NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

BBC Documentary on PM Modi: మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ భారత్ లో నిషేదిత పంచాయతీ సుప్రీం చెంతకు..ఫిబ్రవరి 6న విచారణ

BBC Documentary on PM Modi: ప్రధాన మంత్రి మోడీపై బీబీసీ రూపొందిన డాక్యుమెంటరీ ప్రసారాలను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్ల ప్రస్తావనతో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించగా, దీనిని భారత ప్రభుత్వం నిషేదించడం వివాదాస్పదమైంది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేదించేందుకు కేంద్రం అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. వీటన్నింటిపై వచ్చే సోమవారం (ఫిబ్రవరి 6న) విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం తెలిపింది.

SC to hear cases against ban On BBC Documentary on PM Modi Feb 6th

 

తాము దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయు సింగ్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ పిటిషన్ల కంటే ముందు జర్నలిస్ట్ ఎన్ రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా పిటిషన్లు వేశారు. రెండు భాగాలుగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం నిషేదం విధించడం దుర్మార్గమని, నిరంకుశం, రాజ్యాంగ విరుద్దమని ఎంఎల్ శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఇండియా: ది క్వశ్చన్ పేరుతో బీబీసీ డాక్యుమెంటరీ లింక్ లను సోషల్ మీడియా నుండి తొలగించేందుకు ఐటీ రూల్స్ కింద కేంద్రం అత్యవసర అధికారులను ఉపయోగించిందనీ, కానీ కేంద్రం అధికారికంగా నిషేదిత ఆర్డర్ ను ప్రచురించలేదనీ, డాక్యుమెంటరీ ప్రదర్శించారన్న కారణంతో అజ్మీరు లో కళాశాల విద్యార్ధులను తొలగించారనీ న్యాయవాది సీయూ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్ల తరపు వాదనలు విన్న సీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసన వచ్చే సోమవారం విచారణ జరుపుతామని తెలపింది.

సీఎం జగన్ నోట ‘రజనీ’ పంచ్ డైలాగ్ .. తోడేళ్లన్నీ ఏకమైనా సింహం సింగిల్ గానే అంటూ..

Related posts

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?

Murari: మురారిలో హీరోయిన్ పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ సోనాలీ బింద్రే కాదా.. అస‌లు మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

OTT Actress: ఒక్క వెబ్ సిరీస్ కు రూ. 250 కోట్లు రెమ్యున‌రేష‌న్‌.. ఓటీటీల్లో హైయెస్ట్ పెయిడ్‌ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N