NewsOrbit
న్యూస్

RBI: క్రిప్టో కరెన్సీని లీగల్ చేయడం వలన భారత్ కి ఒరిగేదేమిటి? భారత్ తొందరపడుతోందా?

RBI: ప్రపంచంలోని వివిధ దేశాలవారు డిజిటల్ కరెన్సీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ, ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో దేశంలోకి డిజిటల్ కరెన్సీని జారీ చేయనున్నట్లు RBI ప్రకటించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్దం చేయడం ద్వారా ఎలక్ట్రానిక్ చెల్లింపులకు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం వెనుక వున్న ఆంతర్యం అందరికీ అర్ధమైనదే. ఈ నేపథ్యంలో RBI డిజిటల్ కరెన్సీని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తొందరపడుతోందా? అనే ప్రశ్నలు ఇపుడు నడుస్తున్నాయి.

YS Jagan: సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ .. తగ్గేదేలే అంటున్న వామపక్షాలు..

RBI: క్రిప్టో కరెన్సీని లీగల్ చేయడం వలన కలిగే వెసులుబాట్లు ఇవే..

డిజిటల్ రూపాయి అనేది ATMల అవసరం లేకుండా పనిచేస్తుంది. వినియోగదారులు తమ నగదును ఖాతాల నుంచి ఆన్‌లైన్ టోకెన్‌ల రూపంలో వాలెట్‌లలోకి ఈజీగా బదిలీ చేసుకోగలరు. డిజిటల్ పేమెంట్ యాప్స్ అయినటువంటి ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్ల మేర లావాదేవీలు సురక్షితంగా జరుగుతున్నట్టు సర్వే. అందువల్ల డిజిటల్ కరెన్సీని సైతం సురక్షితమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులు స్వీకరించే అవకాశం వుంది. క్రిప్టో కరెన్సీ వలన ముఖ్యమైన ఉపయోగం ఏమంటే, సెక్యూరిటీ మరియు ట్రాన్స్ఫారన్సీ. అందువలన వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.


Eye Strain: అలసిన కళ్ళకు ఈ సింపుల్ చిట్కా..!!
భారత్ తొందరపడుతోందా?

అవుననే అంటున్నారు కొందరు ఆర్ధిక వేత్తలు. అభివృద్ధి చెందిన దేశాలు కరోనా మహమ్మారి తర్వాత నోట్ల వినియోగం తగ్గిపోవడం గురించి ఒకింత ఆందోళనకు గురి అవుతున్నాయి. అయితే భారత్ లో ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. ప్రపంచానికే పెద్దన్న పాత్ర పోషిస్తున్న U.S. ఫెడరల్ రిజర్వ్ సైతం ప్రైవేట్ డిజిటల్ కాయిన్‌లకు పోటీగా చేయడానికి చట్టబద్ధమైన కరెన్సీని తీసుకురావాలా వద్దా అనే అంశంపై ప్రజాభిప్రాయాలను అడుగుతోంది. అలాగే డిజిటల్ యూరో ప్రాజెక్టు గత రెండేళ్ల నుంచి చర్చల దశలోనే ఉంది. అన్నీ కుదిరేతే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దీనిని 2025 నాటికి అందించే అవకాశం లేకపోలేదు. జపాన్ 2026కి గానీ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చేలా లేదు. ఇలాంటి తరుణంలో భారతదేశంలో మాత్రం హడావిడి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ రూపాయి మంచిదే. బ్యాంకులు మోసాలకు పాల్పడకుండా నిఘా ఉంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు వీలవుతుంది. కానీ, ఇక్కడ RBI మరింత గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాంకేతికత, బ్లాక్‌చెయిన్, స్కేలబిలిటీ, ఆడిటబిలిటీ, భద్రత, గోప్యత, చట్టవిరుద్ధ లక్ష్యాలు మొదలగు అంశాలపైన అత్యంత వేగంతో పనిచేయవలసి అవసరం ఎంతైనా వుంది.

Related posts

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju