BBC Documentary on PM Modi: ప్రధాన మంత్రి మోడీపై బీబీసీ రూపొందిన డాక్యుమెంటరీ ప్రసారాలను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా మోడీ ఉన్న సమయంలో జరిగిన అల్లర్ల ప్రస్తావనతో బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించగా, దీనిని భారత ప్రభుత్వం నిషేదించడం వివాదాస్పదమైంది. బీబీసీ డాక్యుమెంటరీని నిషేదించేందుకు కేంద్రం అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీం కోర్టులో దాఖలు అయ్యాయి. వీటన్నింటిపై వచ్చే సోమవారం (ఫిబ్రవరి 6న) విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్ధివాలాతో కూడిన ధర్మాసనం తెలిపింది.

తాము దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్లపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయు సింగ్ చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ పిటిషన్ల కంటే ముందు జర్నలిస్ట్ ఎన్ రామ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా పిటిషన్లు వేశారు. రెండు భాగాలుగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం నిషేదం విధించడం దుర్మార్గమని, నిరంకుశం, రాజ్యాంగ విరుద్దమని ఎంఎల్ శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇండియా: ది క్వశ్చన్ పేరుతో బీబీసీ డాక్యుమెంటరీ లింక్ లను సోషల్ మీడియా నుండి తొలగించేందుకు ఐటీ రూల్స్ కింద కేంద్రం అత్యవసర అధికారులను ఉపయోగించిందనీ, కానీ కేంద్రం అధికారికంగా నిషేదిత ఆర్డర్ ను ప్రచురించలేదనీ, డాక్యుమెంటరీ ప్రదర్శించారన్న కారణంతో అజ్మీరు లో కళాశాల విద్యార్ధులను తొలగించారనీ న్యాయవాది సీయూ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. పిటిషన్ల తరపు వాదనలు విన్న సీజే జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసన వచ్చే సోమవారం విచారణ జరుపుతామని తెలపింది.
సీఎం జగన్ నోట ‘రజనీ’ పంచ్ డైలాగ్ .. తోడేళ్లన్నీ ఏకమైనా సింహం సింగిల్ గానే అంటూ..
Pawan Kalyan: పర్చూరు సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు