Paluke Bangaramayenaa October 3 ఎపిసోడ్ 37: ఇక తాగింది చాలు వెళ్దాం పద అని విశాల్ అంటాడు. తను ఏమీ మాట్లాడకుండా బెయికు ఎక్కుతుంది స్వర. విశాల్ ఇంటికి తీసుకెళ్తూ ఉండగా స్వరం వాళ్ళ నాన్న కనిపిస్తాడు నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా నాన్న నేను అభిషేక్ తో ఉట్టి కొట్టి కలరు పూసుకొని ఎంజాయ్ చేసి వస్తున్నానని చెబుతావా అని విశాల్ అంటాడు. చూసావా నాన్న అది బలాదుర్గ ఎలా తిరుగుతుందో అని నాయుడు అంటాడు. నాయుడు ఇప్పుడు నువ్వు చూపించాల్సింది కోపం కాదు ప్రేమ దిగి అమ్మాయితో ప్రేమగా మాట్లాడి వాళ్ళను పంపించు అప్పుడే నీకు ఓట్లు పడతాయి అని వాళ్ళ నాన్న అంటాడు.

నాయుడు కారు దిగి వచ్చి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. ఉట్టి కొట్టడానికి స్వర వాళ్ళ ఆఫీసులో అభిషేక్ వాళ్ళ దగ్గరికి వెళ్లి వస్తుంది మామయ్య అని విశాల్ అంటాడు. ఏదో తెలియని తనంతో వెళ్ళుంటుంది బాబు తప్పుగా అర్థం చేసుకోకు అని నాయుడు అంటాడు. నా కళ్ళ ముందు స్వర తప్పు చేసిన నేను ఏమీ అనను మామయ్య ఎందుకంటే నాకు స్వర అంటే ప్రాణం అని విశాల్ అంటాడు. సరే ఇక జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని నాయుడు అంటాడు.

సరే వెళ్తున్నాం మామయ్య అని విశాల్ అక్కడనుండి వెళ్ళిపోతాడు.చూసావా నాన్న వద్దంటున్నా అది ఆ పోలీసోడు దగ్గరికి వెళుతుంది అని నాయుడు అంటాడు. నాయుడు ఏది నువ్వు చేయకు చేయించు అని వాళ్ళ నాన్న అంటాడు. ఇంటికి ఫోన్ చేసి స్వర వాళ్ళ పిన్నికి నాయుడు చెబుతాడు. కట్ చేస్తే స్వర విశాల్ ఇంటికి వస్తారు ఏంటమ్మా ఆ కలర్ అంతా ఎక్కడికి వెళ్లారు అని వాళ్ళ అమ్మ అంటుంది. ఏమీ లేదు అత్తయ్య మా ఇంటి దగ్గర గణేష్ నిమజ్జనం జరుగుతుంది అక్కడ ఉట్టి కొట్టాము అందుకే కలర్ మీద పడింది అని విశాల్అంటాడు. అవునా స్వర అయితే నువ్వు వెళ్లి స్నానం చేసి రా అని వాళ్ళ అమ్మ అంటుంది. స్వర ఆఫీస్ కి వెళ్తావా ఇంటి దగ్గరే ఉంటావా అని విశాల్ అంటాడు.

ఆఫీస్ కి వెళ్తాను అని స్వర అంటుంది. అయితే త్వరగా రెడీ అయి రా నిన్ను డ్రాప్ చేస్తాను అని విశాల్ అంటాడు. వద్దులే నేనే వెళ్తాను అని స్వర అంటుంది. అయితే సరే నేను ఇక వెళ్తాను అని విశాల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అరే అబి ఫోన్ ఏంటి ఇంతవరకు కలవట్లేదు టాబ్లెట్లు అయిపోయాయి వాడికి ఫోన్ చేసి చెబుదాము అనుకుంటే ఫోన్ కలవట్లేదు ఏంటి అని వాళ్ళ బామ్మ అంటుంది. ఇంతలో అభిషేక్ వస్తాడు.ఎక్కడికెళ్లావాబి ఒళ్లంతా ఆ కలర్ ఏంటి అని వాళ్ళ బామ్మ అడుగుతుంది. ఏమీ లేదు బామ్మ గణేష్ నిమజ్జనం దగ్గర ఉట్టి కొట్టారు అందుకని కలరు అంత మీద పడింది అని అభిషేక్ అంటాడు. ఓ ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడని చెప్పి వెళ్ళింది ఇందుకేనా ఎవర్రా ఆ అమ్మాయి అని వాళ్ళ బామ్మ అంటుంది.

ఆ అమ్మాయి పేరు స్వర అని చెప్పబోయే ఆగిపోతాడు అభిషేక్ ఫ్రెండ్ అంటే అమ్మయి ఎవరు అని అడుగుతావేంటి బామ్మ అని అభిషేక్ అంటాడు. అయితే నువ్వు మరి పేరు చెప్పు భయ్ ఎందుకు ఆపేసావు అని వాళ్ళ చెల్లి అంటుంది. ఎవర్రా అమ్మాయి స్వర అంత అందంగా ఉంటుందా ఆ అమ్మాయిలో సగం ఉన్న చాలు రా నాకు నచ్చేస్తుంది అని వాళ్ళ బామ్మ అంటుంది. పెద్దవాళ్ళు అవుతుంటే చాదాస్తం పెరుగుతుంది కానీ నీకేంటి ఆశ పెరుగుతుంది అని వాళ్ళ మనవరాలు అంటుంది. అయినా మన అభి కి ఏం తక్కువ ఎమ్మెల్యే సంబంధం కాపోతే ఎంపీ సంబంధం వస్తుంది అని వాళ్ల బామ్మ అంటుంది. అయితే వెళ్లి బజార్లో నిలబడవే అని వాళ్ళ మనవరాలు అంటుంది. నీకెంత పొగరు ఉంది కాబట్టే నీ నక్లెస్ పోయింది ఇంకా పోతాయి అని వాళ్ళ బామ్మ అంటుంది. నువ్వు శాపనార్థాలు పెట్టకే అని వాళ్ళ మనవరాలు అంటుంది. కట్ చేస్తే స్వర రెడీయే ఆఫీసుకు బయలుదేరుతుంది. ఇంతలో బబ్బి ఎక్కడికి వచ్చి నువ్వు ఆఫీస్ కి వెళ్లడానికి వీల్లేదు అక్క వద్దని చెప్పింది అని అంటాడు. ఎందుకు పెళ్లి చేసుకునే అబ్బాయి ఒప్పుకున్నాడు కదా అని స్వర వాళ్ళ అమ్మ అంటుంది. ఒప్పుకున్నాడు కాబట్టే నీకు కూతురు అభిషేక్ తో ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంది అని బబ్లు అంటాడు.

ఏ బబ్లు ఏం మాట్లాడుతున్నావు ఇందాక విశాల్ వచ్చాడు వాళ్ళ ఇంటి దగ్గర ఏదో గణేష్ నిమజ్జనం ఉంది అక్కడ వసంత ఉత్సవం ఆడుకొని వచ్చాము అని చెప్పాడు అని స్వర వాళ్ళ అమ్మ అంటుంది.నీతో అబద్ధం చెప్పాడు అక్క కానీ బావతో నిజం చెప్పాడు అందుకే మా అక్కకు ఫోన్ చేసి బావ చెపితే అక్క నీ కూతుర్ని ఆఫీస్ కి వెళ్ళొద్దని చెప్పింది అని బబ్లు అంటాడు. అమ్మ మా మేడం అభిషేక్ సార్ కు చాలా క్లోజ్ అమ్మ రమ్మని ఫోర్స్ చేస్తే వెళ్లాను అంతే ఇంకేమీ లేదమ్మా అన్ని స్వర అంటుంది. నువ్వు ఇంకా ఏం మాట్లాడకు నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు ఆఫీస్ లేదు ఏమి లేదు అని వాళ్ళఅమ్మ వెళ్ళిపోతుంది. బబ్లు కూడా ఇంట్లోకి వెళ్లిపోతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది