Paluke Bangaramayenaa October 28 Episode 59: అమ్మ కోసం ఎంతలా బాధపడుతున్నాడు నిన్నటి నుంచి నాన్న ఏమి తిన కుండ అలానే ఉన్నాడు నీరసమై పోతున్నాడు అమ్మ మీద ఇంత ప్రేమ ఉంచుకొని తనని ఎందుకు దూరం పెట్టాడు నిజంగానే అమ్మను నాన్న చంపలేదనుకుంటా చంపి ఉంటే అమ్మ కోసం ఇంతలా ఎందుకు బాధపడతాడు అని స్వర అనుకుంటుంది. సుగుణ నాకేమీ అర్థం కాలేదు సుగుణ నిన్ను ఎవరు చంపారో తెలుసుకుని వాళ్లను చంపేస్తాను సుగుణ నిన్ను ఎప్పుడూ తిడుతూ ఉండేవాడిని అని నాయుడు సుగుణని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో స్వర వచ్చి నాన్న ఎందుకు అలా ఏడుస్తున్నారు ఊరుకోండి నాన్న నిన్నటి నుంచి మీరు ఏమీ తినకుండా అలాగే ఉన్నారు కనీసం జ్యూస్ అయినా తాగండి నాన్న అని స్వర అంటుంది.

వద్దమ్మా నిన్ను మీ అమ్మని ఎంతగానో బాధ పెట్టాను నిన్ను నష్టజాతకురాలిని ఎన్నిసార్లు తిట్టాను కానీ స్వర మీ అమ్మను నేనే మానసికంగా మాటలతో హింసించి చంపానమ్మ నీకు మీ అమ్మని దూరం చేశాను అయినా సరే నువ్వు నన్ను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావు మీ అమ్మని చంపలేదని పోలీసులతో అంటున్నావు నీలాంటి దాన్ని కన్నానే అని ఎప్పుడు తిట్టాను కానీ ఇప్పుడు నువ్వే నన్ను వెనకేసుకొస్తున్నావు ఈ నాన్న అంటే నీకు ఎందుకమ్మా అంత ప్రేమ నీలాంటి కూతురు ఉండడం నా అదృష్టం నీ రుణం తీర్చుకోలేనమ్మ నన్ను క్షమించమ్మా అని నాయుడు ఏడుస్తాడు. నాన్న మీరు నన్ను క్షమాపణ అడగకండి మీరు నా కన్న తండ్రి నాన్న నాకు జన్మనిచ్చారు నా రుణం మీరు తీర్చుకోవడం కాదు నాన్న నేనే మీ రుణం తీర్చుకోలేను ఊరుకోండి నాన్న ఏడవకండి అని స్వర అంటుంది.

లేదమ్మా స్వర మీ అమ్మని చంపినది ఎవరు అయినా సరే వాడిని పట్టుకొని పోలీసులకు అప్పజెప్పాలి వాడికి శిక్ష పడేలా చేయాలి అని నాయుడు అంటాడు. కట్ చేస్తే అభిషేక్ ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్లి కాంత అబాయ్ ఏది ఝాన్సీ అని అంటాడు. ఇక్కడే ఉన్నాను సార్ మీరు అప్పజెప్పాక నేను ఎక్కడికి వెళ్తాను అని కాంత అంటుంది. రోజంతా నన్ను సినిమా స్టోరీ లతో చంపేస్తుంది సార్ అని ఝాన్సీ అంటుంది. బాబు గారు మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తెస్తాను అని కాంతబాయ్ అంటుంది. వద్దు కాంతా బాయ్ ఇప్పుడు నేను ఝాన్సీ ని చూసి వెళదామని వచ్చాను అక్కర్లేదు అని అభిషేక్ అంటాడు. సార్ పొయ్యి మీద మంట వెలిగించానా లేదా అన్నంత సేపట్లో కాఫీ తెస్తాను సార్ మీరు కూర్చోండి మాట్లాడుతూ ఉన్నప్పుడే తాగి వెళ్ళండి సార్ లేట్ ఏమి అవ్వదు అని కాంత బాయ్ అంటుంది. స్వర వాళ్ళ నాన్నని ఎంక్వైరీ చేశారా అబి ఎంతవరకు వచ్చింది అని ఝాన్సీ అంటుంది.

నాయుడుని ఇంకా నేను ఎంక్వైరీ చేయలేదు కానీ వైజయంతిని ఎంక్వైరీ చేశాను తను సూటిగా సమాధానం చెప్పిన తన మీదే నాకు డౌట్ గా ఉంది ఝాన్సీ ఎందుకంటే ఇంతకు ముందు నాయుడు ని ఎవరు ఏమన్నా తాచుపాముల లేచేది కానీ ఇప్పుడు అలా కాదు మేము పక్కనే ఉన్న సరే నాయుడు హత్య చేసినట్టుగా మాట్లాడుతుంది ఏమైనా అంటే లొంగిపో బావ నీకు పొలిటికల్ గా ఉపయోగపడుతుంది అని అంటుంది తన మాటల్లో ప్రవర్తనలో తేడా అనిపిస్తుంది ఝాన్సీ అని అభిషేక్ అంటాడు. అవునా అయితే మీరు వదిలి పెట్టకండి సార్ పాపం స్వర ఎంత ఏడుస్తుందో ఏమో అని ఝాన్సీ అంటుంది. కాంతా బాయ్ కాఫీ తెచ్చి ఇవ్వగానే తాగి అభిషేక్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే నీకు అసలు బుద్ధుందా నాకు చెప్పకుండా సడన్గా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వచ్చిన వాళ్ళు పోలీసుల కారు అయినా చూసి వెళ్ళిపోవాలి కదా అలాగే డైరెక్టుగా ఇంట్లోకి వస్తారా దొరికిపోయే వాళ్ళం కదా అందరం ఈపాటికి జైల్లో ఉండే వాళ్ళం అని వైజయంతి అంటుంది.

మేమెందుకు జైలుకెళ్తాం అత్త నువ్వే వెళ్తావు హత్య చేసింది నువ్వైతే నేనెందుకు వెళ్తాం మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అని విశాల్ సుగుణ నీ చంపుతున్నప్పుడు వీడియో చూపెట్టి మా అమ్మను బ్లాక్ మెయిల్ చేసి కాళ్లు పట్టించుకుంటావా ఇప్పుడు వడ్డీకి వడ్డీ తీర్చుకుంటాను కట్నం గా నాకు నాయుడుతో చెప్పి 50 కోట్లు ఇప్పించు లేదంటే ఈ వీడియో బయట పెడతాను అని విశాల్ అంటాడు. చూడు విశాల్ నేను కక్షపడితే నన్ను నేనేనా పొడుచుకొని చస్తా అనే కానీ ఒకరి ముందు ఎప్పుడూ తలవంచదు ఈ వైజయంతి ఆ వీడియో పోలీసులకు చూపెడితే నిన్ను వాళ్లు అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్తావు నువ్వు ఆ టైంలో అక్కడికెందుకు వెళ్లావు సుగుణ ని చంపుతుంటే ఎందుకు చూసావు చూసినవాడివి పోలీసులకు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయావు అసలు ఎవరూ లేని టైంలో నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు అని ప్రశ్నిస్తారు పోలీసులుకు అప్పుడు ఏం సమాధానం చెప్తావు ఎప్పుడు నా ముందు తల ఎగిరే యాలని చూడకు ఎప్పుడు నాచేతులేనే ని జుట్టు ఉంటుంది నీ మొహానికి స్వరని ఇచ్చుడే ఎక్కువ అంటే 50 కోట్లు కావాలా ఆ దరిద్రాన్ని వదిలించుకుందామని నీకు పిల్లని ఇస్తున్నాము అంతే లేదంటే నిన్ను ఎక్కడో పాతాళంలో తొక్కేసేదాన్ని అని వైజయంతి అంటుంది.

ఆ మాటలు వినగానే కళ్యాణి మనలో మనకు గొడవలు ఎందుకు లే వదిన గారు సుగుణ ని చంపింది ఎవరో తెలిస్తే వాడికి శిక్ష పడేలా చేద్దాము స్వరని ఓదార్చండి అని అభిషేక్ వస్తున్నది గమనించి వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేస్తాం ఇప్పుడే తల్లి లేని పిల్లని చేశాడు ఆ భగవంతుడు చంపిన వాడు ఎవడైనా సరే తప్పించుకోలేడు మినిస్టర్ గారి భార్యను చంపి ఎలా తప్పించుకుంటాడు వాడికి శిక్ష పడే తీరుతుంది అని దొంగ ఏడుపు ఏడుస్తుంది వైజయంతి. వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు అని అభిషేక్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలు ప్రవర్తన చూసి ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయి వీళ్లు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారు నన్ను చూసి మాట మార్చారు ఎందుకు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్లకు హత్యకు ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు అభిషేక్.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది