NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రెబల్ ఎంపిపై జగన్ మొదటి ఆస్త్రం..! ఇక నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబు..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజుపై పాత కేసులు ఎన్నో ఉంటే ఉండవచ్చు గాక..!ఎప్పటి నుండో ఆయన బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకుండా ఎగవేస్తే ఎగవేసి ఉండవచ్చు గాక..! తన ‘పవర్ ప్రాజెక్టు’ల లావాదేవీల్లో నష్టాలు వచ్చి ప్రస్తుతం సైలెంట్ గా ఉంటే ఉండవచ్చు గాక..!కానీ ‘రఘు’పై ఉన్నట్టుండి ఇప్పుడే సీబీఐ దాడులు జరగడానికి కారణం ఏమిటి..? దీనికి “ముందు..వెనుక” కొన్ని లాజిక్కులు..లాబీయింగ్ లు చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది..!!

ap cm jagan meets pm modi in delhi
ap cm jagan pm modi

ఏమో మోడీతో జగన్ మాట్లాడి ఉండవచ్చు..!

జగన్ మహా కోపిష్టి..! జగన్ పగ పాములాంటి పగ..!! అందుకే.. “కాంగ్రెస్, చంద్రబాబు” కలిపి తనను సీబీఐ కేసుల్లో ఇరికించి జైలులో పెట్టారు అని భావించి ఇప్పటికీ చంద్రబాబుపై సీబీఐ కేసులు వచ్చే వరకూ నిద్రపోవడం లేదు..!! న్యాయ వ్యవస్థతో పోరాడుతూనే.. పార్లమెంట్ ముందు ధర్నాలు చేస్తున్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని.. ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణం.. అని బయటకు లాగుతున్నారు. అటువంటి చంద్రబాబునే ఒక చూపు చూస్తున్న జగన్ కి ఎంపి రఘురామ కృష్ణం రాజు ఒక లెక్కా.? ఢిల్లీలో రోజు ప్రెస్ మీట్ లు పెట్టి ‘ఎడా పెడా, చెడామడా’ జగన్ ను వాయించేస్తున్న రఘురామ కృష్ణం రాజు అంటే జగన్ ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ‘రఘు’ను వదిలివేయాలి? అందుకే రెండు రోజుల క్రితం మోడీని కలిశారు. కలిసిన సందర్భంగా మా ఎంపి మీ పార్టీ మద్దతు చూసుకుని ఢిల్లీలో మమ్మల్ని తిడుతున్నాడు అని ఏపిలో జనం అందరూ అనుకుంటున్నారు. అతని సంగతి ఒక సారి చూడండి. అని జగన్ మోడీని అడిగి ఉండవచ్చు!. మోడీ కూడా “అయ్యో..! భలే పని.మీరు రాజ్యసభలో మిత్రులు. మిమ్మల్ని అంటే మేము ఊరుకుంటామా..ఇప్పుడే అతని పని చెప్తాం” అని తన వ్యవస్థను వాడి ఉండవచ్చు..!!ఏమో ‘రఘు’ ఖర్మ కాలి మోడీకి జగన్ కు మధ్య అతను కూడా ఒక వాక్యంగా మారి ఉండవచ్చు..!

తోక ముడిచినట్లేనా..? నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబేనా..!?

అసలు ఎంపి రఘురామ కృష్ణంరాజు అంటే జగన్ కు పగ కాదు..! మిత్రువు కాదు..! కాకపోతే ఎంపీనే!!జగన్ ను దువ్వి దువ్వీ దువ్వీ రక్తం వచ్చే వరకూ గోకారు. ఇప్పుడు జగన్ చేత గోకించుకుంటున్నారు. అదలా ఉంటే.. జగన్ మెయిన్ టార్గెట్ చంద్రబాబు. ” ఒక సారి సీబీఐని నా అవసరం కోసం కాస్త మళ్ళించండి ప్రభూ..”అని జగన్ మోడీని వేడుకుంటే అందులో మొదటి టార్గెట్ రఘురామ కృష్ణం రాజు అయితే ప్రధాన టార్గెట్ మాత్రం చంద్రబాబు, లోకేష్ లే..! అయి ఉంటారు. అంటే రఘురామ కృష్ణంరాజుది కేవలం టీజర్ మాత్రమే. తరువాత ట్రైలర్, అసలు సినిమా చంద్రబాబు రూపంలో రాబోతున్నాయేమో..! మోడీ – జగన్ కలయిక రోజే “న్యూస్ ఆర్బిట్” పరోక్షంగా ప్రస్తావించింది. “ఏపిలో ఎవరికో మూడింది” అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. దానికి పర్యవసానాలు జగన్ – మోడీ కలయికలో లాజిక్కులు, పాయింట్ లు ఆలోచిస్తూ ఇవన్నీ ఒక్కోదానికి బయటపడతాయుంటాయి. ఇంకా మరెన్ని చూస్తామో..!!

Related posts

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

T Congress: టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికై అధిష్టానం దృష్టి .. రేసులో ఈ కీలక నేతలు

sharma somaraju

జ‌గ‌న్‌పై మ‌ళ్లీ రెచ్చిపోయిన పీకే.. ఈ సారి ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా…?

ఫ‌లితాలు తేడా వ‌స్తే జ‌గ‌న్ ఈ నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం ప‌క్కా…?

అక్క‌డ టీడీపీ గెలిచినా… చంద్ర‌బాబుకు తిప్ప‌లేనా… ?

ధ‌ర్మ‌న – సీదిరిల‌కు గెలుపు ఎంత ఇంపార్టెంటో తెలుసా..?

ఈ ప్ర‌చారం ఏపీ ఎన్నిక‌ల్లో ఎవ‌రి కొంప ముంచుతుందో… టీడీపీ, వైసీపీలో బిగ్ టెన్ష‌న్‌..?

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!