NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మార్చి 19 – ఫాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: మార్చి 19 – ఫాల్గుణమాసం – శనివారం
మేషం
అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

Today Horoscope march 19th
Today Horoscope march 19th

వృషభం
ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబమున కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది.
మిధునం
చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. ఆప్తులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఆదాయమార్గాలు మందగిస్తాయి.
కర్కాటకం
వ్యాపారమున నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల శ్రమఫలిస్తుంది.
సింహం
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలసిరావు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభించదు.
కన్య
స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చుట్టుపక్కల వారితో వివాదాలలో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. దైవ కార్యక్రమాలకు ధనం అందిస్తారు. వ్యాపారాలలో మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులుంటాయి.
తుల
చేపట్టినపనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. స్థిరస్తి సంభందిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. వృత్తి,ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేదిస్తాయి.
వృశ్చికం
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుఉండదు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.
ధనస్సు
నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తివ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పెరుగుతుంది.
మకరం
ఇతరులతో తొందరపడి మాట్లాడం మంచిది కాదు. బంధు వర్గం వారితో మాటపట్టింపులుంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.
కుంభం
కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. ఖర్చులకు తగిన ఆదాయం లభించదు. నూతన రుణయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మీనం
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘ కాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

May 13: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 13: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 12: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 11: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 11: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 10: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 10: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 9: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 9: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju