NewsOrbit
Entertainment News OTT సినిమా

Kumari Srimathi Review: మంచి మందు తాగిన ఫీలింగ్, బార్ పెట్టాలన్న కుమారి శ్రీమతి కల నిరవేరేనా? ఈ నిత్య మేనన్ సిరీస్ కచ్చితంగా చూడండి, ఎందుకంటే!

Kumari Srimathi Review Nitha Menens Kumari Srimathi Web Series Review Should you watch or skip

Kumari Srimathi Review | Nitya Menen New Series: నిత్యా మీనన్ పేరు వినగానే ఒక అందమైన రూపం, నిగనిగలాడే పసిమి ఛాయా, చక్రాల లాంటి పెద్ద కళ్ళు ఉంగరాల జుట్టు మనకళ్ల ముందు ఉంటుంది. కళ్ళు తిప్పుకోలేనంత అందం తో అభిమానులను ఈమె కట్టిపడేయగలదు . భీంల నాయక్ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని నిత్యా ఇప్పుడు కుమారి శ్రీమతి అనే ఆసక్తి కరమైన పేరున్న ఒక వెబ్ సిరీస్ తో మనముందుకు వచ్చింది. మైన కార్తీక దీపం డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల, తిరువీర్ ప్రధాన పాత్రల్లో వచ్చన తాజా ఓటీటీ వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ఎలా ఉందొ ఒకసారి చూద్దాం.

Kumari Srimathi Review Nitha Menens Kumari Srimathi Web Series Review Should you watch or skip
Kumari Srimathi Review Nitha Menens Kumari Srimathi Web Series Review Should you watch or skip

రాజమహేంద్రవరం దగ్గిర ఒక గ్రామంలో శ్రీమతి (నిత్యా మీనన్) హోటల్‍లో మేనేజర్‌గా పని చేస్తుంటుం ది. ఎంత కష్టమొచ్చిన ఇల్లు అమ్మమని తాతయ్య (మురళి మోహన్)కు చిన్నతనంలో మాట ఇస్తుంది . కానీ ఆమె బాబాయ్ కేశవరావు (ప్రేమ్ సాగర్)తో ఆస్తి గొడవ విబేధాలు వస్తాయి. ఇల్లు, రైస్ మిల్లు లాగేసుకుంటాడు కేశవరావు. దీంతో శ్రీమతి, తన తల్లి దేవకి (గౌతమి), చెల్లి కల్యాణి (ప్రణీత పట్నాయక్), నానమ్మ శేషమ్మ (తాళ్లూరి రామేశ్వరి) వేరే ఇంట్లో అద్దెకు ఉంటారు.

తాతల కాలం నాటి ఇల్లును పడగొట్టాలని బాబాయ్ ప్రయత్నిస్తుంటే కోర్టులో కేసు వేస్తుంది శ్రీమతి. కేశవరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం రూ. 38 లక్షలు ఇచ్చి కావాలంటే శ్రీమతే ఇల్లు కొనుక్కోవచ్చని చెబుతుంది. అందుకు 6 నెలలు గడువు ఇస్తుంది . దీంతో బార్ పెట్టి డబ్బు సంపాదించుకోవాలనుకుంటుంది శ్రీమతి. మరి శ్రీమతి ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? ఆమెకు ఎవరెవరు అండ గా నిలిచారు? శ్రీమతి తండ్రి (నరేష్) ఎక్కడికి పారిపోయాడు?, శ్రీరామ్ (నిరుపమ్), అభినవ్ (తిరువీర్) పాత్రలు ఏంటీ? ఇంటిని శ్రీమతి సంపాదించుకుందా? అనేది తెలియాలంటే కుమారి శ్రీమతి సీరియల్ చూస్తూ ఉండాలి.

Kumari Srimathi Review Nitha Menens Kumari Srimathi Web Series Review Should you watch or skip 1
Kumari Srimathi Review Nitha Menens Kumari Srimathi Web Series Review Should you watch or skip 1

తాతయ్యకు ఇచ్చిన మాట కోసం శ్రీమతి చివరికి తన ఇంటిని సొంతం చేసుకుందా అనేదే కుమారి శ్రీమతి కథ. అందుకోసం బార్ పెట్టి డబ్బు సంపాదించే ఆలోచన కొత్తగా ఉంది. కానీ, దాన్ని ఎవరినీ నొప్పించకుండా అందంగా తెరకెక్కించారు. కేవలం రూ. 13 వేలకు పని చేసే శ్రీమతి రూ. 38 లక్షలు సంపాదించుకోవడానికి బార్ పెట్టాలనుకోవడం, అందులోనూ 30 ఏళ్లు వచ్చిన పెళ్లి చేసుకోని మధ్యతరగతి మహిళను చూసే విధానం వంటి అంశాలతో కామెడీ అండ్ ఎమోషనల్‍ తీర్చిదిద్దారు.

ఇంటి ఓనర్ శ్రీరామ్ సహాయంతో బార్ పెట్టాలనుకున్న శ్రీమతి చేసే ప్రయత్నాలు, ఊళ్ళో సొంత వారి నుంచే ఎదురైన పరిస్థితులు, కుటుంబ బంధం , పెళ్లి చేసుకోమని తల్లి ఒత్తిడి చేసే అంశాలు బాగానే చూపించారు. బార్ కోసం లైసెన్స్ ప్రాసెస్, ఈ క్రమంలో ముక్కోణపు ప్రేమ కధ , పెళ్లి ప్రపోజల్స్, చిన్ననాటి ప్రేమలు , హౌటల్ మేనేజ్‍మెంట్ కోర్స్ వంటి పాయింట్స్ ఆకట్టుకుంటాయి. నాలుగో భాగం చివరలో ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేం.

Kumari Srimathi Review Nitha Menens Kumari Srimathi Web Series Review, Nitya Menen New Series
Kumari Srimathi Review Nitha Menens Kumari Srimathi Web Series Review, Nitya Menen New Series

డబ్బు అవసరం ఉన్నా ఇతరులకు నష్టం కలగకుండా శ్రీమతి వ్యాపారం చేసే తీరు, అందుకు పెట్టే రూల్స్ నిజంగా ఆకట్టుకుంటాయి. బార్ కోసం చేసే ప్రయత్నాల్లో ఒక్కో సమస్య రావడం, దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వదిలేయకుండా గివప్ చేయకుండా సాగాలనే స్ఫూర్తినిస్తుంది. అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. అయితే ఈ సీన్లన్నీ కథలో వచ్చే పాత్రలను పరిచయానికి ఉపయోగపడతాయి.

అవసరాల శ్రీనివాస్ పాత్ర కధని మంచి మలుపు తిప్పుతుంది. అలాగే హీరో నాని గెస్ట్ రోల్ చేయడం అనుకోని సర్ప్రైజ్ . అనుకున్నట్లుగా జరుగుతుంది, కధ , సరే ఇక పూర్తవుతుంది అనుకునేలోపే కొత్త సమస్య రావడం బావుంది. మరి సన్నివేశాలు సినిమాటిక్ గ కాకుండా సహజంగా ఉండేలా ఉన్నాయి. , ఇలా జరిగే అవకాశం ఉందన్నట్లుగా చాలా చక్కగా చూపించారు. బార్ మూసేయాలని మహిళలు ధ్వంసం చేస్తే వాళ్లతో మాట్లాడి లిమిట్ డ్రింక్ అని కాన్సెప్ట్ పెట్టడం, డ్రాపింగ్ చేయడం, లాభం కన్నా మనుషుల ఆరోగ్యమే ముఖ్యం అనుకుని , బాధ్యత గా బార్ నడపడం కొత్తగా అనిపిస్తుంది.

సంగీతం బాగుంది. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. రామరాజు లంక అందాలు బాగా చూపించారు. ఇక నిత్యా మీనన్ నటనతో అదరగొట్టింది. డాక్టర్ బాబు నిరుపమ్ సైతం నటనతో మెప్పించాడు. ప్రేమ్ సాగర్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తిరువీర్, గౌతమి, రామేశ్వరి మిగతా పాత్రలు అంతా బాగా చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే సిరీస్ పూర్తయ్యేలోపు ఓ మంచి బార్, ఓ మంచి మందు లాంటి సిరీస్‌లా అనిపిస్తుంది కుమారి శ్రీమతి.

 

Related posts

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Buchi Babu Sana: ఉప్పెన డైరెక్ట‌ర్ ఇంట తీవ్ర విషాదం.. శోక‌సంద్రంలో బుచ్చిబాబు!

kavya N

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri

Kota Factory Season 3: కోట ఫ్యాక్టరీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ తెలుసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ పజిల్ ని సాల్వ్ చేయండి..!

Saranya Koduri

Star Ma New Serial: స్టార్ మా లో మరో సరికొత్త సీరియల్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..?

Saranya Koduri

Brahmamudi May 31 Episode 424: కావ్యను కొట్టిన ఇందిరాదేవి.. అపర్ణని అసహ్యించుకున్న అత్తగారు.. కావ్య మీద భారం వేసిన సుభాష్. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 31 Episode 638:అను ఆర్యాల బిడ్డ గురించి తప్పుగా మాట్లాడిన కుచల.. పద్మావతి తన కోడలని ఫిక్స్ అయిన సుగుణ.. యశోదర్ ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari May 31 Episode 484:మురారి మిస్సింగ్ కృష్ణ కి తెలియనుందా? ముకుంద, కృష్ణల సవాల్.. రేవతి ని ఓదార్చిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..?

bharani jella