NewsOrbit
రాజ‌కీయాలు

ఎవరూ గుర్తుపట్టలేదు కదా..!

గాంధీనగర్: ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించిన తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారి బహిరంగ సభలో మాట్లాడారు. గుజరాత్ లో నిర్వహించిన సభలో ఆమె 8 నిమిషాల పాటు ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పేదలకు కనీసం తిండి కూడా లేదంటూ ప్రభుత్వంపై నిశితంగా విమర్శలు గుప్పించారు.

అంతా బాగానే ఉంది గానీ, ఆమె తన ప్రసంగం ప్రారంభించిన తీరుపైనే కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. సాధారణంగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి నాయకులు ఎవరైనా ‘నా ప్రియమైన అన్నలు.. చెల్లెల్లారా’ అని ప్రారంభిస్తారు. కానీ ప్రియాంక మాత్రం ‘మేరే బెహనోం ఔర్ మేరే భాయియోం’ (నా అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు) అని ప్రారంభించారు. ఆమె కావాలనే అలా చేశారో లేదా పొరపాటున అలా వచ్చేసిందో గానీ.. వరుసక్రమం మాత్రం మారిపోయింది.

ఈ విషయాన్ని అసోంలోని సిల్చార్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ట్వీట్ చేశారు. ప్రియాంక ప్రసంగం వీడియో క్లిప్ ను ఆమె షేర్ చేశారు. దాంట్లోనే ఇలా వరుసక్రమం మారిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘గుజరాత్ రాష్ట్రంలో ప్రియాంకాగాంధీ ప్రసంగం చాలా కారణాలతో బాగుంది. చాలామందిలా కాకుండా వరుసక్రమం మార్చడాన్ని నేను చాలా ఇష్టపడ్డాను. ఆమె బెహనోం ఔర్ భాయియోం అన్నారు.. వేరేలా కాకుండా’’ అని సుష్మితా దేవ్ ట్వీట్ చేశారు. దాన్ని ప్రియాంక రీట్వీట్ చేయడమే కాక, ‘‘…ఎవరూ ఈ విషయం గుర్తుపట్టలేదనుకుంటా!!” అని కామెంట్ కూడా పెట్టారు.

Related posts

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

Leave a Comment