NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

Russia: ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కు కుట్రలో భారత అధికారుల ప్రమేయం ఉందన్న అమెరికా వాదనలను రష్యా తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో యూఎస్ ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలను అందజేయలేదని తెలిపింది. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో మాట్లాడారు.

భారత్ లో అంతర్గత రాజకీయ పరిస్థితులను చెడగొట్టడానికి, ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను క్లిష్టతరం చేయడానికి అమెరికా ప్రయత్నిస్తొందని ఆరోపించారు. ఇది భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని వ్యాఖ్యానించారు.

మత స్వేచ్చ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మత స్వేచ్చపై అమెరికా కమిషన్ (యూఎస్సీఐఆర్ఎఫ్) నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.

ఇది మా దేశ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోడమే. యూఎస్సీఐఆర్ఎఫ్ అనేది పక్షపాతంతో వ్యవహరించే సంస్థ. రాజకీయ ఎజెండాతోనే అది పని చేస్తుంది. భారత్ లోని విభిన్న, బహుళార్ధ, ప్రజాస్వామ్య విలువలు ఆ సంస్థకు అర్ధం కావు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికల ప్రక్రియలో ఇలా అమెరికా సంస్థ జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదు అని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మీడియా అడిగిన ప్రశ్నకు మారియా పై విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా పన్నూ హత్యకు కుట్ర కేసు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇప్పటి వరకు మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం .. ఈ కేసుకు సంబందించి వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంత వరకూ అందించలేదనీ, తగిన ఆధారాలు లేనప్పుడు ఈ అంశంపై ఊహగానాలు చేయడం ఆమోదయోగ్యం కాదని మారియా బదులిచ్చారు.

అమెరికాలోని సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్ జే) సంస్థ ప్రతినిధి గురుపత్వంత్ సింగ్ పన్ను ఖలిస్తానీల కీలక నేత. భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అమెరికాలో ప్రాణాంతక ఆపరేషన్ ను భారత గుఢచర్య సంస్థ నిర్వహించడంపై అగ్రరాజ్య అధికారులు విస్మయం వ్యక్తం చేశారని కొద్ది రోజుల క్రితం వాషింగ్టన్ పోస్టు కథనం పేర్కొంది.

అయితే అమెరికా నిఘా విభాగాలు పన్నూపై హత్యయత్నాన్ని అడ్డుకున్నాయని తెలిపింది. అలాగే ఆ రా అధికారి పేరు విక్రమ్ యాదవ్ గా పేర్కొంది. భారత ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితమైన అంతర్గత బృందానికి ఈ ప్లాన్ తెలుసునని వ్యాఖ్యానించింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఒక సున్నితమైన అంశంపై అ నివేదిక నిరాధారమైన, అనవసర ఆరోపణలు చేస్తొందని, దర్యాప్తు కొనసాగుతున్న వేళ .. ఇలాంటి ఊహాజనితమైన, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చవని మండిపడింది.

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

Related posts

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత భ‌ర్త గౌత‌మ్ కు కాజ‌ల్ చూపించిన ఫ‌స్ట్ మూవీ ఏదో తెలుసా..?

kavya N

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

NTR: హ్యాపీ బ‌ర్త్‌డే ఎన్టీఆర్‌.. యంగ్ టైగ‌ర్ గురించి ప్ర‌తి అభిమాని తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

kavya N

Bengalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్‌.. ప‌ట్టుబ‌డ్డ తెలుగు సినీ ప్ర‌ముఖులు!

kavya N

Iranian President Raisi death: హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju