NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ గురువారం (నేడు) రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు లంచ్ మోష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై హైకోర్టులో సుమారు అయిదు గంటల  పాటు విచారణ జరిపింది.

AP High Court

ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చి, మళ్లీ విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ఈసీ కోర్టు ముందు సమాధానం ఇచ్చింది. జనవరి నుండి మార్చి 16వరకు వివిధ పథకాలకు బటన్ నొక్కి అప్పుడు నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందు నిధులు ఎలా విడుదల చేస్తారని ఈసీ ప్రశ్నించింది. సైలెంట్ పీరియడ్ లో నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది. దీని వల్ల లెవల్ ఫ్లెయింగ్ ఫీల్డ్ దెబ్బ తింటుందని పేర్కొంది.

తాము ఆన్ గోయింగ్ స్కీమ్ కు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు.  నాలుగు రోజుల్లో పోయిందేముందని, ఈ నెల 14 న తేదీన విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది చెప్పారు. గతంలో తాము జూన్ 6 వరకు నిధులు విడుదల చేసేందుకు వీలులేదని చెప్పినా, తాజాగా మాత్రం పోలింగ్ పూర్తైన తర్వాత విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని ఈసీ న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పను రిజర్వు చేసింది.

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju