Khiladi: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `ఖిలాడి`. ఇందులో మీనాక్షి చౌదురి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించగా.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్ర పోషించారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై హవీష్ కోనేరు, సత్యనారాయణ కోనేరు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
కథ, కథనం ఎలా ఉన్నప్పటికీ రవితేజ నటన, ఎనర్జీ నెక్ట్ లెవల్ అని చెప్పుకొవచ్చు. హీరోయిన్లు గ్లామర్‌కే పరిమితం కాగా.. యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకున్నాయి. అయితే ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా కథ సాగిపోవడం, క్లైమాక్స్ అంచనాలను అందుకోలేకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి. అయినప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా మాత్రం ఈ చిత్రం అదరగొట్టింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను రవితేజ బాగానే కలెక్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఖిలాడి ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి..
నైజాం- 1.86 కోట్లు
సీడెడ్-.0. 56 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.46 కోట్లు
తూర్పు గోదావరి- 0.26 కోట్లు
పశ్చిమ గోదావరి- 0.21 కోట్లు
గుంటూరు- 0.56 కోట్లు
కృష్ణ- 0.18 కోట్లు
నెల్లూరు- 0.21 కోట్లు
————————————————————————
ఏపీ+తెలంగాణ మొత్తం- 4.30కోట్లు(6.80కోట్లు~ గ్రాస్)
————————————————————————-
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.38 కోట్లు
ఓవర్సీస్ – 0.16 కోట్లు
————————————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్- 4.84కోట్లు(8కోట్లు~ గ్రాస్)
————————————————————————-
కాగా, ప్రపంచవ్యప్తంగా ఈ చిత్రం రూ.22.80 కోట్లు ప్రీ రిలీజ్ బెజినెస్ చేయగా.. రూ.23.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.18.66 కోట్లను రాబట్టాల్సి ఉంది. మరి రవితేజ ఈ భారీ టార్గెట్‌ను రీచ్ అవుతాడో..లేదో..చూడాలి.