాల్ అంటాడు. నువ్వేం కంగారు పడకు అన్నయ్య అమ్మాయికి ఫోన్ చేస్తే ఎక్కడుందో తెలుస్తుంది కదా అని విక్రాoత్ అంటాడు. అవును కదా ఫోన్ చేయండి అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది