NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నా భర్త అతి ప్రేమను భరించలేకపోతున్నా.. నాకు విడాకులిప్పించండి ప్లీజ్.. కోర్టును వేడుకున్న భార్య

UP woman seeks divorce from his husband for loving her more

అయ్యబాబోయ్.. ఇదెక్కడి విచిత్రం. భర్త భార్యపై ప్రేమ చూపించకపోతే చూపించలేదు అంటారు.. చూపిస్తే ఇంతలా చూపిస్తున్నాడు అంటారు. భర్త ఎక్కువ ప్రేమ చూపిస్తే అదే అతి ప్రేమ చూపిస్తే కూడా తప్పేనా? అవును.. తప్పే అంటుంది ఓ ఇల్లాలు. నా బాధ మీకేం తెలుసు. నా భర్త నాపై కురిపించే ప్రేమను తట్టుకునే ఓపిక ఇక నాకు లేదు. నాకు విడాకులు ఇప్పించండి.. అని కోర్టుకు ఎక్కింది ఓ మహిళ.. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. పదండి.. ఇంకాస్త ముందుకెళ్దాం..

UP woman seeks divorce from his husband for loving her more
UP woman seeks divorce from his husband for loving her more

ఉత్తరప్రదేశ్ లోని సంభల్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం మహిళ కు సంవత్సరంనర కింద పెళ్లి జరిగింది. తనకు దొరికిన భర్త నిజంగా దేవుడు. ఎందుకంటే.. ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. కొట్టడు, తిట్టడు.. పల్లెత్తు మాట అనడు. తనకు వంట చేతకాదంటే వెంటనే వండేస్తాడు. తను ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమించేస్తాడు.. అబ్బ.. ఇటువంటి భర్తలు ఈ రోజుల్లో ఉంటారా? ఆమె చాలా అదృష్టవంతురాలు అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఆ మహిళ అనుకోలేదు. నాకెందుకు ఇలాంటి భర్త దొరికాడురా దేవుడా అని అనుకున్నది.

అతగాడి అతి ప్రేమను తట్టుకోలేకపోయింది. అంతే వెంటనే విడాకులు ఇప్పించండి.. అంటూ కోర్టు గుమ్మం తట్టింది. ఇక.. ఆ మహిళ విడాకుల కారణం తెలుసుకున్న షరియా కోర్టు మతాధికారి షాక్ కు గురయి.. అంత మంచి భర్త దొరికితే విడాకులు కావాలంటావేంటని ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు.

ఈ కారణంతో నీకు విడాకులు ఇవ్వడం కుదరదు. మరేదైనా కారణం చెప్పు అని ఆ మహిళకు చెప్పడంతో వెంటనే అక్కడ పని కాదని.. గ్రామ పంచాయితీని ఆశ్రయించింది. అక్కడ కూడా ఆమె అభ్యర్థనను గ్రామ పంచాయతీ పెద్దలు తిరస్కరించారు.

అయితే.. తన భార్య తన నుంచి విడాకులు కోరుతోందని తెలుసుకున్న భర్త.. తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాల్సిందిగా భార్యను కోరాడు. కానీ.. భార్య మాత్రం ససేమిరా అన్నది. దీంతో.. తానేమీ తప్పు చేయలేదని.. మంచి భర్తగా ఉండాలని కోరుకున్నానని.. అది కూడా తప్పేనా? అని తెలిపాడు.

తన భార్య అభ్యర్థనను తిరస్కరించాలని.. తన భార్య అంటే చాలా ఇష్టం అని.. తను విడాకులు తీసుకోవాలనుకుంటున్నా.. తనకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని తెల్చి చెప్పాడు.

ఇలా అయితే కుదరదని.. ఏ సమస్య ఉన్నా ఇద్దరు కలిసి పరిష్కరించుకోండి కానీ.. ఇలా మీ వ్యక్తిగత జీవితాన్ని బజారున పడేసుకోకండి.. అంటూ మతాధికారులు, పెద్దలు ఆ మహిళకు చివాట్లు పెట్టారట. కనీసం ఇప్పుడైనా తన విడాకుల పిటిషన్ ను ఆ మహిళ పక్కన పెడుతుందో లేదో?

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju