Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ హీరో అని అందరికీ తెలుసు. రాజకీయ నేతగా సినిమా హీరోగా రాణించే పవన్ కళ్యాణ్ దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు డైరెక్ట్ చేయడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన సినిమా జానీ. ఆ తర్వాత గుడుంబా శంకర్ వంటి సినిమాలను డైరెక్ట్ చేయడం జరిగింది. అంతమాత్రమే కాకుండా వీటికంటే ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో కర్చీఫ్ ఫైట్ సీన్ అప్పట్లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం రానాతో కలిసి నటిస్తున్న మలయాళం రీమేక్ మల్టీస్టారర్ సినిమాలో ఒక చిన్న సీన్… అది రానా నటించిన సీన్ నీ పవన్ కళ్యాణ్ స్వయంగా దగ్గరుండి.. దర్శకత్వం వహించి తీశారట. అద్భుతంగా అవుట్ పుట్ వచ్చినట్లు ఫిలిం వర్గాలలో టాక్. ఈ సినిమాలో రానా పక్కన కనిపిస్తున్న నేపథ్యంలో… ఫిట్ గా కనిపించాలని పవన్ రోజు వర్కౌట్లు చేస్తున్నారట. త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా శరవేగంగా సాగుతోంది. త్వరలోనే సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Pawan Kalyan : పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్…
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన క్రమంలో సినిమా షూటింగ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలు వీడియోలు రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. ఎస్ ఎస్ తమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పెద్దగా సాంగ్స్ ఉండవని సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపిస్తూ ఉండగా.. పవన్ కళ్యాణ్ ని ఎదిరించే పాత్రలో రానా క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. అయితే ఈ దశలో సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉండటంతో .. పవన్ పై ఒక్కసారిగా గట్టిగా అరిచే సీన్ వచ్చిన క్రమంలో రానా పెద్దగా రాకపోవటం జరిగిందట. దీంతో పవన్ అర్థం చేసుకుని చొరవ తీసుకుని..ఆ సీన్ సరిగ్గా వచ్చే రీతిలో రానా చేత గట్టిగా అనిపించాడట..ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతుంది.