NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: రేపటి నుండే పవన్ వారాహి యాత్ర ప్రారంభం .. పర్యటన ఇలా.. నేడు అన్నవరంకు జనసేనాని

Janasena:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రేపటి (బుధవారం) నుండి ప్రారంభం కానున్నది. అన్నవరం సత్యదేవుడిని దర్శనంతో జనసేన వారాహి యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. వారాహి నుండి పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ కత్తిపూడి కూడలిలో జరగనుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో ప్రజలతో పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు అన్నవరం నుండి నరసాపురం వరకూ వారాహి యాత్ర షెడ్యుల్ ఖరారు అయ్యింది. ఇప్పటికే వారాహి యాత్రకు పోలీసు అనుమతులు తీసుకున్నారు ఆ పార్టీ నేతలు. అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Pawan Kalyan Varahi yatra starts from tomorrow Andhra Pradesh
Pawan Kalyan Varahi yatra starts from tomorrow Andhra Pradesh

కత్తిపూడి నుండి ఉభయ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనున్నది. ఫిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుతుంది వారాహి యాత్ర.  పవన్ కళ్యాణ్ యాత్ర విజయవంతానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో చర్చలు జరిపి ఏడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. వారాహి యాత్రకు హజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి సభ వద్ద మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నారు.

వారాహి యాత్ర షెడ్యుల్ ఇది

  • 14 -6- 2023 – ప్రత్తిపాడు నియోజకవర్గంలో కత్తిపూడి లో సభ
  • 16 – 6- 2023 – పిఠాపురంలో వారాహి యాత్ర, సభ
  • 18 – 6- 2023 – కాకినాడులో వారాహి యాత్ర, సభ
  • 20 -6 – 2023 – ముమ్మడివరంలో వారాహి యాత్ర, సభ
  • 21 -6- 2023 – అమలాపురంలో వారాహి యాత్ర, సభ
  • 22-6 -2023 – పిన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర, రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సభ
  • 23 – 6- 2023 – నరసాపురంలో వారాహి యాత్ర, సభ

కాగా ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుని రేపు ఉదయం 9 గంటలకు వారాహికి ప్రత్యేక పూజలు చేసి, అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకుని నేతలు తెలిపారు. అనంతరం వారాహి వాహనంపై కత్తిపూడి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కత్తిపూడిల మొదటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశామని నేతలు వెల్లడించారు.

YS Viveka Case: అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ 19వ తేదీకి వాయిదా వేసి సుప్రీం కోర్టు

Related posts

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?