Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో జెట్ స్పీడ్ కంటే వేగంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కన్నడ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ మరియు హిందీ భాషల్లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ను టేకప్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఈమె తాజాగా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన చిత్రాల్లో విజయ్ 66 ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందిస్తున్నాడు. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. నిన్న చెన్నైలో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం అయింది. విజయ్ – రష్మికల పై దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే ఈ మూవీకి రష్మిక రేటెంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. రష్మిక విజయ్ సినిమాకు ఏకంగా రూ. 5 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ, దిల్ రాజు మాత్రం అంత భారీ మొత్తం ఇవ్వడానికి ఒప్పుకోలేదట. ఈ నేపథ్యంలోనే ఆమెతో అనేక చర్చలు జరిపి చివరాఖరకు రూ. 4.5 కోట్లకు ఫైనల్ చేశారట. ఇక అందుకు రష్మిక సైతం ఓకే చెప్పిందని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
కాగా, రష్మిక ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. తెలుగులో ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా `పుష్ప ది రూల్` చేస్తోంది. బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో `మిషన్ ఇంపాజిబుల్`, అమితాబ్‌తో కలిసి `గుడ్ బై` సినిమాలు చేస్తోంది. రీసెంట్గా రణ్‌భీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందుతున్న `యానిమల్` మూవీలో రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇవన్నీ కాకుండా మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో ఓ మూవీ చేస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఇది.