Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2: ది రూల్’ నుంచి రిలీజ్ అయిన మొదటి సాంగ్ “పుష్ప పుష్ప” యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ పాటలో బన్నీ వేసిన స్టెప్స్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేయడం జరిగింది. ఇదిలా ఉంటే త్వరలో రెండో పాట రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. జూన్ లో సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ కి సినీప్రియుల నుండి వచ్చిన రెస్పాన్స్ కి సినిమా యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉండటం జరిగింది. ఇందులో బన్నీ వేసిన స్టెప్స్ ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ సృష్టించారు. 2021లో విడుదలైన “పుష్ప” మొదటి భాగం అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ కి కూడా జాతీయ అవార్డు వరించింది. “పుష్ప” సినిమాలో అన్ని ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. “పుష్ప” మేనరిజం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్. తగ్గేదేలే డైలాగ్… ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. దీంతో రెండో భాగం దర్శకుడు సుకుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దేశం మొత్తం “పుష్ప” సెకండ్ పార్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంది.
పుష్ప మొదటి భాగం సమయంలో కరోనా ప్రభావం కారణంగా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. కానీ ఇప్పుడు రెండో భాగానికి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయబోతున్నారట. దీంతో జూన్ నెల ఆఖరికి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి జూలై నుండి… ప్రమోషన్స్ షురూ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హిందీలో ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కువ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసిందట. అంతేకాదు మొదటి భాగం కంటే రెండో భాగం అత్యధికమైన భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 15న “పుష్ప-2” ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.