Kumari Srimathi Review | Nitya Menen New Series: నిత్యా మీనన్ పేరు వినగానే ఒక అందమైన రూపం, నిగనిగలాడే పసిమి ఛాయా, చక్రాల లాంటి పెద్ద కళ్ళు ఉంగరాల జుట్టు మనకళ్ల ముందు ఉంటుంది. కళ్ళు తిప్పుకోలేనంత అందం తో అభిమానులను ఈమె కట్టిపడేయగలదు . భీంల నాయక్ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని నిత్యా ఇప్పుడు కుమారి శ్రీమతి అనే ఆసక్తి కరమైన పేరున్న ఒక వెబ్ సిరీస్ తో మనముందుకు వచ్చింది. మైన కార్తీక దీపం డాక్టర్ బాబు నిరుపమ్ పరిటాల, తిరువీర్ ప్రధాన పాత్రల్లో వచ్చన తాజా ఓటీటీ వెబ్ సిరీస్ కుమారి శ్రీమతి. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ఎలా ఉందొ ఒకసారి చూద్దాం.

రాజమహేంద్రవరం దగ్గిర ఒక గ్రామంలో శ్రీమతి (నిత్యా మీనన్) హోటల్‍లో మేనేజర్‌గా పని చేస్తుంటుం ది. ఎంత కష్టమొచ్చిన ఇల్లు అమ్మమని తాతయ్య (మురళి మోహన్)కు చిన్నతనంలో మాట ఇస్తుంది . కానీ ఆమె బాబాయ్ కేశవరావు (ప్రేమ్ సాగర్)తో ఆస్తి గొడవ విబేధాలు వస్తాయి. ఇల్లు, రైస్ మిల్లు లాగేసుకుంటాడు కేశవరావు. దీంతో శ్రీమతి, తన తల్లి దేవకి (గౌతమి), చెల్లి కల్యాణి (ప్రణీత పట్నాయక్), నానమ్మ శేషమ్మ (తాళ్లూరి రామేశ్వరి) వేరే ఇంట్లో అద్దెకు ఉంటారు.
తాతల కాలం నాటి ఇల్లును పడగొట్టాలని బాబాయ్ ప్రయత్నిస్తుంటే కోర్టులో కేసు వేస్తుంది శ్రీమతి. కేశవరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం రూ. 38 లక్షలు ఇచ్చి కావాలంటే శ్రీమతే ఇల్లు కొనుక్కోవచ్చని చెబుతుంది. అందుకు 6 నెలలు గడువు ఇస్తుంది . దీంతో బార్ పెట్టి డబ్బు సంపాదించుకోవాలనుకుంటుంది శ్రీమతి. మరి శ్రీమతి ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? ఆమెకు ఎవరెవరు అండ గా నిలిచారు? శ్రీమతి తండ్రి (నరేష్) ఎక్కడికి పారిపోయాడు?, శ్రీరామ్ (నిరుపమ్), అభినవ్ (తిరువీర్) పాత్రలు ఏంటీ? ఇంటిని శ్రీమతి సంపాదించుకుందా? అనేది తెలియాలంటే కుమారి శ్రీమతి సీరియల్ చూస్తూ ఉండాలి.

తాతయ్యకు ఇచ్చిన మాట కోసం శ్రీమతి చివరికి తన ఇంటిని సొంతం చేసుకుందా అనేదే కుమారి శ్రీమతి కథ. అందుకోసం బార్ పెట్టి డబ్బు సంపాదించే ఆలోచన కొత్తగా ఉంది. కానీ, దాన్ని ఎవరినీ నొప్పించకుండా అందంగా తెరకెక్కించారు. కేవలం రూ. 13 వేలకు పని చేసే శ్రీమతి రూ. 38 లక్షలు సంపాదించుకోవడానికి బార్ పెట్టాలనుకోవడం, అందులోనూ 30 ఏళ్లు వచ్చిన పెళ్లి చేసుకోని మధ్యతరగతి మహిళను చూసే విధానం వంటి అంశాలతో కామెడీ అండ్ ఎమోషనల్ తీర్చిదిద్దారు.
ఇంటి ఓనర్ శ్రీరామ్ సహాయంతో బార్ పెట్టాలనుకున్న శ్రీమతి చేసే ప్రయత్నాలు, ఊళ్ళో సొంత వారి నుంచే ఎదురైన పరిస్థితులు, కుటుంబ బంధం , పెళ్లి చేసుకోమని తల్లి ఒత్తిడి చేసే అంశాలు బాగానే చూపించారు. బార్ కోసం లైసెన్స్ ప్రాసెస్, ఈ క్రమంలో ముక్కోణపు ప్రేమ కధ , పెళ్లి ప్రపోజల్స్, చిన్ననాటి ప్రేమలు , హౌటల్ మేనేజ్‍మెంట్ కోర్స్ వంటి పాయింట్స్ ఆకట్టుకుంటాయి. నాలుగో భాగం చివరలో ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఊహించలేం.

డబ్బు అవసరం ఉన్నా ఇతరులకు నష్టం కలగకుండా శ్రీమతి వ్యాపారం చేసే తీరు, అందుకు పెట్టే రూల్స్ నిజంగా ఆకట్టుకుంటాయి. బార్ కోసం చేసే ప్రయత్నాల్లో ఒక్కో సమస్య రావడం, దాన్ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లడం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వదిలేయకుండా గివప్ చేయకుండా సాగాలనే స్ఫూర్తినిస్తుంది. అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది. అయితే ఈ సీన్లన్నీ కథలో వచ్చే పాత్రలను పరిచయానికి ఉపయోగపడతాయి.
అవసరాల శ్రీనివాస్ పాత్ర కధని మంచి మలుపు తిప్పుతుంది. అలాగే హీరో నాని గెస్ట్ రోల్ చేయడం అనుకోని సర్ప్రైజ్ . అనుకున్నట్లుగా జరుగుతుంది, కధ , సరే ఇక పూర్తవుతుంది అనుకునేలోపే కొత్త సమస్య రావడం బావుంది. మరి సన్నివేశాలు సినిమాటిక్ గ కాకుండా సహజంగా ఉండేలా ఉన్నాయి. , ఇలా జరిగే అవకాశం ఉందన్నట్లుగా చాలా చక్కగా చూపించారు. బార్ మూసేయాలని మహిళలు ధ్వంసం చేస్తే వాళ్లతో మాట్లాడి లిమిట్ డ్రింక్ అని కాన్సెప్ట్ పెట్టడం, డ్రాపింగ్ చేయడం, లాభం కన్నా మనుషుల ఆరోగ్యమే ముఖ్యం అనుకుని , బాధ్యత గా బార్ నడపడం కొత్తగా అనిపిస్తుంది.
సంగీతం బాగుంది. విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. రామరాజు లంక అందాలు బాగా చూపించారు. ఇక నిత్యా మీనన్ నటనతో అదరగొట్టింది. డాక్టర్ బాబు నిరుపమ్ సైతం నటనతో మెప్పించాడు. ప్రేమ్ సాగర్ నటన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. తిరువీర్, గౌతమి, రామేశ్వరి మిగతా పాత్రలు అంతా బాగా చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే సిరీస్ పూర్తయ్యేలోపు ఓ మంచి బార్, ఓ మంచి మందు లాంటి సిరీస్‌లా అనిపిస్తుంది కుమారి శ్రీమతి.