తులసి ఉదయం లేచి కోట ముందు పూజ చేస్తుంది.. భూమి పూజ నిర్విఘ్నంగా జరిగే లాగా చేయమని తులసమ్మని వేడుకుంటుంది.. అభి మిద్దె పైనుంచి వాళ్ళ మమ్ పూజ చేయడం చూస్తూ ఉంటాడు.. అంతలో అభి కి లాస్య ఫోన్ చేస్తుంది.. తను ఒక ప్లాన్ అభికి చెబుతుంది.. ఇలా చేస్తే తులసి భూమి పూజకు గుమ్మడికాయ కొట్టినట్టే అని సలహా ఇస్తుంది.. అభి కాస్త ఆలోచనలో పడతాడు.. మొత్తానికి లాస్య అభి చేత ఓకే అనిపిస్తుంది..
హనీ బెడ్ పై నిద్ర పోతుంది. అప్పుడే సామ్రాట్ వచ్చి హానిని నిద్ర లేపుదామని అనుకుంటాడు. హనీ కళ్ళు మూసుకుని సామ్రాట్ ను చూడకుండా నువ్వు వచ్చావని నాకు తెలుసు డాడీ.. నువ్వు బ్రతిమిలాడతు నన్ను నిద్ర లేవడం నాకు ఇష్టం.. అందుకే లేగవలేదని హనీ అంటుంది.. త్వరగా రెడీ అవ్వు భూమి పూజ కు వెళ్లాలి అని అంటాడు.. అవును నాకు తెలుసు తులసి అంటి చెప్పింది.. నాకు మంచి డ్రెస్ కూడా సెలెక్ట్ చేసింది ఈరోజు వేసుకోవడానికి అని హనీ అంటుంది.. అవునా ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు అని సామ్రాట్ అంటాడు. ఏ డాడీ నీకు జలస్ గా ఉందా అని హనీ అటపట్టిస్తుంది..
సామ్రాట్ వాళ్ళు భూమి పూజ ఫంక్షన్ దగ్గరకు తులసి కంటే ముందే వస్తారు.. అప్పుడే తులసి రావడం గమనించిన హనీ తులసి ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది.. మా డాడీకి ఫేవరేట్ కలర్ పింక్, బ్లూ.. నేను పింక్ వేసుకున్న అందుకే మిమ్మలని బ్లూ వేసుకోమన్నను.. మా డాడీ కళ్ళకికి కలర్ ఫుల్ ట్రీట్ అని హనీ అంటుంది.. అమ్మ దొంగా నీ దగ్గర ఇన్ని ప్లాన్స్ ఉన్నాయా అని తులసి అంటుంది.. అంతలో లాస్య వచ్చి ఆ పార్టీ మూడ్ ను చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది.. కానీ లాస్య ఐడియా ను దెబ్బ తీయాలని తులసి వాళ్ల అన్నయ వినోద్ వస్తాడు.. సూపర్ ట్విస్ట్ లతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది..