NewsOrbit
న్యూస్

అత్త టోల్ ప్లాజాలో- అల్లుడు ఆసుపత్రిలో..! వైసిపీలో ఇదో వివాదం..!!

వైసీపీ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అటు అత్త .. ఇటు మేనల్లుడు ఒకే రోజు రెచ్చిపోయిన సంఘటన వైసీపీలో కలకలం రేపుతోంది.ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల రేవతి కాజా టోల్గేట్ వద్ద హల్చల్ చేయడం తెలిసిందే.

బహిరంగంగా టోల్ గేట్ వద్ద జరిగిన ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. దేవళ్ల రేవతి టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన వీడియో దృశ్యాలు కూడా బయటకు వచ్చేశాయి.ఇది జరిగి కొన్ని గంటలు కాకముందే..ఆమె మేనల్లుడు వైద్య సిబ్బందిపై దాడి చేసినట్లు మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాచేపల్లిలోని క్రాంతి నర్సింగ్ హోమ్ లో వైద్యం చేయించుకున్న అనంతరం బిల్లు కట్టకుండా..రేవతి మేనల్లుడు దేవళ్ల వంశీ అలియాస్ వడియరాజు దాడి చేశాడని నర్సింగ్ హోం సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సదరు ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కొద్దిగా వెనక్కు వెళితే .. ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ దేవళ్ల రేవతి తన హోదాను కూడా మర్చిపోయి టోల్ప్లాజా వద్ద వీరంగం సృష్టించిన ఘటన సంచలనం సృష్టించింది.

గురువారం ఉదయం గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ నుంచి ఆమె కారు వెళుతుండగా..టోల్ ఫీజు కట్టాలని అక్కడున్న సిబ్బంది ఆమెకు చెప్పారు.దీంతో టోల్ ప్లాజా సిబ్బందితో ఆమె గొడవకు దిగారు.ఆవేశంగా కారు దిగిన ఆమె..స్టాప్ పేరిట ఉన్న బోర్డులు, బారికేడ్లను తొలగించడం వివాదానికి దారి తీసింది. దుర్భాషలాడుతూ వారిపై చేయి చేసుకుంది.ఈ వీడియోలు మీడియాలో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో సీఎంవో ఆఫీసు వివరణ కోరింది.ముఖ్యమంత్రి కూడా ఆమెపై సీరియస్గా ఉన్నారని సమాచారం.అయితే రేవతి టోల్ ప్లాజా సిబ్బంది తనను దుర్భాషలాడటంతోనే తాను రియాక్ట్ అయ్యానంటూ ఒక వివరణ ఇచ్చింది.

మీడియాలో చూపిస్తున్న వీడియో ఎడిట్ చేయబడిందని ,పూర్తి వీడియో చూపిస్తే అసలేం జరిగిందో అందరికీ అర్థమవుతుందని రేవతి చెప్పుకొచ్చింది.ఈ వివాదం కొనసాగుతుండగానే గురువారం సాయంత్రమే ఆమె మేనల్లుడు వంశీ దాచేపల్లిలోని ఒక ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చికిత్సకు అయిన వ్యయాన్ని చెల్లించాలని ఆస్పత్రి సిబ్బంది కోరగా తాను ఎవరో తెలుసా అంటూ అతను గొడవకు దిగి వారిపై దౌర్జన్యం చేశాడంటున్నారు .ఈ వీడియోలు కూడా మీడియాకు అందాయి.ఇక ఆ ఆసుపత్రి యాజమాన్యం వంశీ పై ఫిర్యాదు చేసిందని,విచారణ జరుపుతున్నామని గురజాల సీఐ ఉమేశ్ కూడా ధ్రువీకరించారు.ఈ అత్త మేనల్లుళ్ల విషయంలో సీఎం జగన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి!

 

Related posts

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ .. ఆ తేదీల వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

sharma somaraju

Cyclone Remal: ఏపీకి రేమాల్ తుఫాను ముప్పు తప్పింది .. భారీ వర్షాలు ఎక్కడ పడతాయంటే..?

sharma somaraju

Tollywood Actress: 40లోనూ అందాల‌తో అల్లాడించేస్తున్న ఈ హీరోయిన్ ను గుర్తుప‌ట్టారా.. తెలుగులో ఒక్క సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది!

kavya N

Laapataa Ladies: ఓటీటీలో సంచ‌ల‌నం రేపుతున్న లాపతా లేడీస్.. యానిమ‌ల్ రికార్డును చిత్తు చేసిన చిన్న సినిమా!

kavya N

Road Accident: ట్రక్ ను మినీ బస్సు .. ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి

sharma somaraju

Kedarnath: కేదార్‌నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం .. గాల్లో గింగిర్లు కొడుతూ హెలికాఫ్టర్ ల్యాండింగ్ .. వీడియో వైరల్

sharma somaraju

Kalki 2898 AD: ప్రభాస్ బుజ్జి స్పెషాలిటీస్ ఏంటి.. ఆ కారు కోసం ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా?

kavya N

Shruti Haasan: శాంతానుతో బ్రేక‌ప్.. ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చేసిన శృతి హాస‌న్‌..!!

kavya N

IPS AB Venkateswararao: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దుపై పిటిషన్ .. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

sharma somaraju

ఈవిఎం ధ్వంసం ఘటనలో ఇద్దరు అధికారులపై ఈసీ వేటు

sharma somaraju