ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన చంద్రయాన్ 2 ప్రయోగం చివరి మూడు సెకనుల వ్యవధిలో సక్సెస్ సాధిస్తాం అనుకుంటుండగా నిరాశ పరిచింది. అయితే సైంటిస్టుల ప్రతిభను, వారి కృషిని యావత్ భారతదేశం గుర్తించి వారికి మనోధైర్యాన్నిఇస్తున్నారు. అండగా నిలబడుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు. అందులో మహేశ్‌బాబు కూడా జాయిన్ అయ్యారు. ఆయన తన ట్విట్టర్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. `సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినీ, ఇట్స్ ఎ జర్నీ..` అంటూ మహర్షి సినిమాలో డైలాగ్‌ను పోస్ట్ చేసిన మహేశ్ “చంద్రయాన్ 2లో ఇస్రో చారిత్రాత్మక ప్రయాణం ప్రారంభించింది. ఇందులో భాగమైన ప్రతి శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నాను. మీరే నిజమైన హీరోలు మేం అంతా మీ వెనుకున్నాం. ఇది విజయానికి ఆరంభం మాత్రమే“ అని ట్వీట్ చేశారు.
previous post