NewsOrbit
న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 10- పుష్యమాసం- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope ఫిబ్రవరి – 10- పుష్యమాసంబుధవారం.

Horoscope మేష రాశి : వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. సమస్యల నుంచి బయటపడతారు. అందరూ మిమ్మల్ని గుర్తించాలని అనుకుంటారు. ఆధ్యాత్మిక తత్వం ఏర్పడుతుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. దానధర్మాలు చేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. అప్పుల బాధలు తీర్చుకుంటారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధన వృద్ధి కలుగుతుంది. సంగీతం మీద ఆసక్తి చూపుతారు. శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. ఇతరుల కోసం కష్టపడతారు. ముఖ్యమైన విషయాల్లో మీ అంతట మీరే నిర్ణయాలు తీసుకుంటారు. రాబోయే రోజుల గురించి ఆలోచిస్తారు. సరైన సమయంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలను పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయండి.

Horoscope వృషభ రాశి : పనులలో ఆటంకాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం మంచిది. అప్పుల బాధలు పెరుగుతాయి. ధన నష్టం జరుగుతుంది. అనవసరపు ఖర్చులు ఏర్పడడం వల్ల ఇబ్బందులు. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇతరులతో అనవసరపు చర్చలు చేయడం వల్ల విభేదాలు ఏర్పడతాయి. సమయాన్ని వృధా చేస్తారు. విద్యార్థులు అనవసరపు విషయాలకు దూరంగా ఉండి విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: సంకటహర గణపతిని ఆరాధించండి.

Horoscope మిధున రాశి : ధన వృద్ధి కలుగుతుంది !

ఈరోజు బాగుంటుంది. స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. ఇతరుల కోసం బాగా కష్టపడతారు. ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. పెద్ద వారి సూచనలను పాటిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరపు ఖర్చులకు దూరంగా  ఉండడం వల్ల ధన వృద్ధి కలుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు.

రెమిడీ: మహాలక్ష్మి అష్టకం పారాయణం చేసుకోండి.

Horoscope కర్కాటక రాశి : ప్రయాణాలు అనుకూలించవు !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి ఇతరులను నమ్మడం వల్ల మోసపోతారు. కొత్త వ్యక్తులను నమ్మడం వలన నష్టపోతారు. అప్పుల బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. సమయానికి నిద్ర హారాలను తీసుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలించవు. మీలో ఉన్న లోపాన్ని గ్రహించకపోవడం వల్ల నష్టపోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల నష్టాలు. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో నిరాశ ఏర్పడుతుంది. విద్యార్థులు స్నేహితులకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీ: దుర్గాదేవి ఆరాధన చేసుకోండి.

Horoscope సింహరాశి : సోదరుల వల్ల లాభం !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. సోదరుల వల్ల లాభం కలుగుతుంది. ధన సహాయం చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కల్గిస్తాయి. ధర్మానికి ప్రాధాన్యతనిస్తారు. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో స్నేహితుల సహకారంతో గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

రెమిడీ: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

today-february-10-daily-horoscope-in-telugu
today-february-10-daily-horoscope-in-telugu

Horoscope కన్యారాశి : ప్రయాణాల వల్ల ఇబ్బందులు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. మీలో ఉన్న గర్వం వల్ల సమస్యలు ఏర్పడతాయి. ప్రతి విశయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చేసిన తప్పులకు బాధ పడతారు. సమాజంలో లో మీకు ఉన్న గౌరవం తగ్గుతుంది. ఎంత కష్టమైన పనినైనా శ్రమించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పెద్ద వారిని గౌరవించక పోవడం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఇబ్బందులు.సనిహితులతో జాగ్రత్త.

రెమిడీ: శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

Horoscope తులారాశి : ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. మిత్రుల కలయిక ఆనందాని ఇస్తుంది. కొత్త వ్యాపారాలను ప్రారంభించి అధిక లాభాలను పొందుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. సమయాన్ని వృధా చేయకుండా అనుకున్న పనులను పూర్తి చేస్తారు. విలువైన పత్రాలు మీద సంతకాలు చేయడానికి అనుకూలం. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ధన లాభం కలుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ప్రతి విషయంలో నిజాన్ని గ్రహించి తప్పులను సరిదిద్దు కుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రమోషన్లు కలుగుతాయి. ఉన్న సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉంటారు.

రెమిడీ: లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

Horoscope వృశ్చిక రాశి : బంధువులతో విభేదాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. తొందరపడి ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వడం వల సమస్యలు ఏర్పడతాయి. తొందరపడి మాట్లాడటం వల్ల గొడవలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వలన నష్టం. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. బంధువులతో విభేదాలు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులకు స్నేహితుల వల్ల విద్యా నష్టం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో నమ్మకద్రోహం, స్వల్ప నష్టాలు ఏర్పడతాయి.

రెమిడీ: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

Horoscope ధనస్సు రాశి : దైవారాధనకు ప్రాధాన్యతనిస్తారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి వ్యాపారాన్ని చేపట్టిన లాభాలు కలుగుతాయి. గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రకృతిని ఇష్టపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. సాంప్రదాయక వంటల మీద ఆసక్తి చూపుతారు. స్నేహితులతో మీ కష్ట సుఖాలను పంచుకుంటారు. మిత్ర లాభం పొందుతారు. ధర్మానికి, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. స్త్రీలు దైవారాధనకు ప్రాధాన్యతనిస్తారు.

రెమిడీ:  శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

Horoscope మకర రాశి : వ్యాపారాల్లో స్వల్ప లాభాలు !

ఈరోజు అనుకూలంగా లేదు. మిత్రులు శత్రువులు అవుతారు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడక పోవడం వల ఇబ్బందులు కలుగుతాయి. చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆహార నియంత్రణ లేకపోవడం వల చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రహస్యాలను ఇతరులకు చెప్పడం వలన ఇబ్బందులు కలుగుతాయి. మీలో ఉన్న సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల ప్రశాంతత కలుగుతుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు కలుగుతాయి

రెమిడీ: విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Horoscope కుంభరాశి : పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. ధర్మానికి, న్యాయానికి, ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఎంత  కష్టపడి అయినా డబ్బులను బాగా సంపాదించాలి అనుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. వ్యాపారాల్లో అధిక ఆర్థిక అభివృద్ధి పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఉన్న ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. ఖర్చులకు దూరంగా  ఉండడం వలన ధన లాభం కలుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విలువైన  పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. స్థిర ఆస్తులను కొనుగోలు చేస్తార. స్త్రీలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

రెమిడీ:  శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

Horoscope మీన రాశి : ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. ఎదుటివారు మీ మీద నిండ వేసే అవకాశం ఉంది. ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టం. వ్యాపారాల్లో సరైన పెట్టుబడులు పెట్టకపోవడం వలన నష్టాలు ఏర్పడతాయి. సంబంధం లేని విషయాలు చర్చించడం వల ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు చేయడం వల ధన నష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు. ఈరోజు ప్రశాంతత కోల్పోతారు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయక వాయిదా వేయడం వల నష్టం జరుగుతుంది. ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో అబద్దాలు చెప్పడం వల ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలంగా లేదు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N