Nindu Noorella Saavasam Today Episode సెప్టెంబర్ 30: మెట్లు దిగుతూ భాగమతిని చూసి ఆగిపోతుంది అరుంధతి. ఆగండి మీరు ఎవరు పక్కింటి వాళ్లేనా లేకపోతే ఇంట్లో వాళ్లేనా ఇక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు అని భాగమతి అంటుంది. మేము పక్కింటి వాళ్ళమే అని అరుంధతి అంటుంది. అయితే ఇంట్లో ఎవరు లేనప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని భాగమతి అడుగుతుంది. వీళ్ళ ఇంట్లో ఏదో కార్యం ఉందట రమ్మని పిలిచారు అని అరుంధతి అంటుంది. వాళ్లు కార్యానికి పిలిస్తే మీరు అక్కడికి వెళ్లాలి కానీ ఇంట్లో ఎందుకు ఉన్నారు అసలు ఇంట్లో ఏం చేద్దాం అనుకొని ఉన్నారు అని భాగమతి అంటుంది. ఏమండీ గుప్తా గారు ఆ అమ్మాయి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది ఏదన్నా ఒక సమాధానం చెప్పొచ్చు కదా అని అరుంధతి అంటుంది.

సమస్య అనేది ఆవిడ నిన్ను అడుగుతుంది నువ్వే చెప్పు సమాధానం నాకెందుకు మధ్యలో అని గుప్తా గారు అంటాడు. కార్యం దగ్గర ఏదో మరిచిపోయారు అంట తీసుకురమ్మని నన్ను పంపించారు అని అరుంధతి అంటుంది. మరి వాళ్ళు తీసుకురమ్మన్నది మీరు తీసుకు వెళ్లకుండా ఊరికనే వెళ్తున్నారేంటి అని భాగమతి అంటుంది. అది దొరకలేదు అందుకే తీసుకు వెళ్లట్లేదు అని అరుంధతి అంటుంది. మేడం మీరు నిన్న మా సార్ గదిలోకి వచ్చారా అని భాగమతి అంటుంది. ఏంటి మాకు అదే పనా ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావా మాకు గదులు లేవా మా ఇల్లు లేదా ఏవండీ గుప్తా గారు చెప్పండి అని అరుంధతి అంటుంది. అలా అనగానే అక్కడ ఎవరున్నారు అని భాగమతి అటు ఇటు చూస్తుంది ఇక్కడ ఉన్నది మీరు నేనే కదా ఎవరితో మాట్లాడుతున్నారు అని భాగమతి అంటుంది.కోపం వచ్చినప్పుడు చనిపోయిన మా తాతయ్య తో మాట్లాడుతానండి అని అరుంధతి అంటుంది.

ఏమిటో మీరు ఎందుకు వచ్చారు ఏం మాట్లాడుతున్నారు ఏమో నాకేమీ అర్థం కావట్లేదు అని భాగమతి అంటుంది. సరే నాకు లేట్ అవుతుంది నేను వెళ్తున్నాను అని అరుంధతి వెళ్ళిపోతుంది.ఈవిడ నిజంగానే పక్కింటి వాళ్ళ లేదంటే ఇంకెవరైనాన అని భాగమతి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే గుప్తా అరుంధతి నది దగ్గరికి వస్తారు. అమరేంద్ర పిల్లలు నదిలో స్నానం చేస్తూ ఉంటారు స్నానం చేసి బయటికి వచ్చి పూజ మొదలు పెడతారు. అయ్యా ఫోటో ఇలా ఇవ్వండి అని పూజారి అంటాడు.అయ్యో అన్ని తెచ్చాము కానీ ఫోటో మర్చిపోయావే అని వాళ్ళ అమ్మ అంటుంది.

ఏమే నీలా అన్నీ సర్దవా అంటే సర్దాను అమ్మగారు అన్నావు కదా మరి ఫోటో ఎలా మర్చిపోయావు అని అమరేంద్ర వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మగారు బ్యాగులో పెట్టి ఆ గదిలోనే పెట్టానమ్మా కార్ లో పెట్టాను అనుకున్నాను మర్చిపోయాను అని నీలా అంటుంది. ఏమమ్మా మనోహరి పిల్లల సంగతి నేను చూసుకుంటాను అన్నావు కానీ ఇదేనా నువ్వు చూసుకునేది ఫోటో మర్చిపోయి వచ్చావు ఇప్పుడెలా అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. అంకుల్ నేను ఫోటో కార్లో పెట్టమని నీలాకి ఇచ్చాను అదే మరిచిపోయింది అని మనోహరి అంటుంది. తప్పు చేశావు మనోహరి ఫోటో తీయకుండా చాలా పెద్ద తప్పు చేశావు అన్ని దగ్గర ఉండి నేను చూసుకుంటాను మీకెందుకు అని అన్నావు అంటే నువ్వు దగ్గర ఉండి ఏది చూసుకోవట్లేదు అన్నమాట అయినా భారమంతా నీ మీద వేసి నేను పెద్ద తప్పు చేశాను నేనే చూసుకొని ఉండాల్సింది ఇప్పుడు ఎలా పంతులుగారు అని అమరేంద్ర అంటాడు.

అయ్యా నేను పదేపదే చెప్పాను ఫోటో పెట్టుకున్నారా ముఖ్యమైనది ఫోటో అని చెప్పాను సమయం మించిపోతుంది తర్వాత కార్యం చేసిన ఫలితం ఉండదు అని పూజారి అంటాడు. అయ్యో భగవంతుడా ఇప్పుడు ఎలాగా నా కోడలికి కర్మ చేసుకునే యోగాన్ని కూడా నాకు ఇవ్వలేదే ఒరేయ్ అమరేంద్ర ఇప్పుడు ఎలా రా నా కోడలు ఆత్మ శాంతించకుండా పోతుంది అని వాళ్ళ అమ్మ ఏడుస్తుంది.
గుప్తా గారు ఫోటో ఎందుకు నేనే ఉన్నాను కదా నేను అక్కడ కూర్చుంటాను నాకే పూజ చేయమని చెప్పండి మీరు అని అరుంధతి అంటుంది. అలా చెప్పడం కుదరదు బాలిక అని గుప్తా అంటాడు. ఇప్పుడు ఎలాగండి అందరూ మనోహరిని తిడుతున్నారు అసలే తను సెన్సిటివ్ చాలా బాధపడిపోతుంది అని అరుంధతి అంటుంది. పంతులుగారు నేను వెళ్లి తెస్తాను అని రాథోడ్ అంటాడు. అయ్యా మీరు వెళ్లి వచ్చేసరికి సమయం అయిపోతుంది మీరు వెళ్లకుండా ఫోటో వచ్చే మార్గం చూడండి అని పూజారి అంటాడు. ఇప్పుడు ఎలా పంతులుగారు వెళ్లి రావడానికి గంట సమయం పడుతుంది అని అమరేంద్ర వాళ్ళ నాన్న అంటాడు. పంతులుగారు కార్యక్రమం జరిపించడానికి ఇంకా ఎంత సమయం ఉంది అని అమరేంద్ర అంటాడు. బాబు ఇంకో అర్థగంటలో మొదలు పెట్టాలి అని పూజారి అంటాడు. ఇప్పుడు ఎలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. బాబు మన ఇంట్లో మిస్సమ్మ ఉంది కదా ఆవిడ నీ ఫోటో తీసుకురమ్మని ఫోన్ చేస్తాను అని రాథోడ్ అంటాడు.

తొందరగా రమ్మను అని అమరేంద్ర అంటాడు. సమయానికి ఆ అమ్మాయి ఇంట్లో ఉంది కాబట్టి ఫోటో వస్తుంది లేదంటే ఈ కార్యక్రమం జరగకుండా ఉండేది అని అరుంధతి వాళ్ళ అత్తయ్య అంటుంది. వద్దని దాని వదిలేసినా వెంటపడి వచ్చేలా చేస్తున్నాడు ఆ భగవంతుడు మిస్సమ్మ నీకు టైం కలిసి వస్తుంది అని మనోహరి తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే భాగమతి ఖాళీగా ఉండడం ఎందుకు ఈ ఇల్లంతా చూద్దాము అని పైకి కిందికి తిరుగుతూ అమ్మో ఇంత పెద్ద ఇల్లా ఇంత పెద్ద ఇల్లు ఇంతమంది మనుషుల్ని ఒక్కతే చూసుకునేదట అని భాగమతి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది